తెలుగు బ్రాహ్మణులు
తెలుగు బ్రాహ్మణులు బ్రాహ్మణ సమాజం సభ్యులు. వీరు తెలుగు మాట్లాడుతారు. వారు ప్రధానంగా భారతదేశ రాష్ట్రములు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్కు చెందినవారే. అయితే భారతదేశం లోని మిగిలిన ప్రాంతములకు, అలాగే ప్రపంచంలోని అనేక దేశాలకు అనేకమంది వలస వెళ్ళినవారు కూడా ఉన్నారు. తెలుగు బ్రాహ్మణులు కూడా చాలా పెద్ద సంఖ్యలో కర్నాటక రాష్ట్రములోని అనేక ప్రాంతములలో ముఖ్యంగా బెంగుళూరు నగరములో స్థిరపడ్డారు.
భాషలు | |
---|---|
తెలుగు | |
మతం | |
హిందూమతము | |
సంబంధిత జాతి సమూహాలు | |
తమిళ బ్రహ్మణులు, కన్నడ బ్రహ్మణులు, మరాఠీ బ్రహ్మణులు |
సంఘములు (గ్రూపులు)
మార్చుతెలుగు బ్రహ్మణులు ప్రధానంగా పంచ ద్రావిడ బ్రాహ్మణ శాఖ కు చెందినవాలు.
- తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వైదికి బ్రాహ్మణులు, నియోగి బ్రాహ్మణులు, తెలుగు మధ్వ బ్రహ్మణులు, దేశస్థ బ్రాహ్మణులు, ద్రావిడులు అనే ముఖ్య సమూహాలు ఉన్నాయి. వైదికి బ్రాహ్మణులు నియోగులలో ప్రధానంగా స్మార్త బ్రాహ్మణులు.
- తెలుగు బ్రహ్మణులలో ప్రధానంగా రెండు విభాగాలు ఉన్నాయి, స్మార్త మారియు వైష్ణవ.
- స్మార్త బ్రాహ్మణులు:
- వైదికి బ్రాహ్మణులు
- నియోగి బ్రాహ్మణులు
- ద్రావిడులు (తమిళనాడు నుండి వలస వచ్చినవారు)
- దేశస్థ స్మార్త బ్రాహ్మణులు
- వైష్ణవ బ్రాహ్మణులు:
- శ్రీవైష్ణవ బ్రహ్మణులు (రామానుజుల విశ్వాసంలోకి మారిన తెలుగు బ్రాహ్మణులు)
- తెలుగు మధ్వ బ్రాహ్మణులు (మధ్వాచార్య విశ్వాసంలోకి మారిన తెలుగు బ్రాహ్మణులు)
- గోల్కొండ వ్యాపారులు లేదా హైదరాబాదీ బ్రాహ్మణులు
- దేశస్థ మధ్వ బ్రాహ్మణులు
- వైదికి బ్రాహ్మణులు యందు అనేక శాఖలు, ఉపశాఖలు ఉన్నాయి. వారిలో వైదికీ వెలనాటి బ్రాహ్మణులు గాను తదుపరి మరింతగా వెలనాట్లు, వేంగినాడ్లు, ములకనాట్లు, కోసలనాట్లు, తదితర బ్రాహ్మణులు ఇంకా అనేక ఉపశాఖలుగా విభజించబడ్డారు.
- నియోగీ శాఖ తదుపరి, ఆరువేల నియోగులు, కణ్వులు, ఇతర ఉపశాఖలుగా ఏర్పడినాయి.
- దేశస్థ బ్రాహ్మణులలో ప్రధానంగా రెండు ఉప శాఖలు ఉన్నాయి, దేశస్థ మధ్వ బ్రాహ్మణులు, దేశస్థ స్మార్త బ్రాహ్మణులు. మొదటి ఉప శాఖలు జగద్గురు మధ్వాచార్యుల వారి తత్వశాస్త్రం అయిన ద్వైత సిద్దాంతమును అనుసరించే వారిని దేశస్థ మధ్వ బ్రాహ్మణులు అని లేదా తెలుగు మధ్వా బ్రహ్మణులు అని అంటారు. రెండు ఉప శాఖ అయిన దేశస్థ స్మార్త బ్రాహ్మణులు ఆది శంకరాచార్యర్యుల వారి తత్వశాస్త్రం అయిన అద్వైత సిద్దాంతమును అనుసరిస్తారు. దేశస్థ బ్రాహ్మణులు ఆంధ్ర ప్రాంతం లోని కోస్తాంధ్ర ప్రాంతము, రాయలసీమ యొక్క కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు యందు కేంద్రీకృతమై ఉన్నారు. తెలంగాణలో వీరు అన్ని జిల్లాలలో విస్తరించి ఉన్నారు.
- ద్రావిడ అనే శాఖ ఆంధ్రప్రదేశ్ నకు వలస వచ్చిన తమిళ బ్రాహ్మణులు ద్వారా ఏర్పడినది. ఆరామ ద్రావిడులు మరొక ఉప శాఖ ఏర్పడింది.
- పొరుగు రాష్ట్రం తమిళనాడు నుండి విశిష్ఠాద్వైతము అనుసరించే జగద్గురు రామానుజాచార్యుడు అనుచరులు అయిన శ్రీ వైష్ణవం ఇతర ముఖ్యమైన శాఖ సమూహాలలో ఒకటి అయినది.[1] వీరినే శ్రీ వైష్ణవులు అని అంటారు.
ఆహారం
మార్చు- తెలుగు బ్రాహ్మణులు శాకాహారము అనుసరించుతూ, "సత్వ" ఆహారం ఇష్టపడతారు.
పండుగలు
మార్చు- తెలుగు బ్రాహ్మణులు సాధారణంగా తెలుగు ప్రజలు వలే సాధారణంగా మకర సంక్రాంతి, ఉగాది లాంటి చాలా పండుగలు జరుపుకుంటారు. అయితే అవని అవిట్టం పండుగ దక్షిణ బ్రాహ్మణులకు ప్రత్యేక ముఖ్యమైన పండుగ.
ప్రముఖ మీడియా చిత్రీకరణ
మార్చుకొన్ని తెలుగు చిత్రాలలో తెలుగు బ్రాహ్మణులను, వారి వైవిధ్యమైన పద్ధతులు, సాంస్కృతిక పద్ధతులను హాస్య ప్రధానంగా, ఎగతాళి చేసినట్లు ఉండటం వల్ల వీరు నిరసనలు తెలియజేశారు.[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Shreeram Balijepalli's articles online
- ↑ "City Brahmins stage protest against Film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-16.