వైదికి వెలనాడు
వైదికి బ్రాహ్మణులు (వైదిక, వైదీకులు, వైదికులు, వైదీకి, వైదీకీ) తెలుగు మాట్లాడే స్మార్త బ్రాహ్మణుల లోని ఒక ఉపశాఖకు చెందినవారు. వీరి పూర్వీకుల మూలాలు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలు లోని కృష్ణా నది ఒడ్డున తీర ప్రాంతానికి చెందిన పురాతన నామం అయిన వెలనాడు ప్రాంతంలోఉన్నాయి. వీరు ముఖ్యంగా ఆది శంకరాచార్యులును ప్రధానంగా అనుసరిస్తారు, ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్లో కేంద్రీకృతమై ఉన్నారు.
చరిత్ర
మార్చువైదికి వెలనాడు ఆధిపత్యం సూచన 12 వ శతాబ్దం నుండి ప్రారంభం నుండి మొదలవుతుంది. వైదికి వెలనాడు బ్రాహ్మణులు బ్రహ్మ నాయుడుతో పలనాడు యుద్ధంలో పాల్గొన్నారు. విజయనగర సామ్రాజ్యము రాజు కృష్ణదేవరాయలు యోధుల కొరకు రోజూ ఆచారాలు జరుపుటకు గోల్కొండ, గుల్బర్గా, అహ్మద్ నగర్, బీజాపూర్ ప్రాంతాలకు చెందిన దక్కన్ బహమనీ సుల్తానులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాలు సమయంలో 2000 మంది పైగానే బ్రాహ్మణులను నియమించడం జరిగింది. ఈ బ్రాహ్మణ కుటుంబాలు, సుమారుగా 1556 ఎ.డి. సంవత్సరము ప్రాంతంలో తళ్ళికోట యుద్ధంలో శ్రీ కృష్ణదేవ రాయలు అల్లుడు అయిన రామ రాయలు ఓటమి తర్వాత హస్తసాముద్రికం, జ్యోతిషశాస్త్రం, నిత్య కర్మ, వివాహం, మరణం వంటి సేవలు అందిస్తూ తమిళనాడు లోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డాయి.
ప్రస్తుత కాలం
మార్చుస్మార్త సంప్రదాయం లోని తెలుగు మాట్లాడే పూజారులు చాలామంది ఈ శాఖకు చెందినవారు, అయితే, ఈ తెగ ప్రజలు ఇతర వృత్తులను కూడా ఎంచుకున్నారు.
సుప్రసిద్ధ వ్యక్తులు
మార్చు- సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య - ప్రముఖ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు., భారతరత్న గ్రహీత.
- శొంఠి కామేశం - ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరు, చిత్రకారుడు. భారత శాస్త్రవేత్త.
- శొంఠి దక్షిణామూర్తి భారత రాజకీయవేత్త, పరోపకారి, స్వాతంత్ర్య సమరయోధుడు, అంతర్జాతీయ ఆరోగ్య సలహాదారు. వైద్యశాస్త్ర ప్రముఖులు.
- చాగంటి కోటేశ్వరరావు - ప్రవచనకారులు
- గరికిపాటి నరసింహారావు - ప్రవచనకారులు, సహస్రావధాని
- సామవేదం షణ్ముఖశర్మ - ప్రవచనకారులు
మత నాయకులు
మార్చు- శ్రీ భారతీ తీర్థ - శృంగేరి శారదా పీఠము యొక్క ప్రస్తుత 36వ పరమాచార్యులు.
సినిమా రంగం
మార్చు- భానుమతి రామకృష్ణ - భారతీయ చిత్ర నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, గాయకురాలు, నిర్మాత, పుస్తకం, పాటల రచయిత
- త్రివిక్రమ్ శ్రీనివాస్ - తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.
- S జానకి - తెలుగు సినిమా గాయని
- కృష్ణ కుమారి- తెలుగు సినిమా హీరోయిన్
- సిరివెన్నెల సీతారామశాస్త్రి - తెలుగు సినిమా పాటలు రచయిత
- వేటూరి సుందరరామ మూర్తి - తెలుగు సినిమా పాటలు రచయిత
- కృష్ణ శాస్తి - తెలుగు సినిమా పాటలు రచయిత
- ఆరుద్ర - తెలుగు సినిమా పాటలు రచయిత
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుమరింత చదవండి
మార్చు- B S L Hanumantha Rao, Social Mobility in Medieval Andhra, Telugu Academy Press
- Christopher Alan Bayly, Rulers, Townsmen, and Bazaars: North Indian Society in the Age of British Expansion, 1770–1870, Cambridge University Press, 1983
- Durga Prasad, History of the Andhras up to 1565 A. D., P. G. PUBLISHERS, GUNTUR (1988)