తూర్పు తక్కెళ్లపాడు

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, జే.పంగులూరు మండలం లోని గ్రామం


తూర్పు తక్కెళ్ళపాడు బాపట్ల జిల్లా, జనకవరం పంగులూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జనకవరం పంగులూరు నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 447 ఇళ్లతో, 1652 జనాభాతో 573 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 828, ఆడవారి సంఖ్య 824. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 674 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 63. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590755[2].తూర్పు తక్కెళ్లపాడు ఆంధ్రపద్రేశ్ రాష్టం్ర పక్రాశం జిల్లాలో జనకరం పంగులూరు మండలంలో ఒక గ్రామంఇది

తూర్పు తక్కెళ్లపాడు
పటం
తూర్పు తక్కెళ్లపాడు is located in ఆంధ్రప్రదేశ్
తూర్పు తక్కెళ్లపాడు
తూర్పు తక్కెళ్లపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°47′31.200″N 80°4′22.800″E / 15.79200000°N 80.07300000°E / 15.79200000; 80.07300000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంజే.పంగులూరు
విస్తీర్ణం5.73 కి.మీ2 (2.21 చ. మై)
జనాభా
 (2011)[1]
1,652
 • జనసాంద్రత290/కి.మీ2 (750/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు828
 • స్త్రీలు824
 • లింగ నిష్పత్తి995
 • నివాసాలు447
ప్రాంతపు కోడ్+91 ( 08593 Edit this on Wikidata )
పిన్‌కోడ్523213
2011 జనగణన కోడ్590755

జిల్లా హెడ్ క్వా ర్టర్స్ ఒంగోలు నుండిఉత్తర దిశగా 41 కిమీ దూరంలో ఉంది...

తక్కెళ్ళపాడు గ్రామచరిత్ర

తక్కెళ్ళపాడు అను గ్రామ నామం తొలుత క్రీస్రీ్తు శకం రెండవ శతాబ్దంలో జగ్గయ్యపేట శాసనం నందు, బౌద్ధవాంగ్మయంలో కన్పి స్తుంది. తక్కెళ్ళపాడు అనగా తక్కిలికాయ = టమోటకాయ అని,

పాటిఅనగా పస్రిద్ధిచెందిన ప్రాంతం లేక గొప్పదైన పద్రేశం అని అర్ధం.

బౌద్ధబిక్షకులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పు డు టమోట పంటకు పస్రిద్ధిచెందిన ప్రాంతము అనేఉద్దేశంతో

తక్కిలిపాటిఅని పిలవటం జరిగింది. కాలకమ్ర ేన తక్కెలిపాటిగా పస్రిద్ధిచెందింది. అదిఇప్పు డు

తక్కెళ్ళపాడుగా పిలుచుచున్నా రు.

ఆందద్రేశంలో దాదాపు 39గ్రామాలకు ఈపేరు ఉంది. పతి్రజిల్లాలో దాదాపుగా 1, 2 గ్రామాలకు ఈ

పేరు ఉంది.

1) 12వ శతాబ్దంలో కాకతీయుల యొక్క పాలనలో తీరాంద్రప్రాంతమైన మోటుపల్లి అనేపస్రిద్ధ

ఓడరేవు ఉంది. (పస్ర్తుతం పక్రాశంజిల్లా). ఈ ఓడరేవునకు రోమన్, చైనీస్, పోర్చు గీసు దేశాలతో వ్యా పారం

జరిగింది. ఈకాలమున ఉత్తర భారతదేశమున ముస్లింలు దండయాత్రజరుగుతూ ఉండటంవల్లఅప్పటివరకు

అరబ్బు లనుండిగుర్రాలు దిగుమతి చేసుకునేభారతీయ రాజులు ముస్లింల సంఘర్షణలతో పోర్చు గీసు,

చైనీసు, రోమన్ల నుంచి గుర్రాలు దిగుమతి చేసుకోవడం జరిగింది. ముప్పా ళ్ళ శాసనం పక్రారం కాకతీయుల

సామంతులైన రెడ్డిరాజులు ఈ గుర్రాలను దిగుమతి చేసుకుని వాటికిశిక్షణ ఇచ్చి కాకతీయ రాజులకు

అందించేవారు. ఈ శాసనంలో మోటుపల్లి, చినగంజాం, ఉప్పు గుండూరు, రాచపూడి, రావినూతల,

తక్కెళ్ళపాడు, ధర్మవరం, అద్దంకి, గ్రామాలపేర్లు కన్పి స్తున్నా యి. అయితేతక్కెళ్ళపాడు ప్రాంతం వేపచెట్లు,

చింతచెట్లు, మర్రిచ్రి ెట్లతో పచ్చి క బైళ్ళతో సెలయేళ్ళు వనాలతో రమణీయంగా ఉంది. గుర్రాలను దిగుమతి

చేసుకున్న వర్తకులు ఇక్కడ వీటిటిశిక్షణ ఇచ్చి పాలకులకు అందించేవారు. గుర్రాల వ్యా పారానికి

కేందబి్రందువు కావటం వలన దీనిని గుర్రాల తక్కెళ్ళపాడుగా లేదా అశ్వా ల తక్కెళ్ళపాడుగా పిలవటం

జరిగింది.

2) అద్దంకిని పాలిస్తున్న రెడ్డిరాజులు (శైవమతస్తులు) ఈ కాలంలో శైవ, వైష్ణమతాల మధ్య విరోధాల

వల్లపభ్రువు అనుసరిస్తున్న మతమేపజ్రలకు శాసనం కావటం వల్లకొటప్పకొండ కేందం్రగా శైవమతం

పచ్రారం జరిగింది. ఇందులో భాగంగా వ్యా పార కేందం్రగా ఉన్న తక్కెళ్ళపాడు ప్రాంతాన్ని శైవమతాన్ని పచ్రారం

చేసేశైవులకు ఇవ్వటం జరిగింద.ి వీరినేజంగమ దేవరులని పిలవటం జరిగింద.ి ఈ జంగముల యొక్క

ఆధీనంలో ఉండటంవల్లజంగాల తక్కెళ్ళపాడుగా పిలవటం జరిగింది.

3) కృష్ణదేవరాయుల గురువు అయిన తాతాచార్యులు ఈ ప్రాంతాన్ని తనయొక్క శ్రీవైష్ణవ మతాన్ని

అనుసరించిన వేద పండితులు అయిన తిరుపతి ప్రాంతంలో నివసిస్తున్న “శ్రీమాన్ వేదాంత దేశికాచార్యు లు”

ఆధ్వర్యంలో తిరుమల తమిళ బహ్ర ్మణులైన అయ్యంగార్స్ కిఈ అగహా్ర రం ఇవ్వటం జరిగింది. ఈయనేమన

అయ్యగారివంశ మూల పురుషుడు...ఈ అగహా్ర రం క్రిం్రిద 21గ్రామాలు ఉండేవి. 8 అద్దంకికిపడమటవైపు,

13 తక్కెళ్ళపాడు పరిసరపత్రాంతాలనందు ఇవ్వటం జరిగింది. అయ్యవార్లఆధ్వర్యంలో ఈ అగహా్ర రం

ఉండటంవల్లదీనిని అయ్యంగార్ తక్కెళ్ళపాడుగా పిలవటం జరిగింది.

4) పరిపాలన సౌలభ్యం కొరకు 1904లో గుంటూరు జిల్లాను బ్రిటీషువారు ఏర్పా టు చేశారు. వారి

వివరాలపక్రారం అద్దంకితాలుకా ఏర్పా టైంది. అద్దంకితాలుకానందు గ్రామాల పేర్లను చేర్చు నపుడు అద్దంకి

పశ్చి మంగానున్న కొప్పెరపాడుకు వైదన కొప్పెరపాడని, తూర్పు వైపున్న కొప్పెరపాడుకు తూర్పు

కొప్పెరపాడని పక్కనేఉన్న తక్కెళ్ళపాడుకు తూర్పు తక్కెళ్ళపాడని నిర్ణయించటఅదేఇప్పు డు

తూర్పు తక్కెళ్ళపాడుగా ఆధునిక కాలంలో పిలవటం జరుగుతుంది.

ఇలా మనఊరికిగుర్రాల తక్కెళ్ళపాడని, జంగాల తక్కెళ్ళపాడని, అయ్యవార్ తక్కెళ్ళపాడని, తూర్పు

తక్కెళ్ళపాడని కాలానుగుణంగా పిలవటం జరిగింది.....

సమీప మండలాలు

మార్చు

దక్షణాన కొరిశపాడు మండలం, తూర్పున ఇంకొల్లు మండలం, పశ్చిమాన అద్దంకి మండలం, ఉత్తరాన మార్టూరు మండలం.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి జనకవరం పంగులూరులోను, మాధ్యమిక పాఠశాల అలవలపాడులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మేదరమెట్లలోను, ఇంజనీరింగ్ కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ అద్దంకిలోను, మేనేజిమెంటు కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మేదరమెట్లలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఒంగోలులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. rakthita neeti

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

తూర్పు తక్కెళ్ళపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

ఊరిమధ్యలో బొడ్రాయి ఉంటుంది. ఈ బొడ్రాయి గురించి పస్ర్తుత కాలం వారికిఅంతగా అవగాహన

ఉండొచ్చు, ఉండకపోవచ్చును. అయితేఊరికిమధ్యలో బొడ్రాయిని ఎందుకు స్థాపిస్తారు..? ఎప్పుడు

స్థాపిస్తారు..? దీని ప్రాముఖ్యత ఏమిటిఅనేఅంశం గురించి తెలుసుకుందాం.

ఊరును కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఉన్న గ్రామములో వాస్తు దోషాల వల్ల

మార్పులుచేయాలనుకున్నప్పుడుఅన్నివర్ణాల కులపెద్దలందరూ కలిసిఆయా పరిసర ప్రాంతంలో ఉన్న

పీఠాధిపతిని గాని, అయ్యగారిలాంటిగురువులను కలిసివారిసూచనల మేరకు అనుభవజ్ఞులైన శాస్త్ర

పండితుల పర్యవేక్షణలో గ్రామములో ఈ బొడ్డురాయినీ స్థాపిస్తారు.

మన గ్రామము నకు మూడు వైపుల శ్మశానాలు ఉన్నాయి.అయ్యగారికిపూర్వం శివ భక్తులు ఐన జంగం

దేవరలు ఉండేవారు.మన గ్రామాలోనీ నందిరాయి దగ్గర దక్షణ ముఖుడు ఐన దక్షిణామూర్తి (శివుడు )

ఆలయం ఉండేది.. మన గ్రామము రుదభ్రూమి అంటేమూడువైపులా శ్మశానాలు దక్షిణం వైపున

దక్షణాధిపతి యముడు ఉండేపద్రేశం. దీనివల్లగ్రామములో అభివృధిశూన్యం. పైగా జంగం దేవరుల

భూములు అయ్యగారిఅగ్రహారంలో అంతర్భాగం కావటంతో వారు ఆర్థికంగా, శైవ మతం పైవైష్ణవ మత

అదిపత్యంగా భావించి .దానికికోపించిన జంగాలు " ఈ గ్రామం ఎన్ని సంవత్సరాలు ఐన ఎలాంటిఅభివృధి

జరగదు."అని శపించారట.ఇప్పుడు మీరు మన కుటుంబాలను గమనించిన పతి్ర నాలుగు కుటంబాల కు

ఒక కుటుంబం మాతమ్ర ేఉంటుంది.అంటేవారసులు లేక పోవడం ఆడపిల్లలతో వంశాభివృద్ధిఅగిపోవటం

లేదా పిల్లలు లేకపోవడం .. జంగాల శాప కారణం అని పెద్దల అభిప్రాయాం.. అందుకేకాబోలు అప్పుడు

ఇప్పుడు గ్రామ జనాభా 3000 కు మించలేదని పెద్దల అభిప్రాయాం. అందువలనేగ్రామ క్షేమం దృష్ట్యా మన

అయ్యగారిపూర్వీకులు ఈ బొడ్డు రాయి నీ ఏర్పాటు చేయటం జరిగింది.

మానవ శరీర మధ్యభాగంలో బొడ్డులాగా గ్రామానికిబొడ్రాయి కూడా మధ్యభాగమైన బొడ్డు భాగం

అవుతుందికాబట్టిదీనికిబొడ్డురాయి అని పేరు వచ్చింది. మొదట ఊరియొక్క పొలిమేరలను ఏర్పాటు

చేసుకుని దిక్బంధన చేసుకుని దిక్కులు విధిక్కుల చుట్టు కొలత వైశాల్యానికిసెంటర్ పాయింట్ తీసుకిని ఆ

స్థలాన్ని గ్రామానికిమధ్యభాగంగా నిర్ణయించి అక్కడ బొడ్డురాయిని శాస్త్రోక్తమైన విధివిధానాలతో పూజించి

పతి్రష్టాపన చేస్తారు.

మానవుని దేహములో 7 చక్రములు ఉంటాయి.అందులో మణిపూరక చక్రం ఒకటి.

వాస్తు పురుషుని శరీరానికిమణిపూరకచక్రస్థానమేఈ బొడ్రాయి స్థానం, అంటేవాస్తు పురుషుని యొక్క

నాభి ( బొడ్డు ) స్థానం అన్నమాట. స్వాధిష్ఠాన చక్రమునకు పైన మూడంగుళములలో నాభి నందున ఒక

అగ్ని నిలయమైమణివలె పక్రాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పదిరేకులతో వుంటుంది.

పదహారు ఘడియల నలభైవిఘడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది. విష్ణువు ఈ చక్రానికి

అధిష్టాన దేవత. విశ్వంలోని విశ్వశక్తిగ్రామంలోకిపవ్రేశించేందుకు మణిపూరక చక్రము ముఖ ద్వారంగా

ఉపయోగపడుతుంది.

మానవ శరీరంలో షట్చక్రాలు ఉన్నట్టుగానేవాస్తు పురుషుని శరీరానికిషట్చక్రాలు ఉంటాయి కాబట్టివాస్తు

సూత్రపక్రారంగా వర్గులను నిర్ణయించి ఆయా వర్గులకు అనుగుణంగా దిక్కులు, విధిక్కులకు అనుగుణంగా

గ్రామానికిఏ ప్రాంతంలో ఎలాంటివసతులు ఉండాలి అని నిర్ధారణ చేసిగ్రామంలో నివసించేపజలంద ్ర రికీ

మేలును కలుగజేసేవిధంగా వాస్తు ఆధారంగా రోడ్లు, కూడళ్ళు, బావులు, చెరువులు, దేవాలయాలు,

స్కూళ్ళు, వైద్యశాలలు, వ్యవసాయ, వ్యాపార సముదాయాలు, శ్మశాన వాటిక.. మొదలగునవి నిర్మాణం

చేస్తారు, అలాగేఆ గ్రామంలో నివసించేపజలను ్ర వర్గాల వారిగా వారివారివర్ణలేక నామ అక్షరాలకు

అనుగుణంగా వారిని గృహ నిర్మాణం చేసుకోవాలని నిర్ణయిస్తారు. పండితుల సూచనల మేరకేగ్రామ పజల్ర ు

నిర్మాణం చేసుకుంటారు...

మన పెద్దయ్య గారు బొడ్డురాయి గురించి చెప్పిన మాటలు యధాతథంగా... మీ ముందుకు

ఈ బొడ్రాయిని ఒకేరాయితో స్థాపన చేయడంలోని ఆంతర్యాన్ని గమనిస్తేబొడ్డురాయి స్థాపితం చేసిన

తర్వాత చూడడానికిమాతం్రమనకు పైభాగం లింగాకారంగా కనిపిస్తుంది.కానీ ఈ బొడ్రాయి మొత్తం

పొడవును మూడు భాగాలుగా విభజించి ఒక్కోక్క భాగాన్ని ఒక్కో విశిష్టతతో చెక్కుతారు. క్రిందిభాగం

నాలుగు పలకలుగా చతురసం్రగా చెక్కుతారు ఈ నాలుగు పలకలను బహ్ర ్మ స్వరూపంగా భావిస్తారు,

మధ్యభాగాన్ని ఎనమిదిపలుకలుగా విష్ణువు పతీ్రకగా.. పైభాగాన్ని లింగాకారంగా చెక్కి శివ స్వరూపానికి

పతీ్రకగా భావిస్తారు.

గ్రామ పొలిమేరలలో ఎనిమిదిదిక్కులకు ఎనిమిదిమందిస్త్రీమూర్తిదేవతలు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు.

గ్రామ పొలిమేరలను ఈ ఎనిమిదిమందిదేవతలు అక్కచెల్లెళ్ళు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు, ఈ ఎనిమిది

మందిపొలిమేర దేవతలకు అధిదేవత శీతలాదేవి అమ్మవారు గ్రామ ఆధిపత్యం వహిస్తుందికాబట్టిబొడ్డు

రాయి క్రింద శీతాలాదేవి అమ్మవారియంతం్రస్థాపితం చేస్తారు. ఇలా ఈ బొడ్రాయి అంటేఒక్క విగ్రహమని

కాదు. స్త్రీ, ్త్రీ

పురుష దేవతా స్వరూపమై, సమస్తదేవతల సమాహారంగా మారి, శక్తివంతమైన తేజస్సుతో

గ్రామం మధ్య నుండిఎనిమిదిదిక్కులలో విస్తరించి ఎల్లప్పుడూ గ్రామానికిరక్షణగా నిలుస్తుందిఈ

బొడ్డురాయి దేవత.

శీతలదేవి యంతం్ర:- బొడ్రాయి క్రింద శక్తిస్వరూప మైన శీతలాదేవి అమ్మవారియంత్రస్థాపన చేస్తారు.

పొలిమేరలో ఉన్న దిక్కుల వారిగా ఆయా దిక్కులకు సంబంధించిన యత్రాలు స్థాపితం చేస్తారు.

మన గ్రామములో జీర్ణోద్ధారణ పున:పతి్రష్ట

బొడ్రాయి ఫూర్తిగా నేలలో కనిపించకుండా మునిగిపోయినప్పుడు తిరిగిపున:పతి్రష్టాపన చేస్తారు. ఆ

సందర్భంలో గ్రామాలలో పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏ గ్రామంలోనైనా ఏ కారణాల చేతనైన

భిన్నమైన లేదా నగర విస్తీర్ణంలో భాగంగా రోడ్లవెడల్పులో బోడ్రాయికిఅంతరాయం లేదా హాని కలిగినచో

బొడ్రాయి పస్ర్తుతం ఉన్న స్థానం నుండికేవలం 5 నుండి 10 మీటర్లలోపు వసతిని బట్టిమార్చుకోవచ్చును,

ఇందుకు ఏ దోషం వర్తించదు. భూమిపైగద్దెనిర్మించి అక్కడ జీర్ణోద్ధారణ పున:పతి్రష్టపూజలు శాస్త్రోక్తంగా

జరిపిస్తేఎలాంటిదోషాలు, అరిష్టాలు కలుగవు.

శయ్యాదివాస పూజలు:- కొత్తగా తయారు చేయించిన బొడ్రాయికిపుణ్యాహావాచనం, ప్రాయశ్చిత్తహోమం,

జలాధివాసం, ధాన్యాదివాసం, పంచగవ్యాధివాసం, మూలమంత్రహోమం, అష్టదిక్బంధన, కూష్మండ,

నారికేళ, జంభీరఫలం, గూడాన్నం, పొంగలి మొదలగు వాటితో బలిహరణ చేసి, పూర్ణాహుతి నివేదన, ప్రాణ

పతి్రష్టమహా కుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రామాలు నిర్వహించాల్సి ఉంటుంది.

మన ఊరిలో 1824 తొలిసారిగా బొద్దురాయి ఏర్పాటు జరిగిందితరువాత 1948 ఏప్రియల్ 3వ తేదిన

మరలా 2010 నవంబరు 26 వ తేదీన పునఃపతి్రష్టజరిగింది.బొడ్డు రాయి పతి్రష్టజరిగేసమయాన గ్రామ

పజల్ర ు అందరు గమనించిన ఒక సత్యం ఏమిటంటేపతి్రష్టపూర్తిఅయిన ఒక జాము అంటే 6 గం ల వ్యవధి

లో గ్రామ పొలిమేరల లోపు వర్షం కుంభ వృష్టికురుస్తుంది.అని పెద్దలు చెప్పారు.

వార్షికోత్సవం :- ఈ బొడ్రాయి పండగ అంటేయావత్తు గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు కలిసిచేసుకునే

ఒకేఒక్క పండగ బొడ్రాయి పండగ. పతి్రష్టచేసిన మొదటిసారిపంచాంగ పక్రారం ఏ మాసంలో ఏ పక్షంలో ఏ

తిధిరోజున పతి్రష్టచేస్తారో పతి్ర సంవత్సరం కూడా అదేమాసం అదేపక్షం అదేతిధిరోజు పతి్ర ఏటా

గ్రామస్థులు ఈ పండగను అన్ని వర్ణాల వారు వారసత్వంగా కలిసిమెలిసిఘనంగా వార్షికోత్సం

జరుపుకుంటారు. గ్రామ పజల్ర ు బొడ్రాయి పూజ చేసిఆశీస్సులు పొందుతారు. బొడ్రాయి పండగ రోజు ఆ

ఊరిఆడపడచులు అందరూ తప్పక హాజరు అవుతారు.

బలిహరణ :- బెల్లంతో చేసిన అన్నం, పొంగలి నివేదన చేస్తారు. నిమ్మకాయలు, గుమ్మడికాయలు,

కొబ్బరికాయతో బలిహరణ ఇస్తారు.

గ్రామదేవతకు పతి్రనిథిగా ఈ బోడ్రాయిని భావిస్తారు. ఇదిగ్రామానికేధ్వజస్తంభం లాంటిది. ఈ రాయిని

పతి్రష్టించేఆ గ్రామంలోని పజలక ్ర ు కొన్ని ఆంక్షలను విధిస్తారు. పతి్రష్టజరిగేరోజు ఊర్లోని వారంతా

గ్రామంలోనేఉండాలి. ఊరిపొలిమేరను ఎవరూ దాటకూడదు. అలాగేపెళ్లిళ్లు చేసుకుని వేరేచోట ఉండేఆ

గ్రామ ఆడపడుచులందరినీ ఈ పండగకు తప్పకుండా పిలిపిస్తారు.

ఊరిభౌగోళిక పరిమాణం, ఊరినిర్మాణం పైన పజలంద ్ర రికీఅవగాహన కల్పించడం కోసమేఈ పండుగ

చేస్తారని పెద్దలు అంటారు. ఊరిలోని వారంతా కలిసిఐకమత్యంగా ఉండాలని ఊరిబాగు కోసం పతి్ర ఒక్కరు

ఆలోచించాలనేదిదీని వెనక ఉన్న పధ్రాన ఆంతర్యం. పతి్రష్టచేయడమేకాకుండా పతి్ర ఏటా వార్షికోత్సవం

ఉత్సవాలను జరపడం కూడా సంపద్రాయంగా వస్తుంది.

గ్రామస్థులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండిరక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని

భూత ప్రేతాలనుండిరక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండేదేవత.వూరిపొలిమేరలో వుండేతల్లి

పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది

గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంపద్రాయం. మానవుడు నిత్య

జీవితంలో ఎన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం ఎన్నో పయ్ర త్నాలు

కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్టికిమూల కారకురాలు మాతృదేవత అని

గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తిపరచేటందుకు ఎన్నో మార్గాలను ఆశయి్ర ంచాడు. అందులో

ప్రార్థన, మంతతం ్ర త్రాలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేవి పధ్రానంగా కనిపిస్తాయి.

గ్రామాలలో వెలిసేదేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీదేవతా రూపలను గ్రామదేవతలని అంటారు.

సంపద్రాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరిపొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన

కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ

దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ

కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటేకుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు.

వీలుచిక్కినా అందరికీఒకేసారివెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటిసందర్భాలలో అలాంటివాళ్ళు అమ్మ

దర్శనానికివెళ్ళలేక పోయామేఅని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడోవున్న తల్లిని ఇక్కడేదర్శించు

కొన్నామనేతృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.

వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరిపొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ

క్రమముగా పోలేరమ్మ అయింది. పొలిమేరలో వుండేమరొక తల్లి శీతలాంబ. ఈమెచేతుల్లో చీపురు, చేట

ఉంటాయి. తన గ్రామంలోని పజలక ్ర ు వ్యాదులను కలిగించేక్రిమి కీటకాలని, భయాన్ని కలిగించేభూత ప్రేత

పిచాచ గణాలను గ్రామంలోనికిరాకుండా వూడ్చి చేటలోకిఎత్తి పారబోసేది

పార్వతేఅమ్మోరు (అమ్మవారు) గా గ్రామాలలో గ్రామదేవతయైగ్రామాలను రోగాల బారినుండిరక్షిస్తుందని

బలమైన నమ్మకం. ఈ అమ్మోరులు మొత్తం 101 మందిఅనీ వారందరికీఒకేఒక్క తమ్ముడు పోతురాజనీ

అంటారు.

శివుని ఆరాధించేవారు శైవులు, విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు, ఆదిశక్తిని త్రిమూర్తులకంటే

శక్తిమంతురాలని ఎంచి ఆరాధించేవారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ

సరిహద్ధులను కాపాడేదేవత పొలిమేరమ్మ.మసూచి, ఆటలమ్మ లాంటికొన్ని రోగాలోస్తేఅమ్మవారు

పోసిందనటం అర్ధరహితం కాపాడేదేవతపైఅపనిందమోపటమేఅవుతుంది.సరస్వతి, లక్ష్మి, పార్వతిలు

కలసిన పరమశక్తిపోలేరమ్మఅంటారు..

జాతర లేదా కొలువులు లేదా తిరునాళ్ళు

మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు బహుజన సంస్కృతిపరిరక్షకులు.సమాజంలోని

బడుగుకులాలవారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో

ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతరల వల్లసాధ్యమయ్యింది. వర్షాలు పడాలని పోలేరమ్మ

తిరునాళ్లు, కొలుపులు చేస్తారు.పోలేరమ్మకు జంతు బలులు ఇస్తారు. మేకలు, పొట్టేళ్ళు, కోళ్ళను నరకడం, పొంగళ్ళు పెట్టిఅమ్మవారిని భక్తిశద్ర్ధలతో దర్శించుకోవడం జురుగుతుంది

పూర్వం కలరా వ్యాధితీవ్రస్థాయిలో విజృంభించి అధిక సంఖ్యలో జన నష్టం జరగడంతో శీతల యాగం

జరిపించి గ్రామాల్లో అష్టదిగ్బంధన యంత్రాన్ని కట్టించి అత్యంత వైభవంగా గ్రామశక్తిపోలేరమ్మ జాతరను

జరిపించారట. పోలేరమ్మ జాతర ఆచారంగా మారింది.

కొన్ని ప్రాంతలలో ఊరిలోనీ పతి్ర ఇంటినుండిమడిబియ్యం తీసుకొని వీటితో పోలేరమ్మకు పొంగలి వండుతారు

ఈ బియ్యాన్ని మడిభిక్ష అంటారు.

ఈ పొంగలి మహా పస్రాదం అంటారు.

పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండి ..పోతురాజుకు టెంకాయ కొట్టండి ... పగలక పోతేమానెత్తిన కొట్టండి' అంటు

భిక్షాటన చేస్తారు.జాతర సందర్భంగా పతి్ర ఇంటికివేపాకు తోరణాలు కట్టిఅమ్మవారికిఇష్టనైవేద్యమైన

అంబలిని పస్రాదంగా పంచి పెడతారు. మా గ్రామ పోలేరమ్మ తల్లి చాలా మహిమ గల తల్లి. కోరిన కోర్కెలు

నెరవేర్చే తల్లి.పోలేరమ్మ చద్ది (అంబలి)

బర్రెపాడిచల్లగా ఉంటేపోలేరమ్మకు పెరుగన్నంతో పెట్టిన చద్దిని వీధిలోని పిల్లలందరినీ పొద్దున్నే పిలిచి

పంచిపెడతారు

అమ్మవారిపుట్టినిల్లుగా భావించేకుమ్మరులు అమ్మవారిపతి్రమను తయారు చేస్తారు. ఎటువంటిఅలంకరణ

లేని పతి్రమను ముందు అమ్మవారిఅత్తవారిఇంటికితీసుకు వెళతారు. అక్కడ సాంగ్యాలతో అమ్మవారిని

అలంకరిస్తారు. అమ్మవారిజాతర రోజులలో శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. ఆ రోజు గ్రామశక్తిపోలేరమ్మ

పట్టణంలో సంచరిస్తుంటుందని, అందువలన శుభకార్యాలు చేపడితేఅరిష్టం కలుగుతుందని పజల్ర నమ్మకం .

బ్రాహ్మణేతరులే పోలేరమ్మకు అనాదినుంచీ పూజారులు. కాలం గడిచేకొద్దీబ్రాహ్మణపూజారులు కూడా మారి

ఈదేవతకు పూజారులుగా వస్తున్నారు. సారాయి తాగిబాధలన్నీమరచి చిందులువేసేభక్తులకు కులాలు

గుర్తురావు. అంటరానితనం ఉండదు. సర్వమానవ సమానత్వంఈ జాతరల్లో వెల్లివిరుస్తుంది. అదేపోలేరమ్మ

గొప్పతనం...

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

తూర్పు తక్కెళ్ళపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 44 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 19 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 17 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 12 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 76 హెక్టార్లు
  • బంజరు భూమి: 6 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 397 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 414 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 64 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

తూర్పు తక్కెళ్ళపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.ఈ గ్రామస్థుల త్రాగునీటి అవసరాల నిమిత్తం, శ్రీమతి అద్దం కనకమ్మ ఙాపకార్ధం, శ్రీ అద్దంకి శైలజానాథన్ అయ్యంగార్, ఆయన సోదరుడు కలిసి, రు. రెండున్నర లక్షల వ్యయంతో ఒక శుద్ధజల కేంరాన్ని ఏర్పాటు చేసారు. ఈ కేంద్రం నుండి నామమాత్రపు ధరకు, గ్రామస్థులకు త్రాగునీటిని అందజేయుదురు.

  • కాలువలు: 64 హెక్టార్లు
  • ఊరకుంటలు:- ఈ గ్రామ రైతులు 2014 ఖరీఫ్ సమయంలో ఒక్కో కుంటకు ఐదువేల రూపాయల వంతున తమ పొలాలలో 30 ఊటకుంటలను తమ స్వంతఖర్చుతో త్రవ్వించుకునారు. అవి ఈ సంవత్సరం నీటితో నిండి, ఖరీఫ్ సమయంలో వర్షాభావ పరిస్థితులలో, సుమారు 80 ఎకరాలలో వేసిన వరిపైరుకు చాలా మేలుచేసి, 40 లక్షల రూపాయల పంట ఉత్పత్తికి దోహదపడుచున్నవి. [4]

ఉత్పత్తి

మార్చు

తూర్పు తక్కెళ్ళపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

శనగ

గ్రామ పంచాయతీ

మార్చు

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వి.వసంతకుమారి సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,626. ఇందులో పురుషుల సంఖ్య 819, మహిళల సంఖ్య 807, గ్రామంలో నివాస గృహాలు 415 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 573 హెక్టారులు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు