న్యూ తెహ్రీ

(తెహ్రీ నుండి దారిమార్పు చెందింది)

న్యూ తెహ్రీ ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రీ గఢ్వాల్ జిల్లాలో ఉన్న పట్టణం, ఆ జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణ మునిసిపాలిటీ ప్రాంతంలో విధి విహార్ నుండి విశ్వకర్మ పురం (కోటి కాలనీ) వరకు 11 వార్డులు ఉన్నాయి. సీమా క్రిషాలి టెహ్రీ మునిసిపల్ కార్పోరేషనుకు ప్రథమ మహిళా చైర్‌పర్సన్. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఈ స్థానంలో గెలుపొందింది. సీమా క్రిషాలి కంటే ముందు బిజెపికి చెందిన ఉమేష్ గుసేన్ తెహ్రీ నగరపాలికకు ఛైర్మన్‌గా ఉన్నాడు. 61 ఏళ్లలో వరుసగా రెండుసార్లు ఈ సీటును గెలుచుకున్న ఏకైక చైర్మన్‌ ఆయనే. తెహ్రీ ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ అసెంబ్లీ స్థానం, టెహ్రీ లోక్‌సభ స్థానం కిందకు వస్తుంది,  

న్యూ తెహ్రీ
పట్టణం
తెహ్రీ జలాశయం
తెహ్రీ జలాశయం
Nickname: 
NTT
న్యూ తెహ్రీ is located in Uttarakhand
న్యూ తెహ్రీ
న్యూ తెహ్రీ
ఉత్తరాఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 30°23′N 78°29′E / 30.38°N 78.48°E / 30.38; 78.48
దేశం India
రాష్ట్రందస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
జిల్లాTehri Garhwal
Founded byKing Sudarshan Shah (New Tehri by THDC)
Government
 • TypeMunicipal
 • BodyNew Tehri Nagar Palika (Chairperson-Mrs. Seema Krishali, Independent), 2018/12/02-present
Elevation
1,750 మీ (5,740 అ.)
జనాభా
 (2011)[1]
 • Total24,014
భాషలు
 • అధికారహిందీ, Sanskrit
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్01376
Vehicle registrationUK-09
Websitehttp://tehri.nic.in/

చరిత్ర

మార్చు
 
భాగీరథి నదిపై తెహ్రీ డ్యామ్ సృష్టించిన సరస్సు

పాత పట్టణం తెహ్రీ భాగీరథి, భిలంగ్నా నదుల సంగమం వద్ద ఉంది. తెహ్రీని 1815లో స్థాపించారు. 4,180 చదరపు మైళ్లు (10,800 కి.మీ2) బ్రిటీష్ ఇండియాలోని టెహ్రీ గర్వాల్ ( గర్హ్వాల్ రాజ్యం ) సంస్థానానికి రాజధానిగా ఉంది. 1901లో ఈ సంస్థాన 2,68,885 జనాభా. ఇది గర్హ్వాల్ జిల్లాకు ఆనుకొని ఉంది. దాని భౌగోళిక లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి. గంగా, యమునా నదులు రెండూ ఇక్కడే ఉద్భవిస్తున్నాయి. ఏటా వేలాది మంది యాత్రికులు వీటిని సందర్శిస్తారు.[2]

టెహ్రీ డ్యామ్ నిర్మాణంతో పాత పట్టణమైన టెహ్రీ పూర్తిగా మునిగిపోయింది. అక్కడి జనాభాను న్యూ తెహ్రీ పట్టణానికి తరలించారు. చిప్కో ఉద్యమం సమయంలో సుందర్‌లాల్ బహుగుణ, అతని అనుచరులు ఆనకట్టకు వ్యతిరేకంగా చేసిన నిరసనల ప్రదేశంగా ఈ పట్టణం ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం పాత టెహ్రీ పట్టణం ఉనికిలో లేదు.[3]

జనాభా వివరాలు

మార్చు

2011 జనగణన ప్రకారం,[4] తెహ్రీ జనాభా 24,014. జనాభాలో పురుషులు 65%, స్త్రీలు 35% ఉన్నారు. తెహ్రీ సగటు అక్షరాస్యత 78%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 81%, స్త్రీల అక్షరాస్యత 71%. తెహ్రీ జనాభాలో 10% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

పర్యాటక ప్రదేశాలు

మార్చు

తెహ్రీ జిల్లాలో కింది పర్యాటక ప్రదేశాలున్నాయి.

పర్యాటక ప్రదేశం మీటర్లలో సముద్ర మట్టం సమీపంలోని పట్టణం ట్రాకింగ్ రూట్
(రహదారి నుండి దూరం)
చంద్రవడ్ని 2756 దేవప్రయాగ 1.5కి.మీ
కణతల్ 2590 కద్దుఖాల్ 9కి.మీ
ఖైత్ పర్వతం 3030 Ghansali, Ghonti 8.5కి.మీ
ఖట్లింగ్ గ్లేసియర్ 3717 గుట్టు 45కి.మీ
దోబ్రా చంటి వంతెన 850 డోబ్రా 250మీటర్
కుంజపురి 1645 నరేంద్ర నగర్ 200 మీటర్లు
మైథియానా దేవి 2500 తిల్వారా, భర్దర్ 9కి.మీ
పన్వాలి కాంత 3963 గుట్టు 15కి.మీ
సహస్త్ర తాల్ 4572 గుట్టు, రిహ్ 32కి.మీ
సుర్కందా దేవి 2757 ధనౌల్తి 1.5కి.మీ
మౌరియానా టాప్ 2050 చిన్యాలీ సౌర్, సువాఖోలి, ముస్సోరీ 30కిమీ, 35కిమీ 80కి.మీ

మూలాలు

మార్చు
  1. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=41470
  2. "The Ganga". Official Website of district Haridwar, Uttarakhand. National Informatics Centre, Haridwar District Unit. Archived from the original on 13 February 2010. Retrieved 8 March 2010.
  3. "The dam debate".
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు

మార్చు