తేజు
తేజు, భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ జిల్లా ప్రధాన కార్యాలయం, ఇది ఒక జనగణన పట్టణం.అరుణాచల్ ప్రదేశ్ లో అత్యంత అభివృద్ధి చెందిన పట్టణాలలో ఇదిఐదవ అతిపెద్ద పట్టణం.ప్రధాన మిష్మి దేవుడు రింగ్యాజబ్మలు పండుగ వీరి ప్రధానపండగ.దీనిని తమ్లాడు పూజ అని పిలుస్తారు.ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 న జరుపుకుంటారు.వేడుకలలో అన్నివర్గాల ప్రజలు ఆహ్వానించబడతారు.పవిత్ర పరశురాం కుండ్ సమీపంలో ఉంది.భారతదేశం నలుమూలలనుండి, పొరుగు దేశాల నుండి వేలాదిమంది హిందూ యాత్రికులు పవిత్రంగా మునిగి లక్షలాది జననాల పాపాలను కడిగివేయడానికి వస్తారు.ఇది తేజు వద్ద ఒక ఉత్సవంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుగుతుంది.ఇక్కడ ఆవాలు, అల్లం, నారింజ ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలోని 60 నియోజకవర్గాలలో తేజు ఒకటి.తేజు ప్రస్తుత శాసన సభ్యుడు(2019 మే) కరిఖో క్రి.అతను స్వతంత్ర అభ్యర్థి.[1]
తేజు | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°55′N 96°10′E / 27.92°N 96.17°E | |
దేశం | India |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | లోహిత్ |
స్థాపించబడింది | 1946 |
Government | |
• Type | డెమోక్రటిక్ |
• Body | 2019 ఎన్నికల ప్రకారం స్వతంత్ర రాజకీయ నాయకుడు |
• Rank | ఆలో, పాసిఘాట్, నహర్లగన్, ఇటానగర్ తర్వాత 5వది |
Elevation | 185 మీ (607 అ.) |
జనాభా (2011) | |
• Total | 18,184 |
• Rank | 5th |
• జనసాంద్రత | 17/కి.మీ2 (40/చ. మై.) |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-AR |
Vehicle registration | AR-11 |
భౌగోళికం
మార్చుతేజు 27°55′N 96°10′E / 27.92°N 96.17°E వద్దఉంది.[2] ఇది 185 మీటర్లు (606 అడుగులు) సగటుఎత్తున ఉంది. ఇది లోహిత్ నదిఒడ్డున ఉంది.
స్థానిక సాంస్కృతిక ఉత్సవాలు
మార్చుదిగారు, మిజు మిష్మి ప్రజల ప్రధాన పండుగ. తమ్లాడు తేజు అంతటా ఎంతోఉత్సాహంగా జరుపుకుంటారు.ఇతర పండుగలైన మోపిన్ (ఆది పండుగ), సాంగ్కెన్ (ఖమ్తి, సింగ్పో తెగ), రెహ్ (ఇడు మిష్మి పండుగ), లోసర్ (మోన్పా పండుగ) కూడా జరుపుకుంటారు.ఇది కాకుండా దుర్గా పూజ (దుసారా), కాశీపూజ, గణేష్ చతుర్థి మొదలైనవాటిని కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
రవాణా
మార్చుతేజువద్ద 2017లో నిర్మించిన విమానాశ్రయం మొదటి పౌర విమానాశ్రయం అవుతుంది. 2017 సెప్టెంబరు 22న మొదటి విమాన ప్రయోగం విజయవంతంగా నిర్వహించారు.ఇతర సమీప విమానాశ్రయాలు మోహన్బరి (154 కి.మీ) గౌహతి (లోక్ప్రియా గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం) వద్ద ఉన్నా యి.తేజు పక్కనే ఉన్న అస్సాంతో రోడ్డుమార్గం ద్వారా అనుసంధానమైంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణాసంస్థ (ఎపిఎస్టిఎస్), ఇతర అనధికార యాజమాన్యంలోని వాహనాలు అస్సాంకు అంచెలంచెలుగా ప్రయాణసౌకర్యాలను అందిస్తాయి.చాలా వాహనాలు అస్సాంలోని టిన్సుకియాకు ప్రయాణ సౌకర్యాలను అందిస్తాయి.సమీప రైల్వే స్టేషన్ టిన్సుకియా (ఎన్‌టిఎస్‌కె) వద్ద ఉంది, ఇది దేశంలోని ప్రధాన ప్రాంతమైన గౌహతి, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు మొదలైన ప్రాంతాలతో అనుసంధానించబడింది.
227 కి.మీ. ముర్కాంగ్సెలెక్-పసిఘాట్-తేజు-రూపై మార్గం వ్యూహాత్మక ఫథకంగా చేపట్టబడుతోంది.[3][4] ఈ పథకంలో భాగంగా, ముర్కాంగ్‌సెలెక్ నుండి పసిఘాట్ మీదుగా పెద్దమార్గం ద్వారా తేజును అనుసంధానించడానికి, పర్షురామ్ కుండ్ వరకు విస్తరించే ప్రతిపాదన వచ్చింది.ఈ మార్గం కోసం ప్రాథమిక సాంకేతిక పరిశీలన పూర్తయింది.
అలోబారిఘాట్ వద్ద లోహిత్ నదిపై కొత్తగా నిర్మించిన లోహిత్ వంతెన (2.9 కి.మీ) కూడా తేజు సమీప పట్టణాలు, అస్సాంతో అనుసంధానం చేసింది.ఈ వంతెన తేజుకు బస్సు సర్వీసు ద్వారా గువహటికి నేరుగా అనుసంధానం కావడానికి సహాయపడింది.
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య ప్రయాణ సమయాన్ని నాలుగు గంటలు తగ్గించిన బ్రహ్మపుత్రపై వ్యూహాత్మక 2 మార్గాల భూపెన్హజారికా లేదా ధోలా-సాదియా వంతెన (9.15 కి.మీ) 2017 మే 26 నుండి పనిచేస్తోంది. రక్షణ ప్రయోజనాల కోసం ఇది చాలా కీలకమైంది ఇది భారతదేశంలో పొడవైన నది వంతెన.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[5] తేజు జనాభా మొత్తం 18,184 మంది ఉన్నారు.వారిలో 9,743మంది పురుషులు కాగా,8,441 మంది మహిళలు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలజనాభా 2104, ఇది తేజు మొత్తం జనాభాలో 11.57%గా ఉంది.తేజు సగటు అక్షరాస్యత రేటు 83.98%, ఇది రాష్ట్ర సగటు 65.38%, జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత రేటు 88.29%, స్త్రీల అక్షరాస్యత రేటు 78.94%.మహిళా లింగ నిష్పత్తి రాష్ట్రసగటు 938తో పోలిస్తే 866గా ఉంది. అంతేకాకుండా, తేజులో పిల్లల లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 972తో పోలిస్తే 968గా ఉంది.
మొత్తం జనాభాలో హిందువులు 75.57% ఉండగా, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు వరుసగా 7.43%, 8.24%,0.29% ఉన్నారు.బౌద్ధమతం 5.41%, ఇతరమతాలు మొత్తం జనాభాలో 2.91%.మంది ఉన్నారు.
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తేజు
- ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, తేజు
- కేంద్రీయ విద్యాలయ, తేజు
- ఇందిరాగాంధీ ప్రభుత్వ కళాశాల
- ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (బి.ఎడ్ కళాశాల)
- వివేకానంద కేంద్రీయవిద్యాలయం, తేజు
- వికెవి తఫ్రాగం, తేజు
- అరుణ్ జ్యోతి పాఠశాల
- ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల తెల్లులియాంగ్
- వికెవి పాఠశాల
ప్రస్తావనలు
మార్చు- ↑ "Tezu MLA". Archived from the original on 19 August 2016. Retrieved 14 August 2016.
- ↑ Falling Rain Genomics, Inc - Tezu
- ↑ India to construct strategic railway lines along border with China, Hindustan Times, 30 Nov 2016.
- ↑ 2019 target to survey 3 strategic rail lines along China border, Arunachal Observer, January 5, 2019.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.