దమ్మాయిగూడ పురపాలకసంఘం

దమ్మాయిగూడ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] దమ్మాయిగూడ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

దమ్మాయిగూడ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
దమ్మాయిగూడ పురపాలకసంఘం is located in తెలంగాణ
దమ్మాయిగూడ పురపాలకసంఘం
దమ్మాయిగూడ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°29′58″N 78°35′50″E / 17.499562°N 78.597313°E / 17.499562; 78.597313
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి
మండలం అల్వాల్ మండలం
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 8.8 km² (3.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 21,452
 - పురుషుల సంఖ్య 11,625
 - స్త్రీల సంఖ్య 9,827
 - గృహాల సంఖ్య 2,750
పిన్ కోడ్ - 500083
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న దమ్మాయిగూడ, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

మార్చు

దమ్మాయిగూడ 8.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°29′24″N 78°35′53″E / 17.490°N 78.598°E / 17.490; 78.598 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 21452 మంది కాగా, అందులో 11625 మంది పురుషులు, 9827 మంది మహిళలు ఉన్నారు. 2750 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 18 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

మార్చు
  1. నాను నాయక్# సుజాత
  2. హేమలత
  3. వెంకటేష్
  4. సురేఖ
  5. వెంకటేష్
  6. పావని
  7. స్వప్న హరి గౌడ్
  8. సరిత
  9. శ్రీలత
  10. గురువెల్లి వెంకటరమణ
  11. పండల అనురాధ
  12. వసుపతి రమేష్ గౌడ్
  13. వసుపతి ప్రణతి
  14. మాదిరెడ్డి నర్సింహ రెడ్డి
  15. మాదిరెడ్డి నరేందర్ రెడ్డి
  16. మౌనికా నరహరి రెడ్డిః
  17. రామారం శ్రీహరి గౌడ్

మూలాలు

మార్చు
  1. "Dhammaiguda Municipality". dhammaigudamunicipality.telangana.gov.in. Archived from the original on 11 ఆగస్టు 2020. Retrieved 2 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 2 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 2 April 2021.
  4. "Basic Information of Municipality, Dhammaiguda Municipality". dhammaigudamunicipality.telangana.gov.in. Archived from the original on 17 ఏప్రిల్ 2023. Retrieved 2 April 2021.
  5. admin (2020-05-11). "Dammaiguda municipality Councillors list 2020". Telangana data. Retrieved 17 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు

మార్చు