నెమురుగోమ్ముల యెతిరాజారావు

నెమురుగోమ్ముల యెతిరాజారావు (ఆంగ్లం: Nemeragommula Yethiraja Rao) మాజీ మంత్రి సుధీర్ఘ కాలం 35 సంవత్సరాలు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యునిగా పనిచేసిన సీనియర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయనాయకుడు.[1]

నెమురుగోమ్ముల యెతిరాజారావు
ఛాయాచిత్రపటం
జననం(1930-07-17)1930 జూలై 17
వడ్డేకొత్తపల్లి గ్రామం, కొడకండ్ల మండలం,వరంగల్జిల్లా,తెలంగాణ రాష్ట్రం.
మరణం03 జూన్ 2001
వడ్డేకొత్తపల్లి
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ నాయకులు
రాజకీయ పార్టీతె.దే.పా
భాగస్వాములునెమురుగోమ్ముల విమలాదేవి
పిల్లలునెమురుగోమ్ముల సుధాకర్ రావు, ప్రదీప్ రావు, నవీన్ కుమార్ రావు, ప్రవీన్ రావు, సురేందర్ రావు, ఒక కూతురు రేణుక దేవి.

బాల్యం, కుటుంబం

మార్చు

నెమురుగోమ్ముల యెతిరాజారావు (వడ్డేకొత్తపల్లి, కొడకండ్ల) చిన్న వయస్సు లోనే ఉద్యమాలతోనే అతని జీవితం ఆరంబమైయింది,1940 దశకం లోనే నిజాం రాజుకు జమీనుదార్ విసునూర్ దోర రాపాక రామచంద్రారెడ్డి, వారి కుటుంబం జానమ్మ, బాబు దొర (జగన్మెహన్ రెడ్డి), వారు ప్రజలని హింసలు పెడుతుంటె చలించి గ్రామాల్లో యువకులతో వారికి వ్యతిరేక ఉద్యమాలను ఊరూర చేయించిన దైర్యవంతుడు యెతిరాజారావు. యెతిరాజారావు భార్య నెమురుగోమ్ముల విమలాదేవి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యులుగా 1967 - 72 వరకు పనిచేసింది. వీరి పెద్ద కుమారుడు కూడా నెమురుగోమ్ముల సుధాకర్ రావు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యులుగా 1999 - 2004 వరకు పనిచేసిన అరుదైన చరిత్ర అప్పటి చెన్నూర్ (పాత) ఇప్పటి పాలకుర్తి శాసనసభ నియోజకవర్గంకి ఈ ప్రతేకత ఉంది.

వ్యక్తిగత జీవితం

మార్చు

ముందునుండి యెతిరాజారావు. కాంగ్రేస్ పార్టీ కార్యకర్త,ఆ పార్టీతో విడిపోతు కలుస్తూతు 1984-85 వరకు సాగింది.[2] 1957లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ ఓడిపోయాడు. SVK ప్రసాద్ రావు (ఆంధ్ర) MLA గా గెలిచారు. యెతిరాజారావు తిరిగి కాంగ్రేస్ పార్టీలో చేరి 1959లో సమితి అద్యక్షుడుగా ఎన్నికైయిండు. ( ఆ రోజుల్లో ఆ పదవికి మంచి విలువ ఉండేది). (పదవి కాలం 1959-1964) ఆ పదవిలో 3 ఏండ్లు (ముఖ్య అనుచరుడు కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు ఉన్నడు) .

రాజకీయ జీవితం

మార్చు

1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు (వడ్డేకొత్తపల్లి) పై గెలిచాడు.[3] దాంతో కాంగ్రేస్ పార్టీలో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీ యెతిరాజారావూను బహిష్కిరింది.1962 నుండి 1967 వరకు MLA గా పనిచేసాడు,1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ బహిష్కిరింది ఇంకా 1 సంవత్సర కాలం ఉంది టిక్కెట్ ఇవ్వలేం అన్నరు. యెతిరాజారావుకి, కాని మీరు సూచించిన వారికి ఇస్తామన్నరు. ముఖ్య అనుచరుడు అప్పటికి ఇమ్మడి లక్ష్మయ్య (నాంచారిమడూర్, తొర్రూర్) శ్రీరాం అప్పయ్య (పెద్దవంగర, కొడకండ్ల). కాని ఉహించని విదంగా భార్య నెమురుగోమ్ముల విమలాదేవికి (పెద్దింటి ఆడవారు, తెరచాటు ఉండేవారు) టిక్కెట్ ఇప్పించాడు. యెతిరాజారావు. నల్లా నరసింహులు (కమ్యూనిస్ట్ పార్టీ)ను ఓడించి 1967-1972 వరకు MLA గా పనిచేసారు నెమురుగోమ్ముల విమలాదేవి.1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావుకి ఇవ్వలేదు. ఇందిరాగాంది.. ఆడవారు MLA విమలాదేవి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక్కరే. విమలాదేవికి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ ఇందిరాగాంది. విమలాదేవిని ఓడించి కుందూరు మదుసూదన్ రెడ్డి గెలిచాడు. మదుసూదన్ రెడ్డి ఓ కరపత్రం తీసి విమలాదేవి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచాడు. అని యెతిరాజారావు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లాడు.ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. యెతిరాజారావు ముఖ్య అనుచరుడు అప్పటికి ఇమ్మడి లక్ష్మయ్య (నాంచారిమడూర్, తొర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు వెళ్లాడు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశాడు. 1975లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975లో చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నాడు. అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావూ.ఏకదాటిగా 6సార్లు MLA గా గెలిచాడు. 2 సార్లు మంత్రిగా అయ్యాడు. 1983-84 లో నందమూరి తారకరామారావు "చైయెత్తి జై కొట్టు తెలుగోడా" అంటూ తెలుగు వారిని అతని వైపు ఆకర్షించుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు దేశం పార్టీ స్దాపించి ముఖ్యమంత్రి అయ్యాడు.అంతటి రామారావు గాలి లోకూడ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం 85 లో కుందూర్ వెంకట్రాం రెడ్డి దాట్ల తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని, మన్నూర్ (పూసల)వెంకటయ్య కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని ఓడించి యెతిరాజారావూ MLA గా కాంగ్రేస్ పార్టీ నుండి గెలిచాడు. కొద్ది రోజులకె తెలుగు దేశం పార్టీలో చేరాడు. రోడ్లు,భవనాల శాఖ మంత్రిగా, దేవాదాయ దర్మదాయ శాఖ మంత్రిగా అయ్యాడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యులుగా 1999 వరకు చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి పని చేసిండు.

యివి కూడా చూడండి

మార్చు
  1. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957) (65)
  2. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962) (274)
  3. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967) (258)
  4. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972) (258)
  5. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978) (263[4])
  6. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983) (263)
  7. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985) (263)
  8. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989) (263)
  9. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994) (263)

మూలాలు

మార్చు
  1. Sakshi (26 October 2023). "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  2. https://www.bengalinformation.org/2013/09/andhra-pradesh-state-assembly-election_94.html
  3. https://www.thehindu.com/news/national/andhra-pradesh/erabelli-in-the-line-of-trs-fire/article5919394.ece
  4. https://pdfslide.net/documents/key-highlights-general-election-1978-the-legislative-.html[permanent dead link]

ఇతర లింకులు

మార్చు