దర్శి

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని పట్టణం, మండల కేంద్రం


దర్శి, ప్రకాశం జిల్లా, దర్శి మండలానికి చెందిన గ్రామం.ఇది దర్శి మండలానికి కేంద్రం.2011 జనగణన ప్రకారం జనాభా 33418, నివాస గృహాలు 8068.[2] 2001వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 25,907.[3] గ్రామంలో నివాస గృహాలు 5,729 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4,640 హెక్టారులు.

రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°46′N 79°41′E / 15.77°N 79.68°E / 15.77; 79.68Coordinates: 15°46′N 79°41′E / 15.77°N 79.68°E / 15.77; 79.68
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలందర్శి మండలం
విస్తీర్ణం
 • మొత్తం46.4 కి.మీ2 (17.9 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం33,418
 • సాంద్రత720/కి.మీ2 (1,900/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి955
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08407 Edit this on Wikidata )
పిన్(PIN)523247 Edit this on Wikidata

గ్రామ చరిత్రసవరించు

 
దర్శి పట్టణంలోని ప్రధాన కూడలిలో క్లాక్ టవర్ చిత్రం

చరిత్రలో దర్శనపురము కాలక్రమేణా దర్శిగా వ్యవహరించబడెనని ఇక్కడ పల్లవుల కాలంనాటి శాసనములద్వారా తెలియవచ్చుచున్నది.[4]

గ్రామ భౌగోళికంసవరించు

 దర్శి సమీప పట్టణమైన ఒంగోలు నుండి 70 కి. మీ. దూరంలో ఉంది.

సమీప గ్రామాలుసవరించు

కెల్లంపల్లి 12 కి.మీ, సామంతపూడి 6 కి.మీ, దోసకాయలపాడు 6 కి.మీ, ముండ్లమూరు 17 కి.మీ , పులిపాడు 3 కి.మీ.

శాసనసభా నియోజకవర్గంసవరించు

విద్యా సౌకర్యాలుసవరించు

 • గ్రామంలో మూడు ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 12, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 12, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 12 ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 4 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, 3 ప్రైవేటు ఆర్ట్స్/సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.
 • సమీప ఇంజనీరింగ్ కళాశాల చీమకుర్తిలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ పొదిలిలోను, మేనేజిమెంటు కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లో ఉంది.

రవాణా సౌకర్యాలుసవరించు

వినుకొండ, పొదిలి, అద్దంకి రహదారులు ఇక్కడ కలుస్తాయి. ఒంగోలు, ఇతర ప్రాంతాలనుండి బస్సులు వున్నాయి. సమీప రైల్వే స్టేషన్లు కురిచేడు(20 km దూరం), దొనకొండ (26 km దూరం) ,ఒంగోలు (59 km దూరం) వద్ద ఉన్నాయి.

భూమి వినియోగంసవరించు

దర్శిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 495 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 807 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 43 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 43 హెక్టార్లు
 • బంజరు భూమి: 623 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 2629 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1155 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 2097 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

దర్శిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 2013 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 58 హెక్టార్లు
 • చెరువులు: 26 హెక్టార్లు

శ్రీ షిర్డీ సాయి వృద్ధాశ్రమంసవరించు

ఈ ఆశ్రమం పొదిలి గ్రామములో, కురిచేడు రహదారిపై ఉన్నది.

గ్రామములోని ఉత్పత్తులుసవరించు

ప్రధాన పంటలుసవరించు

వరి, ప్రత్తి, సజ్జలు

గ్రామములోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంసవరించు

దర్శి పట్టణంలోని అద్దంకి రహదారిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో, అమ్మవారికి పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాహనాలకు పూజలు చేయించారు. అర్చకులు భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు.

శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంసవరించు

దర్శి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు వీధిలో వేంచేసియున్న ఈ ఆలయంలో, స్వామివారి 46వ వార్షిక తిరునాళ్ళ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. ఈ తిరునాళ్ళను పురస్కరించుకొని, ఆయా సామాజికవర్గాల వారు, పలు స్వచ్ఛంద సేవాసంస్థల వారు, భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, మంచినీటి ప్యాకెట్లు అందించారు. ఈ ఉత్సవాలలో విద్యుత్తు ప్రభలు ఒక ఆకర్షణకాగా, పలు సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించారు.

మూలాలుసవరించు

 1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
 2. DISTRICT CENSUS HANDBOOK PRAKASHAM - VILLAGE AND TOWN DIRECTORY (PDF). DIRECTORATE OF CENSUS OPERATIONS ANDHRA PRADESH. 2011-10-01. p. 426.
 3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
 4. చిలుకూరి వీరభద్రరావు (1910). "  పండ్రెండవ ప్రకరణము#darsi".   ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము. వికీసోర్స్. 
"https://te.wikipedia.org/w/index.php?title=దర్శి&oldid=3257125" నుండి వెలికితీశారు