తీర్పు (1994 సినిమా)

తీర్పు 1994 లో విడుదలైన కోర్టు వ్తవహారాలపై వచ్చిన సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు ఉప్పలపాటి నారాయణరావు దర్శకుడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జగపతి బాబు, ఆమని, రోహిణి హట్టంగడి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.[1]

తీర్పు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఉప్పలపాటి నరసింహరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
రాజేంద్ర ప్రసాద్,
ఆమని
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ ఎ.ఎన్.ఆర్. ఆర్ట్స్
భాష తెలుగు

జస్టిస్ రామమోహనరావు (అక్కినేని నాగేశ్వరరావు) పై ఈ చిత్రం ప్రారంభమవుతుంది. నక్సలైటైన అతని రెండవ కుమారుడు వేణు (బ్రహ్మజీ) ను పోలీసులు పట్టుకునే క్రమంలో అతను పోలీసు ఎన్కౌంటర్లో మరణిస్తాడు. అందువల్ల అతని భార్య పార్వతి (రోహిణి హట్టంగాడి) దిగ్భ్రాంతికి గురై మాటపడిపోతుంది. ఈ దంపతులకు మరో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు., పెద్ద కుమారుడు ఎసిపి మధు (శరత్ బాబు) మంచివాడిలా నటిస్తాడు గాని, నిజానికి అతడొక లంచగొండి, దుర్మార్గుడు. మూడవ వాడు రవి (జగపతి బాబు) ఒక సోమరిపోతు. న్యాయం కోసం నిలబడతాడు. రాణి (ఆమని) అనే కార్మికురాలి పిచ్చిలో పడిపోతాడు . ఒకసారి రవి మధు అసలు సంగతి తెలుసుకోగా, మధు తెలివిగా రవినే ఇరికిస్తాడు. రామమోహన రావు రవిని బయటకు నెట్టేస్తాడు. అయితే, తండ్రికి తన సోదరుడిపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడం కోసం రవి మారు మాట్లాడకుండా బయటికి పోతాడు.

బుచ్చిబాబు (కోట శ్రీనివాసరావు) సమాజంలో అనేక దుర్మార్గాలు చేస్తూంటాడు. ప్రస్తుతం, రామమోహన రావు కుమార్తె గౌతమి అతడి కుమారుడు రఘును ప్రేమిస్తుంది. రామమోహనరావు తన గురువు గోపాల కృష్ణ (గుమ్మడి) కుటుంబంతో సంబంధం కలుపుకోవా లనుకుంటాడు. ఆ సమయంలో, బుచ్చిబాబు, తన కుమార్తె స్వాతిని ఆకర్షించినందుకు గోపాల కృష్ణ మనవడు సాయిరాంను చంపడానికి చేసిన ప్రయత్నాన్ని వారు చూస్తారు. ఆ గందరగోళంలో, గోపాల కృష్ణ మరణిస్తాడు రామమోహనరావు కేసు నమోదు చేస్తాడు. దాంతో, బుచ్చి బాబు పార్వతిని ఒత్తిడి చేసి, రామమోహనరావుతో మాట్లాడటానికి ఆమెను ఒప్పిస్తాడు. పార్వతి, బుచ్చిబాబు పిల్ల పెళ్ళికి అంగీకరించాడని, అందుకు ప్రతిఫలంగా అతన్ని కేసునుండి బయట పడెయ్యాలని కోరుకున్నాడనీ చెబుతుంది. రామమోహనరావు కోర్టును మోసం చేసి బుచ్చి బాబును విడిపిస్తాడు. రామమోహనరావు మధు అసలు స్వరూపాన్ని తెలుసుకుని, అతన్ని కూడా బయటికి పంపేస్తాడు. రవిని అర్థం చేసుకుని ఆలింగనం చేసుకుంటాడు.

బుచ్చిబాబు మధును పక్కనుంచుకుని సాయిరామును చంపబోతాడు. బుచ్చిబాబు రామమోహనరావును కాల్చబోగా మధు అడ్డుపడి తండ్రిని రక్షిస్తాడు. తన తప్పులకు పశ్చాత్తాపపడి, తుది శ్వాస విడుస్తాడు. రామమోహనరావు బుచ్చి బాబును చంపేస్తాడు. చివరగా, రామమోహనరావును నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో సినిమా ముగుస్తుంది.

నటీనటులు

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ముద్దుకు ముద్దే"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర4:33
2."కళ్ళెర్రబడ్డ చూపుల"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:53
3."సక్కనోడు సక్కనోడు"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:59
4."బోసినవ్వు బుజ్జినాన్న"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:30
5."అలక చిలకా"వెన్నెలకంటిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:12
6."మనసైన మమతాలయం"వెన్నెలకంటిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం1:39
మొత్తం నిడివి:24:46

మూలాలు

మార్చు
  1. "తీర్పు (1994) | తీర్పు Movie | తీర్పు Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-08-04.