తెలంగాణ యువ నాటకోత్సవం - 5

తెలంగాణ యువ నాటకోత్సవం - 5 అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2019, జూలై 4 నుండి 7 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నాటకోత్సవం.[1] నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ యువ నాటకోత్సవం పేర నాటకోత్సవాలను నిర్వహిస్తుంది.

తెలంగాణ యువ నాటకోత్సవం - 5 ప్రారంభ కార్యక్రమం
బి.ఎం. రెడ్డికి స్ఫూర్తి పురస్కార సత్కారం

సభా కార్యక్రమాలు

మార్చు

మొదటిరోజు

మార్చు

జూలై 4న మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభవేడుకలకు తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో యువ నాటకోత్సవంను ప్రారంభించారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ దర్శకుడు బి.ఎం. రెడ్డికి స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది. ఈ కార్యక్రమంలో తడకమళ్ళ రామచంద్రరావు, తెర అధ్యక్షకార్యదర్శి సభ్యలు పాల్గొన్నారు.

రెండవరోజు

మార్చు

జూలై 5 రెండవరోజు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, సినీ దర్శకుడు చంద్రమహేష్, రచయిత పెద్దింటి అశోక్ కుమార్, డబ్బింగ్ కళాకారుడు ఆర్.సి.యం. రాజు విచ్చేసి నాటకరంగ కళాకారులు స్నేహమయి ప్రకాష్ కు స్ఫూర్తి పురస్కారం అందజేశారు.

మూడవరోజు

మార్చు

జూలై 6 మూడవరోజు కార్యక్రమానికి నటుడు సుబ్బరాయ శర్మ, దర్శకులు ఖాజా పాషా, హరనాథ్ బాబు, పాత్రికేయులు జిఎల్ఎన్ మూర్తి విచ్చేసి నాటకరంగ కళాకారులు వనం లక్ష్మీకాంతరావుకు స్ఫూర్తి పురస్కారం అందజేశారు.

నాలుగవరోజు

మార్చు

జూలై 7న సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, నటుడు రవి కుమార్, గేయ రచయిత అభినయ శ్రీనివాస్, రంగస్థల దర్శకుడు డి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొని నాటక రచయిత రావుల పుల్లాచారికి స్ఫూర్తి పురస్కారం అందజేయడంతోపాటు తెలంగాణ రంగస్థల సమాఖ్య అధ్యక్షుడు చిలుకమర్రి నటరాజ్, కార్యదర్శి డా. మల్లేశ్ బలష్టు, సహ కార్యదర్శి వెంకట్ గోవాడ, కోశాధికారి ప్రణయ్‌రాజ్ వంగరి, సభ్యులు నిరుపమ సునేత్రి తదితరులను సత్కరించారు.[2]

ప్రదర్శించిన నాటికలు

మార్చు

తెలంగాణ యువనాటకోత్సం 5వ సిరీస్ లో 4 రోజులలో 10 నాటికలు ప్రదర్శించబడ్డాయి.[3][4]

తేది నాటిక పేరు సంస్థ రచయిత దర్శకత్వం
04.07.2019 ఎవరికి చుట్టాలు సాహితి కళాసమతి, హైదరాబాదు ఎ. సమత ఎ. సమత
కండీషన్స్ అప్లై సంస్కృతి, నిజామాబాదు గోవిందరాజులు నాగేశ్వరరావు రమణ వంగల
05.07.2019 బిచ్చగాడు తనిషీత క్రియేషన్స్, హైదరాబాదు బాలగంగాధర్ శ్రీకాకులపు బాలగంగాధర్ శ్రీకాకులపు
ఎలుగుబంటి - ఎలుక ముఖం సిద్ధిపేట రంగస్థలి, సిద్ధిపేట ఆంటోని చెకోవ్ (మూలం)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి (స్వేచ్చానువాదం)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి
దిక్సూచి విశ్వకర్మ ఆర్ట్స్, వీరారెడ్డిపల్లి ప్రభాకర్ సంగపంగ భానుప్రకాష్
06.07.2019 పుష్ఫలత నవ్వింది పాప్‌కార్న్ థియేటర్, హైదరాబాదు కరుణ కుమార్ తిరువీర్
ఇక్కడ పెళ్ళిళ్లు చేయించబడును మంచ్‌ థియేటర్‌, హైదరాబాదు కిరణ్ కుమార్ హర్ష
శుభలగ్నం మయూరి ఆర్ట్‌ క్రియేషన్స్‌, వరంగల్‌ లింగమూర్తి శ్యామలరావు
07.07.2019 ఖతర్నాక్ మల్లన్న వేంకటేశ్వర సురభి థియేటర్, హైదరాబాదు బెట్రోల్‌ బ్రెక్‌ (మూలం)
సురభి జయచంద్ర వర్మ
సురభి జయచంద్ర వర్మ
మేరే ప్యారే పతంగ్‌ బ్రిడ్జ్‌ థియేటర్‌ గ్రూప్‌ అసోసియేషన్స్‌, ఖమ్మం ప్రశాంత్ వికాస్ చైతన్య

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, హైదరాబాదు (23 June 2019). "జూలై 4 నుంచి 7 వరకు తెలంగాణ యువ నాటకోత్సవాలు". www.ntnews.com. Archived from the original on 7 September 2019. Retrieved 7 September 2019.
  2. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (8 July 2019). "యువ నాటకోత్సవంతో కొత్త ఉత్సాహం". Archived from the original on 7 September 2019. Retrieved 7 September 2019.
  3. నవతెలంగాణ, జాతర-స్టోరి (9 July 2019). "యువనాటకోత్సవం నవరసభరితం". కె.శాంతారావు. Archived from the original on 7 September 2019. Retrieved 7 September 2019.
  4. నవతెలంగాణ, జాతర-స్టోరి (16 July 2019). "ప్రయోగాత్మక నాటికలు". Archived from the original on 16 July 2019. Retrieved 7 September 2019.