దర్శకుడు (సినిమా)

జక్కా హరిప్రసాద్ దర్శకత్వంలో 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం

దర్శకుడు 2017, ఆగస్టు 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. జక్కా హరిప్రసాద్[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశోక్ బండ్రెడ్డి, నోయల్ సీన్, ఈషా రెబ్బ, పూజిత పొన్నాడ తదితరులు నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[2]

దర్శకుడు
దర్శకుడు సినిమా పోస్టర్
దర్శకత్వంజక్కా హరిప్రసాద్
రచనజక్కా హరిప్రసాద్
నిర్మాతబి.ఎన్.సి.ఎస్.పి. విజయ కుమార్
థామస్ రెడ్డి ఆడూరి
రవిచంద్ర సత్తి
తారాగణంఅశోక్ బండ్రెడ్డి
నోయల్ సీన్
ఈషా రెబ్బ
పూజిత పొన్నాడ
ఛాయాగ్రహణంప్రవీణ్ అనుమోలు
కూర్పునవీన్ నూలి
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
సుకుమార్ రైటింగ్స్
విడుదల తేదీ
2017 ఆగస్టు 4 (2017-08-04)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

చిన్న‌ప్ప‌ట్నుంచి ద‌ర్శ‌కుడు కావాల‌న్న కోరికతో ఉన్న మ‌హేష్‌ (అశోక్‌)ని తండ్రి ఆనంద్‌రావు కూడా ప్రోత్సాహిస్తాడు. రెండెళ్ళపాటు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి, ద‌ర్శ‌కత్వం చేయడంకోసం క‌థ‌ను సిద్ధం చేసుకుంటాడు. హీరో, నిర్మాత‌కు క‌థ వినిపించగా, సినిమాలో ల‌వ్ ట్రాక్ బాలేదంటూ నిర్మాత చెప్తాడు. ల‌వ్ ట్రాక్ మార్చ‌డంకోసం ప‌దిహేను రోజులు గ‌డువు తీసుకొని మ‌హేష్ త‌న ఊరెళ్తాడు. తిరుగు ప్ర‌యాణంలో ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ న‌మ్ర‌త‌ (ఈషా రెబ్బా) ప‌రిచ‌యం అవుతుంది. మంచినీళ్ళ కోసం రైలు దిగిన న‌మ్ర‌తకు రైలు మిస్ అవుతుంది. న‌మ్ర‌త కోసం వెళ్ళిన మ‌హేష్ అనుకోకుండా ఆప‌ద‌లో ప‌డిన నమ్రతను ర‌క్షిస్తాడు. అలా ఇద్దరి మధ్యన ప్రేమ పుడుతుంది. ఆ సంఘ‌ట‌న‌ల‌తో త‌న సినిమాలో ల‌వ్ ట్రాక్‌ను రాసుకుంటాడు. త‌న ప‌ర్స‌న‌ల్ ఫీలింగ్స్‌ను సినిమాగా రాసినందుకు న‌మ్ర‌త‌, మ‌హేష్‌ని తిడుతుంది. మహేష్ సినిమా తీశాడా? చివ‌ర‌కు మ‌హేష్‌, న‌మ్ర‌త‌లు ఒక‌ట‌య్యారా? అనేది మిగతా కథ.[3]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • రచన, దర్శకత్వం: జక్కా హరిప్రసాద్
 • నిర్మాత: బి.ఎన్.సి.ఎస్.పి. విజయ కుమార్, థామస్ రెడ్డి ఆడూరి, రవిచంద్ర సత్తి
 • సంగీతం: సాయి కార్తీక్
 • ఛాయాగ్రహణం: ప్రవీణ్ అనుమోలు
 • కూర్పు: నవీన్ నూలి
 • నిర్మాణ సంస్థ: సుకుమార్ రైటింగ్స్

పాటలు మార్చు

ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించగా, ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

దర్శకుడు
పాటలు by
Released3 జూలై 2017
Recorded2017
Genreపాటలు
Length18:18
Languageతెలుగు
Labelఆదిత్యా మ్యూజిక్
Producerసాయి కార్తీక్
సాయి కార్తీక్ chronology
గోలిసోడా
(2016)
దర్శకుడు
(2017)
మాయ మల్లి
(2017)
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఆకాశం దిగివచ్చి"  ఎల్.వి. రేవంత్ 3:32
2. "సండే టూ సాటర్ డే"  లక్ష్మీ శృతి 3:15
3. "తొక్కలో స్క్రీన్ ప్లే"  ధనుంజయ్ 3:47
4. "నీ మనసిస్తేనా"  దినకర్ కల్వల, సాయిచరణ్ భాస్కరుణి 3:38
5. "అనగనగా ఒకరోజు"  అనురాగ్ కులకర్ణి 3:03
6. "దర్శకుడు (థీమ్ మ్యూజిక్)" (వాయద్యం)  1:03
18:18

ఇతర వివరాలు మార్చు

 1. ఈ చిత్ర మొదటి టికెటును సినీనటుడు చిరంజీవి కొని, తొలి ప్రేక్షకుడిగా సినిమా చూశాడు.[4]

మూలాలు మార్చు

 1. "Darsakudu (Direction)". The Hindu. Retrieved 6 April 2020.
 2. "Darsakudu (Producer)". TeluguMirchi.com. Archived from the original on 6 ఏప్రిల్ 2020. Retrieved 6 April 2020.
 3. ఆంధ్రజ్యోతి, రివ్యూ (4 August 2017). "దర్శకుడు మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.
 4. ఆంధ్రావిల్లాస్, సినిమా. "'దర్శకుడు' సినిమా తొలి ప్రేక్షకుడిని నేనే అయినందుకు ఆనందంగా ఉంది: మెగాస్టార్‌ చిరంజీవి". www.andhravilas.net. Retrieved 6 April 2020.[permanent dead link]

ఇతర లంకెలు మార్చు