త్రిపురనేని హనుమాన్ చౌదరి

కామ్రెడ్ చౌదరిగా ప్రసిద్ధుడైన త్రిపురనేని హనుమాన్ చౌదరి టెలికమ్యూనికేషన్ రంగంలో ముఖ్యమయిన కృషి చేసారు.ఈయన టెలీకం పరిశ్రమలో భీష్మ పితామహులు. టెలికం పరిశోధకులు.2017 లో వీరు చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది

త్రిపురనేని హనుమాన్ చౌదరి

జీవిత విశేషాలు

మార్చు

పూణెలో (1974-75), ఆంధ్ర ప్రదేశ్ లో (1978-83) టెలీఫోన్స్ శాఖ ప్రధానాధికారిగా ఉంటూ దేశవ్యాపితంగా ఎస్.టీ.డీ , ఐ.ఎస్.డీ ల వ్యవస్థకు అంకురార్పణ చేశారు. ఈయన కృషి ఫలితంగా ఈ రోజున దేశంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా ఎస్.టి.డి, ఐఎస్‌డి, ఈ-మెయిల్, వీడియో కాన్ఫరెన్సు, ఐఎస్‌డీ ఎన్ లైన్లు విస్తృతమయ్యాయి. "నాట్" గురించి పార్లమెంటు సభ్యులకు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర మంత్రులకు అవగాహన కల్పించారు. విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ తొట్టతొలి చైర్మన్ గా, మేనేజింగ్ డైరక్టరుగా దేశ వ్యాప్తంగా టెలీ కమ్యూనికేషన్ ల శకానికి నాంది పలికారు.

1989 లో టెలీ కమ్యూనికేషన్స్ మేనేజిమెంటు అండ్ స్టడీస్ సెంటరు నెలకొల్పారు. నేషనల్ టెలీకాం పాలసీ ఎన్.టీ.పీ కి సంబందించిన డ్రాప్టు పాలసీని 1989 లో రూపొందించారు. సెంటరు తరపున ఒక హౌస్ జర్నల్ ను నెలకొల్పి దానికి ఎడిటర్ గా కొంతకాలం వ్యవహరించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ను సవరించి దానికి ప్రత్యామ్నాయంగా టెలికం లా కు రూపకల్పన చేసి 1992 లో ప్రవేశపెట్టేందుకు కృషి జరిపారు.

టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) బిల్ ను డ్రాఫ్టింగ్ చేసిన ఈయన ప్రైవేటు రంగంలో టెలికం పరిశ్రమ ఆవిర్భావానికి కీలక పాత్ర పోషించి, దేశీయ టెలికం వ్యవస్థకు నూతన శకం ఆవిర్భవింపజేశారు. జాతీయ, అంతర్జాతీయ టెలికం సదస్సులు అనేకంలో పాల్గొని టెలికం పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా నూతన పోకడలను అంకితం చేశారు. ఇంటర్నేషనల్ టెలికం యూనియన్ (జెనీవా) కు గౌరవ సభ్యులు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఏషియన్ టెలికం మహాసభలో (సింగపూర్,హాంకాంగ్,జెనీవాలలో 2001,02,03లలో) పాల్గొని మనదేశపు టెలికం రంగపు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. దాదాపు 20 దేశాలలో జరిగిన టెలికం సదస్సులలో ప్రధాన వక్తగా పాల్గొని, ఎప్పటికప్పుడు టెలికం అభివృద్ధి పథకాలను సూచించారు.

ఇంటెల్ సాట్ (వాషింగ్టన్) ,ఇన్మార్ సాట్ (లండన్) లకు గవర్నర్ గా వ్యవహరించారు. గయానా, యెమెన్ మొదలైన వర్ధమాన దేశాలకు ప్రణాళికలను రచించి తెలికం ఇంటర్నేషనల్ టీం కు నేతృత్వం వహించారు. 1995 లో దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి, 2000లో నేపాల్ ప్రభుత్వానికి టెలికం సలహాదారుగా దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాం (1997-04) లో రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా యున్నారు. భారతీయ విద్యా భవన్ కు (హైదరాబాదు శాఖ) ఛైర్మన్ గా, "ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీర్స్" కు జాతీయ స్థాయిలో అధ్యక్షునిగా, న్యూయార్క్ సంస్థకు గౌరవ సభ్యులుగా పనిచేసారు. సిటిఎమ్‌ఎస్ కు డైరక్టరుగా పనిచేశారు.

రచించిన గ్రంథములు

మార్చు
  • India, understrain, India, U.P
  • India Explorations, In True Conscience.

అవార్డులు

మార్చు
  • 2017 లో ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.
  • ఎల్.వి.రామయ్య అవార్డు గ్రహీత

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు