రోహిణీ హట్టంగడి

సినీ నటి

రోహిణీ హట్టంగడి ప్రముఖ భారతీయ నటి. ఈమె పలు భారతీయ భాషల చిత్రాలలో, టెలివిజన్ కార్యక్రమాలలో ప్రాధాన్యాతా పాత్రలను పోషించి మంచి నటిగా గుర్తింపు పొందినది. గాంధీ సినిమాలో పోషించిన కస్తూర్బా పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

రోహిణీ హట్టంగడి
బిగ్ ఎఫ్.ఎమ్ మరాఠీ అవార్డుల సందర్భంగా రోహిణీ హట్టంగడి
జననం
రోహిణీ ఓక్

(1951-04-11) 1951 ఏప్రిల్ 11 (వయసు 73)
క్రియాశీల సంవత్సరాలు1975–ప్రస్తుతం
జీవిత భాగస్వామిజయదేవ్ హట్టంగడి (1977–2008; ఆయన మరణం); 1 కుమారుడు

జీవిత విశేషాలు

మార్చు

ఈమె ఏప్రిల్ 11 1951లో పూణేలో జన్మించింది. ఆమె అసలు పేరు రోహిణీ ఓక్. 1966లో పూణేలోని రేణుకా స్వరూప్ స్మారక బాలికోన్నత పాఠశాల నుండి విద్యాభ్యాసం పూర్తిచేసుకొంది.[1] ఈమె ఒక సాంప్రదాయ నర్తకి కూడా. కథాకళి, భరతనాట్యాలలో ఎనిమిదేళ్లు శిక్షణ పొందింది.

ఆ తరువాత 1971లో కొత్త డిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరింది. రంగస్థలంపై ఆసక్తి ఉండటం, సినిమాలోకి వెళ్ళాలన్న ప్రణాళికలేవి లోకపోవటంతో, ఆమె స్వస్థలమైన పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఉన్నా, దానిలో చేరలేదు. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ రోహిణి "నాకు కేవలం నటి కావలన్న ఆసక్తి ఉండేది... నా మనసంతా రంగస్థలంలోనే ఉన్నది, ఎందుకంటే మానాన్న (అనంత్ ఓక్) నిజమైన నటన రంగస్థలంపైనే నేర్చుకోవచ్చని చెప్పేవారు. అందుకే ఎన్.ఎస్.డీ.లో చేరటానికి అంత దూరంలోని దిల్లీకి వచ్చాను." అని చెప్పింది[2] ఎన్.ఎస్.డీ.లో, తన భావి భర్త జయదేవ్ హట్టంగడిని కలిసింది. వీరిద్దరూ ఒకే బృందంలో చదువుకున్నారు. వీరిద్దరూ అదేసమయంలో ఇబ్రహీం అల్కాజీ వద్ద శిక్షణ పొందారు.[3] నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 1974లో ఆమె డిగ్రీ పూర్తి అయ్యేనాటికి ఆమె ఉత్తమ నటిగా, ఉత్తమ ఆల్ రౌండర్‌గా, జయదేవ్ హట్టంగడి ఉత్తమ దర్శకుడిగా ఎన్నుకోబడ్డారు. ఈమెకు అసీమ్‌ హట్టంగడి అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త 2008లో కేన్సర్‌తో బాధపడుతూ మరణించాడు.

నాటకరంగం

మార్చు

ఈమె తన నాటక ప్రస్థానాన్ని మరాఠీనాటకాలతో ప్రారంభంచింది. ఢిల్లీలో నేషనల్ డ్రామా స్కూలులో చదువుకునే సమయంలోనే తన భర్త జయదేవ్‌తో కలిసి ముంబాయిలో ఆవిష్కార్ అనే నాటక సంస్థను ప్రారంభించి దాని ద్వారా 150 నాటకాలలో నటించి ప్రదర్శించింది. ఈమె కన్నడ యక్షగానాలలోను, జపనీస్ కబుకి నాటకాలలోను నటించిన మొదటి మహిళ. అపరాజిత అనే 120 నిమిషాల ఏకాంకికలో ఈమె నటనకు పలువురి ప్రశంసలు లభించాయి. బెంగాలీ కథ ఆధారంగా రూపొందించబడిన ఈ ఏకాంకిక హిందీ, మరాఠీ భాషలలో అనేక ప్రదర్శనలు పొందింది. ఈమె తన భర్తతో కలిసి ముంబాయిలో కళాశ్రయ్ అనే, మరో సంస్థను కూడా స్థాపించి నాటక కళకు పాటుపడింది.

సినిమారంగం

మార్చు

అరవింద్ దేశాయ్‌కీ అజీబ్ దస్తా అనే చిత్రంతో ఈమె సినీరంగ ప్రవేశం జరిగింది. రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ చిత్రంలో ఈమె బెన్‌కింగ్స్‌లే సరసన కస్తూరీబా పాత్రలో నటించింది. ఈ చిత్రం ఈమెకు మంచి పేరు, పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈమె ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, మలయాళ, తమిళ భాషాచిత్రాలలో మంచి పాత్రలను పోషించింది. ఈమె నాటకాలు, సినిమాలలోనే కాకుండా టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు సంపాదించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
1978 అరవింద్ దేశాయ్ కి అజీబ్ దాస్తాన్ శిల్పా హిందీ
1980 ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యోం అతా హై వివేక్ భార్య
1981 చక్ర లక్ష్మి
1982 గాంధీ కస్తూర్బా గాంధీ ఆంగ్ల గెలుపొందింది – సహాయ పాత్రలో ఉత్తమ నటిగా BAFTA అవార్డు
అర్థ్ పూజా పని మనిషి హిందీ గెలుచుకుంది - ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
1984 సారాంశ్ పార్వతి ప్రధాన్ నామినేట్ చేయబడింది – ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
భావన శోభ నామినేట్ చేయబడింది – ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
పార్టీ మోహిని బార్వే గెలుచుకుంది - ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు
మోహన్ జోషి హజీర్ హో! డిఫెన్స్ లాయర్
1985 అఘాత్ శ్రీమతి అలీ
1986 సూర్య కన్నడ
1987 అచ్చువెట్టంటే వీడు రుక్మిణి కుంజమ్మ మలయాళం
ప్రతిఘాట్ దుర్గ హిందీ
జల్వా శ్రీ బేబీ
1988 షాహెన్‌షా శాంతి (విజయ్ తల్లి)
హీరో హీరాలాల్ రూప సవతి తల్లి
ఆకర్షణ్ దీదీ
1989 బిల్లూ బాద్షా బిల్లు తల్లి
లడాయి శ్రీమతి శాంతి శర్మ
చాల్‌బాజ్ అంబా
1990 అగ్నిపథ్ సుహాసిని చౌహాన్ గెలుచుకుంది - ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
శివ ప్రకాష్ తల్లి
1991 ఏక్ ఘర్
మేన్ కన్నడ
సీతారామయ్యగారి మనవరాలు సీతారామ్మయ్య భార్య జానకమ్మ తెలుగు
1992 రాత్రి మనీషా శర్మ తల్లి
రాత్ హిందీ
1993 దామిని శ్రీమతి సుమిత్రా గుప్తా
1994 తీర్పు పార్వతి తెలుగు
భలే పెళ్ళాం
1995 టాప్ హీరో అమ్మా
అగ్నిదేవన్ అనియంకుట్టన్ అమ్మమ్మ మలయాళం
1996 లిటిల్ సోల్జర్స్ రాజేశ్వరి దేవి తెలుగు
ఘటక్ సావిత్రి హిందీ
1997 టున్ను కి టీనా తున్నుని తల్లి
2000 పుకార్ శ్రీమతి మల్లప (పూజ తల్లి)
2001 లజ్జ శ్రీమతి హజారీలాల్
అవగత్ రమ్య తల్లి
2002 బధాయై హో బధాయై రోజీ డిసౌజా
2003 మున్నా భాయ్ MBBS పార్వతి శర్మ
2004 వసూల్ రాజా MBBS కస్తూరి వెంకటరామన్ తమిళం
2008 కర్జ్జ్జ్ శాంత ప్రసాద్ వర్మ హిందీ
2009 గణేష్ దివ్య అత్త తెలుగు
2012 శిరిడి సాయి గంగా బాయి
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బోండం/బామ్మా
రామయ్యా వస్తావయ్యా బేబీ
డేవిడ్ మాలతీ తాయ్ హిందీ/తమిళం
ప్రేమచి గోష్ట రాముని తల్లి మరాఠీ
2014 వీరం కొప్పెన్రుందేవి తమిళం
2015 మామిడి డ్రీమ్స్ పద్మ ఆంగ్ల
2016 బ్రహ్మోత్సవం మహాలక్ష్మి సవతి తల్లి తెలుగు
2018 చల్ మోహన్ రంగ
ఆక్సిజన్ గుజరాతీ
2019 చిత్రలహరి న్యాయమూర్తి తెలుగు
కొలైయుతిర్ కాలం తమిళం
2019 ఇంకొక సారి మరాఠీ
2022 జల్సా రుక్మిమి హిందీ
2023 కిసీ కా భాయ్ కిసీ కి జాన్ గుండమనేని పుష్పాంజలి హిందీ
బైపన్ భారీ దేవా జయ మరాఠీ
2024 ఆట వేల్ జాలీ రంజన లేలే మరాఠీ
ఫ్యామిలీ స్టార్ గోవర్ధన్ అమ్మమ్మ తెలుగు

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష
1997-1999 తోడా హై థోడే కీ జరూరత్ హై హిందీ
1998 మహాయజ్ఞం విమల
1999 ముస్కాన్ రాహుల్ తల్లి
2001–2013 చార్ దివాస్ ససుచే ఆశాలతా దేశ్‌ముఖ్ మరాఠీ
2007-2009 వాహినీసాహెబ్ షాలినీ భోసలే
ఘర్ కి లక్ష్మి బేతియన్ గాయత్రి హిందీ
2011 మాయ్కే సే బంధి దోర్ లత
2012 ఛల్ - షెహ్ ఔర్ మాత్ జ్యోతిష్యుడు
2013-2016 హోనర్ సూన్ మి హ్య ఘర్చీ భాగీరథి గోఖలే (ఆయ్ ఆజీ) మరాఠీ
2017-2018 తుజా మజా బ్రేకప్ ఆజీ
2020-2021 డాక్టర్ డాన్ స్నేహలత
2020-2021 సుఖీ మాంసాచ సాదర హంస
2021 మోతీ బా నీ నాని వహూ కాకీ బా గుజరాతీ
2023 యశోదా -- గోష్టా శ్యామచ్య ఆయిచీ రుక్మిణి పర్చూరు మరాఠీ

అవార్డులు, రివార్డులూ

మార్చు
  • 1975లో మహారాష్ట్ర రాష్ట్రస్థాయి నాటకోత్సవాలలో ఉత్తమ నటి అవార్డు.
  • 1982లో "గాంధీ" చిత్రంలో కస్తూరీబా గాంధీ వేషానికి ఉత్తమ సహాయక నటిగా బ్రిటిష్ అకాడమీ ఫిలిం (BAFTA) అవార్డు.
  • 1984లో "అర్థ్" చిత్రానికి ఉత్తమ సహాయ నటి అవార్డు.
  • 1985లో "పార్టీ" చిత్రంలో మోహిని పాత్రకు ఉత్తమ సహాయనటిగా నేషనల్ ఫిలిమ్‌ అవార్డు.
  • 1990లో "అగ్నిపథ్" చిత్రంలో సుహాసినీ చౌహాన్ పాత్రకు ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డు.
  • 2004లో సంగీత నాటక అకాడెమీ అవార్డు.

మూలాలు

మార్చు
  1. "Alumni put up class act for alma mater" Archived 2008-06-21 at the Wayback Machine, Indian Express, 20 December 2002.
  2. Kumar, Anuj (2010-06-04). "Cast in a different mould". The Hindu. Archived from the original on 2011-06-29. Retrieved 2011-02-24.
  3. "Profile: "I Was Recognised For My Genius"". The Outlook. 18 December 1996.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు