తెలంగాణ యువ నాటకోత్సవం - 4


తెలంగాణ యువ నాటకోత్సవం - 4 అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2018, డిసెంబర్ 27 నుండి 30 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నాటకోత్సవం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ యువ నాటకోత్సవం పేర నాటకోత్సవాలను నిర్వహిస్తుంది.

సభా కార్యక్రమాలు

మార్చు

మొదటిరోజు

మార్చు

డిసెంబర్ 27న మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభవేడుకలకు తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిధారెడ్డి, సినీ దర్శకులు శివనాగేశ్వరరావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో యువ నాటకోత్సవంను ప్రారంభించారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ కళాకారులు మాలెల అంజిలయ్య కు స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల రంగస్థల కళలశాఖ పూర్వ శాఖాధిపతి డా. జిఎస్. ప్రసాదరెడ్డి, దర్శకులు బి.ఎన్. రెడ్డి, సత్కళభారతి సత్యనారాయణ పాల్గొన్నారు.[1]

రెండవరోజు

మార్చు

డిసెంబర్ 28 రెండవరోజు కార్యక్రమానికి పద్మశ్రీ సురభి బాబ్జీ, తెలంగాణ రెసొర్స్ సెంటర్ చైర్మన్ ఎం. వేదకుమార్, ఆంధ్రజ్యోతి కాలమిస్ట్ జి.ఎల్.ఎన్. మూర్తి, టీటీఆర్సీ అధ్యక్షులు విజయ్ కుమార్జీ, సినీ దర్శకులు శ్రీధర్ బీచరాజు, సినీ నాటక రచయిత దర్శకులు ఖాజా పాషా విచ్చేసి కళాకారులకు అభినందనలు తెలియజేశారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ కళాకారులు తిరునగరు వెంకట రంగయ్యకు స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.[2]

మూడవరోజు

మార్చు

డిసెంబర్ 29 మూడవరోజు కార్యక్రమానికి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దర్శకులు కన్నన్, నటులు ఉత్తేజ్, దైవజ్ఞ శర్మ, కార్టూనిస్ట్ రెంటాల జయదేవ్ విచ్చేసి కళాకారులకు అభినందనలు తెలియజేశారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ కళాకారులు బోయపల్లి నరసయ్యకు స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.

నాలుగవరోజు

మార్చు

డిసెంబర్ 30న సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో డా. చెల్లప్ప ఐఏఎస్ (రిటైర్డ్), తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి, రాష్ట్ర రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ బండి సాయన్న పాల్గొని నాటకరంగ కళాకారులు అమరేంద్ర కు స్ఫూర్తి పురస్కారం అందజేయడంతోపాటు తెలంగాణ రంగస్థల సమాఖ్య అధ్యక్షుడు చిలుకమర్రి నటరాజ్, కార్యదర్శి డా. మల్లేశ్ బలష్టు, సహ కార్యదర్శి వెంకట్ గోవాడ, కోశాధికారి ప్రణయ్‌రాజ్ వంగరి, సభ్యులు నిరుపమ సునేత్రి తదితరులను సత్కరించారు.[3]

ప్రదర్శించిన నాటికలు

మార్చు
తేది నాటిక పేరు సంస్థ రచయిత దర్శకత్వం
27.12.2018 అసుర అన్న ఆర్ట్స్, వనపర్తి పి. వినోద్ కుమార్ పి. వినోద్ కుమార్
వైద్యో నారాయణో ‘హరీ…! తెలంగాణ రంగస్థల కళాకారుల వేదిక, వరంగల్ వడ్లపల్లి నర్సింగరావు కె. తిరుమలయ్య
28.12.2018 సదారమె అను కాంతిమతి[4] శ్రీ విజయ భారతీ నాట్యమండలి (సురభి), హైదరాబాద్ తడకలూరి కుప్పుస్వామి (రచన)
హేమ మానస (నాటకీకరణ)
హారిక వర్మ రేకందర్
జిహాద్ మిర్రర్ థియేటర్, పెద్దపల్లి బి. సాంబశివమూర్తి బి. సాంబశివమూర్తి
చరమస్థలం విశ్వహిత కళాకేంద్రం, హైదరాబాద్ విలియం బట్లర్ ఈట్స్ (మూలం)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి (స్వేచ్చానువాదం)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి
29.12.2018 అసురదేవోభవ సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ నర్సయ్య బోయపల్లి బి. మంజునాథ్
ది షో మస్ట్ గో ఆన్ దర్శన్ ఆర్ట్స్, హైదరాబాద్ మనోజ్ అవుదుర్తి సంజీవ్ పటేల్
ఓ ప్రేమ.. ఓ దొంగ మంచ్ థియేటర్, హైదరాబాద్ రాకేష్ కుమార్ రాకేష్ కుమార్
30.12.2018 తెగారం జాబిల్లి కల్చరల్ సొసైటీ, నిజామాబాద్ పెద్దింటి అశోక్ కుమార్ డా. మల్లేశ్ బలష్టు
అంబల్ల బండ సహృదయ కల్చరల్ గ్రూప్, సికింద్రాబాద్ భూపాల్ రెడ్డి (మూలకథ)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి (నాటకీకరణ)
డా. ఆంథోని రాజ్

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. నవ తెలంగాణ, హైదరాబాద్ (28 December 2018). "తెలంగాణ యువ నాటకోత్సవం ప్రారంభం". Archived from the original on 3 January 2019. Retrieved 3 January 2019.
  2. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (29 December 2018). "రంజింపజేసిన నాటకాలు". Archived from the original on 3 January 2019. Retrieved 3 January 2019.
  3. ఈనాడు, ప్రధానాంశాలు (31 December 2018). "ముగిసిన యువ నాటకోత్సవాలు". Archived from the original on 3 January 2019. Retrieved 3 January 2019.
  4. The Hans India, Womenia (31 December 2018). "Story of a brave woman". D Shreya Veronica. Archived from the original on 3 January 2019. Retrieved 3 January 2019.