తెలంగాణ యువ నాటకోత్సవం - 3
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
తెలంగాణ యువ నాటకోత్సవం - 3 అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2018, మే 25 నుండి 28 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నాటకోత్సవం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ రంగస్థల సమాఖ్య 2017, జనవరి 27 నుండి 29 వరకు తెలంగాణ యువ నాటకోత్సవం పేర మొదటి నాటకోత్సవాన్ని, 2017, అక్టోబరు 20 నుండి 22 వరకు తెలంగాణ యువ నాటకోత్సవం - 2 పేరున రెండవ నాటకోత్సవాన్ని నిర్వహించింది.

సభాకార్యక్రమాలు
మార్చుమొదటి రోజు కార్యక్రమంలో మణికొండ వేదకుమార్, బి.ఎస్.రాములు, నాగబాల సురేష్ కుమార్, దైవజ్ఞ శర్మ, నటరాజమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాటక రంగ ప్రముఖుడు భాస్కర్ శివాల్కర్‌ను సత్కరించారు. రెండవ రోజు కార్యక్రమానికి సి.వి.ఎల్.నరసింహారావు, సాగర్ కె చంద్ర తదితరులు పాల్గొన్నారు. మూడవ రోజు కోట్ల హనుమంతరావు, వేణు ఉడుగుల, నటరాజమూర్తి, మల్లేశ్ బలష్టు, నిరుపమ సునేత్రి తదితరులు పాల్గొన్నారు. నాటకరంగ నటీమణి ఆనంత నాగలక్ష్మిని సత్కరించారు.
ప్రదర్శించిన నాటికలు
మార్చుతేది | నాటిక పేరు | సంస్థ | రచయిత | దర్శకత్వం |
25.05.2018 | ద్రోహి | |||
పైసల్ ఏవి బే | ||||
26.05.2018 | థ్రిల్ | |||
అడుగు | ||||
బతుకు చిత్రం | ||||
కలి మహిమ | ||||
27.05.2018 | గుణపాఠం | |||
మా ప్రేమకు న్యాయం కావాలి | ||||
మనసు చెక్కిన శిల్పం |
చిత్రమాలిక
మార్చుఈ ఉత్సవంలో ప్రదర్శించిన నాటికలలోని కొన్ని దృశ్యాలు:
-
ద్రోహి
-
పైసల్ ఏవి బే
-
అడుగు
-
థ్రిల్
-
బతుకు చిత్రం
-
కలి మహిమ
-
గుణపాఠం
-
మా ప్రేమకు న్యాయం కావాలి
-
మనసు చెక్కిన శిల్పం