తొర్రూర్

మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం లోని పట్టణం

తొర్రూర్, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 2016-2018లో ఇదే తొర్రూరు గ్రామం మున్సిపాలిటి గాను, డివిజన్ కేంద్రం గాను ఇప్పుడు అయింది.అంతకు ముందు ఇది మేజర్ గ్రామ పంచాయతీ. తొర్రూరు మండలానికి కేంద్రం.

తొర్రూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాద్, తొర్రూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాద్, తొర్రూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాద్, తొర్రూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°39′16″N 79°21′15″E / 17.654491°N 79.354134°E / 17.654491; 79.354134
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాద్
మండల కేంద్రం తొర్రూర్
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 76,519
 - పురుషులు 38,506
 - స్త్రీలు 38,013
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.24%
 - పురుషులు 65.41%
 - స్త్రీలు 40.75%
పిన్‌కోడ్ 506163

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.

మార్చు

లోగడ తొర్రూర్ గ్రామం/మండలం వరంగల్ జిల్లా,మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది అంతకుముందు మేజర్ గ్రామ పంచాయతీ 2016-2018లో ఇదే తొర్రూరు గ్రామాన్ని మున్సిపాలిటి గాను డివిజన్ కేంద్రం గాను ఇప్పుడు అయింది.2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా తొర్రూరు మండలాన్ని (1+21) ఇరవైరెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా,అదే రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

గ్రామనామ వివరణ

మార్చు

తొర్రూరు అన్న పేరు బాగా ప్రాచీనమైందని పరిశోధకులు తేల్చారు. కొత్తరాతియుగం, బృహత్‌శిలా యుగానికి చెందిన ప్రాక్తన చారిత్రిక దశ నాటి పేరుగా గుర్తించారు. కొత్త రాతియుగంలో పశుపాలన, వ్యవసాయం విస్తృతిపొంది, రాగి, ఇనుం వాడకం, లోహపరిశ్రమ అవతరించింది. ఈ అంశాలను సూచిస్తూ ఏర్పడిన గ్రామనామాల్లో తొర్రూరు ఒకటి. ఆ యుగంలో కొత్తగా ప్రారంభమైన పశుపాలన విషయాలను సూచిస్తూ పశుసంబంధమైన పేరుతో ఈ గ్రామం ఏర్పడింది.[3] మరొక వాదన కూడా ఉంది. దొర అంటే తెలంగాణ ప్రాంతంలో భూములు ఎక్కువ వందల ఎకరాల్లో ఉన్న వారు. ఈ గ్రామంలో ఒక దొర ఉండే వారు అతని పేరు మీద దొరవారి ఊరు చుట్టూ ఉన్న గ్రామాల్లో వారు పిలిచేవారూ దొరూరు కాలగమనంలో తొర్రూరు అయింది. రంద్రపురి అనే మరో పేరు కూడా ఉంది ఈ ఊరు మద్య ఒక్క గొయ్యి అంటే రంద్రం తొర్ర ఒక్కటే అర్ధం సూచిస్తాయి. అలాంటి తొర్ర ఒకటి ఊరు మద్యలో పెద్దది ఉండడంతో రంద్రపురి అని దొరూరు కలిపి కాలగమనంలో తొర్రూరు అయిందని చెపుతారు.

జాతీయ జెండా

మార్చు
 
తొర్రూర్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో అతిపెద్ద 100 అడుగుల జాతీయ జెండా

తొర్రూర్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణ ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద 100 అడుగుల జాతీయ జెండాను 2022 ఆగస్టు 29న పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించాడు.[4] ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విద్యావేత్త చుక్కా రామయ్య, జిల్లా కలెక్టర్‌ శశాంక, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ పాల్గొన్నారు. 20 లక్షల రూపాయలతో 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఈ జాతీయ జెండా ఏర్పాటుచేయబడింది. 12 లక్షల రూపాయలతో వంద అడుగుల ఎత్తు ఉన్న ఇనుప స్తంభాన్ని గుజరాత్‌ నుండి తెప్పించారు.[5]

పార్కులు

మార్చు

చిత్ర మాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:పేజీ.26
  4. telugu, NT News (2022-08-29). "రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి". Namasthe Telangana. Archived from the original on 2022-08-29. Retrieved 2022-08-30.
  5. "రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతీయ జెండా!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-08-30. Archived from the original on 2022-08-30. Retrieved 2022-08-30.

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తొర్రూర్&oldid=4107149" నుండి వెలికితీశారు