తుర్కయాంజల్
తుర్కయాంజాల్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1] ఈ గ్రామం జిల్లా సరిహద్దులో ఉంది. ఇది ఈ మండలంలో పెద్ద గ్రామం. తుర్కయాంజల్ గ్రామ పరిధిలో మణిముత్యాలమ్మ కుంట, సంజీవరెడ్డి నగర్, శ్రీశ్రీ నగర్, కుర్మగూడ ఉప గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న తుర్కయంజల్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
తుర్కయాంజల్ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°16′17″N 78°35′00″E / 17.271512°N 78.583399°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | అబ్దుల్లాపూర్ మెట్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 8,903 |
- పురుషుల సంఖ్య | 4,650 |
- స్త్రీల సంఖ్య | 4,253 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[3]
గణాంకాలు
మార్చు2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 8903 పురుషులు 4650, స్త్రీలు 4253. నివాస గృహాలు 1927, విస్తీర్ణం 2053 హెక్టార్లు. ప్రధాన భాష తెలుగు.
రవాణ సౌకర్యాలు
మార్చుఈ గ్రామం హైదరాబాదు - నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపైనున్నందున ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది. హయత్ నగర్ ఇక్కడికి 9 కి.మీ దూరంలో ఉంది. రోడ్డు సౌకర్యం ఉంది.
పాఠశాలలు
మార్చుఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఒక అంగన్ వాడీ కేంద్రం ఉంది. సెయింట్ పాల్ స్కూలు, కె.బి.సైనిక హైస్కూలు ఉన్నాయి.
ఇతర గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామంలో ఒక బిస్కట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ వేంకటేశ్వరస్వామి దేవాలయం, బాలఏసు మందిరం అనే చర్చి ఉంది.
చిత్రమాలిక
మార్చు-
వీరమణి బిస్కేట్ ప్యాక్టరీ అవుట్ సైడ్
-
తుర్కయాంజల్ గ్రామం సైన్ బోర్డు
-
తుర్కయాంజల్ శ్లోక పాఠశాల సైన్ బోర్డు
-
సిమ్మెంట్ బ్రిక్స్ తయారీ ప్యాక్టరీ
-
బాలయేసు చర్చి ప్రాంగణం
-
మస్కటి డైరీ పార్లర్
-
తుర్కయాంజల్ మీదుగా నాగార్జున్ సాగర్ రోడ్డు
మూలాలు
మార్చు- ↑ https://www.census2011.co.in/data/town/574202-turkayamjal-andhra-pradesh.html
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 26 March 2021.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.