తూర్పు కాపు
తూర్పు కాపు/గాజుల కాపు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 30వ కులం.[1]
తుర్పు కాపు | |
---|---|
వర్గీకరణ | ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా |
మతాలు | హిందూమతం |
వాస్తవ రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్,ఒడిశా,తెలంగాణ |
జనాభా గల రాష్ట్రాలు | ఆంధ్రప్రదేశ్,తెలంగాణ |
జనాభా | 16 లక్షలు |
Subdivisions | గాజుల కాపు |
Reservation (Education) | బి.సి-డి |
Reservation (Employment) | బి.సి-డి |
చరిత్ర
మార్చుకాపు అనగా రక్షకుడు (protector) అని పురాతన కాల నిర్వచనం . వీరు చాలా శాతబ్దాలకి పూర్వము కాంపిల్య నగరం నుండి వచ్చిన కాంపు వారని ప్రతీతీ. చాలా శాతాబ్దాలు గడిచిన పిదప స్థానికులుగా గుర్తింపునొందిరి. ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్రా ప్రాంతం లో స్థానిక కులాలలో నుండు తూర్పు మరియు పడమర అను దేశీయ భేదమే కాపులలోనూ ఏర్పడినది. నవీన కాలమున వలస వచ్చిన కులాలలో ఇట్టి భేదము కానరాదు. తూర్పు ప్రాంతంలో నివసిస్తున్న కాపులను తూర్పుకాపులు అంటారు. వీరులో అత్యధికులు సైన్యంలో పని చేస్తూ ఉత్తరాంధ్రా ప్రాంతంలో చాలా గ్రామాలకు పెద్దలుగా వ్యవహరించడం వలన నాయుడోరు ( దక్షణాంద్ర లో గ్రామ పెద్దను పెదకాపు అంటారు ) అని తూర్పు నాయుళ్ళని ,అంటారు. అనంతర కాలంలో కాపులు వ్యవసాయన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేయటం వలన కాపు అంటే వ్యవసాయదారుడు అని కూడా చెబుతారు. నాయుడు అనేది తుర్పు కాపుల బిరుదు . వీరితో పాటు గాజుల కాపులు అనువారు కలరు వారు చరిత్రకంగా గంగభూపతులుగా చెప్పుకొందురు.వీరు పూర్వము మాన్యరాజులు మరియు కాపురాజులుగా కీర్తి నొందిన వారు. అనంతర కాలంలో వీరు సైనికులు గాను గ్రామ పెద్దలుగాను, అత్యధిక గ్రామాలకు మున్సబ్లు గా కూడా చేసారు. మరియు వీరు పూర్వము గాజులు తయారుచేసి అమ్మకం చేసెడి వారు, నేడు వీరు గాజుల వ్యాపారం వదిలి బంగారు నగల వాణిజ్యంలోను మరియు వివిధ వ్యాపారములను చేయుచున్నారు. వీరులో కొందరు బంగారు నగల తయ్యారి యందు ప్రావీణ్యము పొంది స్వర్ణకార వృత్తి చేయుచున్నారు. ఇంకొందరు వ్యవసాయం కూడా చేయుదురు వీరుని గాజుల వారు అని గాజుల నాయుడోరు అని గాజుల కాపు వారు అని గాజు కాపు వారు అని పిలవబడుతున్నారు. వీరి నుండి ఏర్పడిన వారే అయ్యారిక కాపులు(వీరికి పాత్రుడు బిరుదు కలదు )నేడు వీరు ప్రత్యేకంగా గుర్తించబడుచున్నారు. ఉత్తరాంధ్ర లో మహానాటి కాపులు అను వారు కూడా గాజులకాపు వారే. ఆంధ్ర ప్రాంతమున గాజుల కాపు వారికి నాయుడు , పాత్రుడు అనునవి బిరుదు నామములు. ఒరిస్సా ప్రాంతమున నివసిస్తున్న గాజుల కాపులకు నాయుడు, దేవు, ప్రధాన్, పాత్రుడు అను బిరుదు నామములు కలవు. ధరస్ట్రన్ రచించిన క్యాస్ట్ & ట్రైబ్స్ అను పుస్తక సంపుటలలో కాపు విభాగంలో గాజుల వారిని ప్రస్థావిస్తూ వీరికి గోష వున్నదని వీరు బలిజలు అయివుండవచ్చని తెలపడం జరిగింది.
విస్తరణ
మార్చుఉత్తరాంధ్రలో అత్యధిక సంఖ్యాకులు తూర్పుకాపులు / గాజులకాపులు రెండు శాతాబ్దల పూర్వం గంగభూపతులుగా, సైనికులుగా, వ్యాపారులుగా, భూస్వాములుగా ఎంతో ఉన్నతమైన జీవనంతో సామజిక గౌరవం పొందిన వీరు గత శాతబ్ద కాలంగా వీరు జీవన స్థితిగతులు పూర్తిగా దిగజారి ఎకరం నుండి ఐదు, పది ఎకరాల సన్నకారు రైతులుగా మారడం, వర్షాదార పంట వలన కరువులు ఏర్పడిన సందర్భంలో ఉత్తరాంధ్రను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు గణనీయంగా వలసపోయి వ్యవసాయ కవులు దారులుగా, వ్యవసాయ కూలీలు గా ఇతర పనులయందు జేరి ఆర్థిక , సామాజిక వెనకభాటుకు గురైనారు . తూర్పుకాపులు మరియు గాజులకాపులు ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, తెలంగాణలో హైదరాబాద్, ఒడిస్సాలో గంజాం, గజపతి, రాయగడ జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తుర్పుకాపు /గాజులకాపు జనాభా 16 లక్షలు మాత్రమే[2] కానీ వారి సంఖ్య 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటారని ఆ కుల సంఘము వారు తెలుపుచున్నారు.
రిజర్వేషన్లు
మార్చుతూర్పుకాపు / గాజులకాపు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 30వ కులం. రిజర్వేషన్గకు పూర్వము వీరు కాపు వారిగా అగ్రవర్ణ జాభితాలో ఉండెడివారు. ఉత్తరాంధ్రలో వర్షాదార పంటల వల్ల వీరి యొక్క ఆర్ధిక, సామాజిక వెనుకబాటు కారణం గా వీరికి వున్న కొద్దిపాటి భూములను అమ్ముకుని వలసలు వెళ్ళుట వలన వెనుకబడిన తరగతులు గా గుర్తింపబడెందుకు వీరు చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వం గుర్తించి అప్పటి వరకు కాపువారిగా అగ్రకులంగా ఉన్న వీరిని తూర్పు , పడమర దేశీయ భేదాన్ని మరియు సామజిక వెనకబాటును ఆధారంగా చేసుకొని తూర్పు ప్రాంత కాపు వారిని తూర్పు కాపు పేరుతో బీసీ (డి ) రిజర్వేషన్ కల్పించడం జరిగింది. పడమటి కాపు వారిని కాలువ ఆధారిత పంటలు కారణంగా వారి జీవన స్థితిగతులు మెరుగుగా ఉండుట చేత కాపు పేరుతో ఓసీ లుగానే ఉంచడం జరిగింది. కొంతకాలనికి గాజుల వారు కూడా తూర్పుకాపులతో జేరి గాజులకాపు పేరుతో బీసీలుగా గుర్తించబడినారు. కానీ బీసీ లలో ఏ, బి, సి, డి వర్గీకరణ లో ' డి ' కి అంతగా అవకాశాలు లేకపోవడంతో వీరు ఆశించినంతగా అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. కావున వీరు తమని బీసీ (ఏ ) జాబితాలో చేర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నారు.
ప్రముఖులు
మార్చుసినీ నటులు
మార్చు- కోరాడ సింహాచలం ( ఆంధ్రా దిలీప్ కుమార్ )(సంబరాల రాంబాబు సినిమా ఫేమ్ చలం )
- కోడి రామకృష్ణ ( సినీ దర్శకులఆశించినం )
- గంట్ల రామకృష్ణ ( సినీ నటుడు )(పూజ, నోము సినిమాల పేమ్ )
- అలమండ పాండురంగస్వామి ( ఏలేశ్వం రంగా ) ( సినీ నటుడు )
- సారిక రామచంద్రరావు ( సినీ నటుడు )
- శివాల ప్రభాకర్ (సినీ దర్శకుడు )
- కొంగరాపి వెంకటరమణ (సినీ దర్శకుడు )
- కరుమజ్జి శివ నాగేశ్వరావు ( సినీ దర్శులు )
- మీసాల కోట మావుళ్ళయ్య ( సినీ నిర్మాత )
- వాకాడ అప్పారావు ( సినీ నిర్మాత )
- కొంగరాపు రాంబాబు ( సినీ దర్శకుడు )
- మామిడి సూర్యతేజ ( సినీ నటుడు )
- గేదలు ఆనందబాబు ( g ఆనంద్ )( సినీ గేయ రచయిత )
- కరుమజ్జి సత్యన్నారాయణ (సినీ నిర్మాత )
- ఎస్ ఎస్ రవిచంద్ర (సారిక శ్రీ రవిచంద్ర )(సినీ దర్శకుడు )
వ్యాపారవేత్త
మార్చులోలుగు మదన్ ( ఒన్ అఫ్ థ ఫౌండర్ అఫ్ అడాప్ట్ చిప్స్ )
గేదల శ్రీనుబాబు ( ఫౌండర్ అండ్ సి ఇ ఒ అఫ్ పల్సస్ )
రాజకీయా నాయకులు
మార్చు- కీ శే గొర్లె శ్రీరాములు నాయుడు (మాజీ మంత్రి)
- కీ శే దారపు లచ్చన్న నాయుడు (మాజీ ఎమ్మెల్యే, ఒడిస్సా )
- కోడూరి నారాయణరావు (మాజీ ఎమ్మెల్యే, ఒడిస్సా )
- కర్రి నారాయణ రావు, (మాజీ ఎంపీ)
- కీ శే ధర్మాన నారాయణ రావు నాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- కీ శే కోట్ల సన్యాసి అప్పలనాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- పాలవలస రాజశేఖరం (మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే)
- కెంబూరి రామ్మోహన్ రావు (మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే)
- కొండపల్లి పైడితల్లి నాయుడు (మాజీ ఎంపీ)
- బొత్స ఝాన్సీ లక్ష్మి (మాజీ ఎంపీ))
- బొత్స సత్యనారాయణ (రాష్ట్ర మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ)
- పతివాడ నారాయణస్వామి నాయుడు (మాజీ మంత్రి)
- కిమిడి కళా వెంకటరావు (మాజీ మంత్రి, టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు మాజీ అధ్యక్షుడు)
- కిమిడి మృణాళిని (మాజీ మంత్రి)
- బడ్డుకొండ అప్పల నాయుడు ( మాజీ ఎమ్మెల్యే)
- కొండపల్లి అప్పల నాయుడు (ఎమ్మెల్యే)
- మజ్జి చిన్న శ్రీను (జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం )
- కొండపల్లి శ్రీనివాస్ (ఎమ్మెల్యే )
- కలమట మెహనరావు
- కలమట వెంకటరమణ
- మీసాల గీత
- రౌతు సూర్యప్రకాష్ రావు(మాజీ ఎమ్మెల్యే )
- రెడ్డి అప్పలనాయుడు
- కలిశెట్టి అప్పలనాయుడు (ఎంపీ )
- మీసాల నీలకంఠం నాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- కీ శే బొత్స ఆదినారాయణ (మాజీ ఎమ్మెల్యే )
- బొత్సా అప్పలనరసయ్య (మాజీ ఎమ్మెల్యే )
- కీ శే గొర్లె హరిబాబు నాయుడు (మాజీ ఎమ్మెల్సీ )
- గొర్లె కిరణ్ కుమార్ నాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- పొట్నూరు సూర్యనారాయణ నాయుడు (మాజీ ఎమ్మెల్యే )
- ముదిలి బాబూ పరాంకుశం నాయుడు ( మాజీ ఎమ్మెల్యే )
- బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు )(మాజీ ఏంపి )
- కొరికాన రవికుమార్ (suda చైర్మన్ )
- దర్మేంద్ర ప్రధాన్ ( ఒడిస్సా )
- దేవేంద్ర ప్రధాన్ ( ఒడిస్సా )
- కరణం ధర్మశ్రీ (ఎమ్మెల్యే )
- మామిడి గోవిందరావు (ఎమ్మెల్యే పాతపట్నం )
- రెడ్డి శాంతి
- తాడ్డి శకుంతల (ex మేయర్ అఫ్ విజయవాడ )
- బలగం సేతుబంధన సీతారామం ( ex చైర్పర్సన్ అఫ్ తణుకు )
- మేరగాని నారాయణమ్మ(ex చైర్పర్సన్ అఫ్ భీమవరం )
- గమిడి సూర్యారావు ( ex చైర్పర్సన్ అఫ్ పాలకొల్లు )
- పతివాడ నూక దూర్గారాణి ( చైర్పర్సన్ అఫ్ మండపేట )
- శిడగం పాపారావు ( ex ఛైర్పర్సన్ అఫ్ పాలకొల్లు )
మూలాలు
మార్చు- ↑ "Caste in Andhra". www.vepachedu.org. Retrieved 2020-09-25.
- ↑ Rao, K. Srinivasa (2022-12-28). "Turpu Kapu association demands BC-A status for community". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-30.