త్రిచూర్ వి.రామచంద్రన్

త్రిచూర్ వి.రామచంద్రన్(జననం 1940) ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు.[1] ఇతనికి 2003లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది.[2]

త్రిచూర్ వైద్యనాథ రామచంద్రన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంవి.రామచంద్రన్
జననం (1940-08-09) 1940 ఆగస్టు 9 (వయసు 83)
త్రిచూర్, కొచ్చిన్ రాష్ట్రం, బ్రిటీషు ఇండియా
సంగీత శైలికర్ణాటక సంగీతం (గాత్రం)
వృత్తిగాయకుడు
క్రియాశీల కాలం1954 - ప్రస్తుతం వరకూ
జీవిత భాగస్వామిచారుమతి రామచంద్రన్

విశేషాలు మార్చు

ఇతడు కొచ్చిన్ రాజ్యానికి( ప్రస్తుతం కేరళ రాష్ట్రం) చెందిన త్రిచూర్ పట్టణంలో 1940, ఆగస్టు 9న జన్మించాడు. ఇతడు జి.ఎన్.బాలసుబ్రమణియం వద్ద సంగీతం నేర్చుకున్నాడు.[3] ఇతడు తన 14వయేటనే తొలి సంగీత కచేరీ ఇచ్చాడు.[4][5] తరువాత భారత ప్రభుత్వం వారి సాంస్కృతిక ఉపకార వేతనం పొంది ఎం.ఎల్.వసంతకుమారి వద్ద శిక్షణ తీసుకున్నాడు.[6]ఇతడు పది సంవత్సరాలపాటు కృష్ణానంద్ వద్ద కిరాణా ఘరానా పద్దతిలో హిందుస్తానీ సంగీతం కూడా అభ్యసించాడు.[7] ఇతడు 1973లో చారుమతిని వివాహం చేసుకున్నాడు. ఈవిడ కూడా సంగీత విద్వాంసురాలే.

అవార్డులు మార్చు

1992-93 సంవత్సరానికి "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ ఇతడిని కళైమామణి పురస్కారంతో సత్కరించింది.[7] ఇతడు 2003లో సంగీత నాటక అకాడమీ అవార్డును పొందాడు.[8] అదే సంవత్సరం భారత ప్రభుత్వం ఇతడిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2001లో శ్రీకృష్ణ గాన సభ "సంగీత చూడామణి" బిరుదుతో సత్కరించింది. 2009లో తపస్ కల్చరల్ ఫౌండేషన్ "విద్యా తపస్వి" బిరుదును ప్రదానం చేసింది.[6]2012లో మద్రాసు సంగీత అకాడమీ ఇతడికి సంగీత కళానిధి పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.[9][10] వీటితో పాటుగా ఎన్నో అవార్డులు, సన్మానాలు, బిరుదులు ఇతడికి లభించాయి.

మూలాలు మార్చు

  1. శంకరనారాయణ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్టు. p. 101. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 23 February 2021. {{cite book}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Kalam presents Padma awards". Rediff.com. 3 April 2003. Retrieved 26 August 2015.
  3. "TRICHUR V. RAMACHANDRAN A proud disciple of GNB" (PDF). .dhvaniohio.org. Retrieved 26 August 2015.
  4. "Spotlight on bani". The Hindu. 21 December 2012. Retrieved 25 August 2015.
  5. "In tune with the festivities". The Hindu. 23 September 2005. Retrieved 25 August 2015.
  6. 6.0 6.1 "Virasat: Carnatic vocal concert by Trichur V Ramachandran". Stanley Pinto. The Times of India. 25 September 2012. Retrieved 26 August 2015.
  7. 7.0 7.1 web master. "Trichur V. Ramachandran". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 13 ఆగస్టు 2020. Retrieved 23 February 2021.
  8. "Sangeet Natak Akademi Puraskar (Akademi Awards)". Sangeet Natak Akademi. Archived from the original on 30 May 2015. Retrieved 25 August 2015.
  9. "Music Academy announces awards". The Hindu. 19 July 2012. Retrieved 25 August 2015.
  10. "'Sangita Kalanidhi' for Carnatic vocalist". New Indian Express. 3 January 2013. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 25 August 2015.

బయటి లింకులు మార్చు