దాసరి ప్రసాదరావు

వక్షస్సంబంధి శస్త్రవైద్యుడు

దాసరి ప్రసాదరావు (జననం. జనవరి 21 1950) భారతదేశానికి చెందిన కార్డియో థొరాసిక్ సర్జన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనరీ బైపాస్ సర్జరీ చేసిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ప్రజలకు అందుబాటులో వైద్యసేవలందిస్తున్నారు.[1] ఆయన చేసిన సేవలకుగాను 2001 లో భారతదేశం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.[2] కేర్ హాస్పటల్ లో ఛీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ గా, వైస్ చైర్మన్ గా, మేనేజింగ్ డైరక్టరుగా వ్యవహరించారు. ఆధునిక వైద్యం జనసామాన్యానికి అందుబాటులో ఉండేటట్లు చేయదానికి విశేష కృషి చేసారు.

దాసరి ప్రసాదరావు
జననం
దాసరి ప్రసాదరావు

(1950-01-21) 1950 జనవరి 21 (వయసు 74)
వృత్తికార్డియో థొరాసిక్ సర్జన్
క్రియాశీల సంవత్సరాలు1950–ప్రస్తుతం

జీవిత విశేషాలు మార్చు

విద్య మార్చు

ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు గ్రామంలో 1948 ఆగస్టు 10 న జన్మించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల, ఉన్నతపాఠశాలలో విద్యనభ్యసించారు. గుంటూరు, విజయవాడ కళాశాలలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు లో వైద్య పాఠశాలను ప్రారంభించారు.[3] అదే పాఠశాలలో జనరల్ సర్జరీ రెసిడేన్సీని పూర్తిచేసారు. ఆయన ఎం.బి.బి.ఎస్. ఎం.ఎస్. లను గుంటూరు మెడికల్ కాలేజీలో పొందారు. కొత్తగా గుండె ఆపరేషన్లలో ఉన్న ఆధునిక పోకడలకు ఆకర్షితులైనారు. ఆయన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు రెసిడెంట్ గా కార్డియో సర్జరీ విభాగంలో చేరారు. ఆయన 1979 లో అచట ఎం.సిహెచ్ (గుండె శస్త్ర చికిత్స) డిగ్రీ పొందారు.

వైద్య విద్యను పూర్తిచేసిన తరువాత విదేశాలకు వెళ్లి హార్ట్ సర్జరీ విభాగంలో పరిశోధనలు చేసారు. ఆయన న్యూజీలాండ్, ఇంగ్లాండ్ దేసాలకు వెళ్ళి గుండే ఆపరేషన్లపై శిక్షణ పొందారు. ఆయన న్యూజీలాండ్ లో ప్రముఖ వైద్యులు సర్ బ్రియాన్ గెర్లాండ్ బర్రాట్-బోయేస్ (1924-2006) తో కలసి పనిచేసారు. ఆయన వద్ద ఆక్లాండ్ లోని గ్రీన్ లేన్ హాస్పటల్ లోశిక్షణపొందారు[4].

ఆంధ్రప్రదేశ్ లో కార్డియో సర్జరీ మార్చు

ఆయన 1985 లో హైదరాబాదు వచ్చారు. హైదరాబాదు లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కొరోనరీ బైపాస్ సర్జరీ ఆపరేషన్లు ప్రారంబించారు. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాగ్రాం లో అనేక గుండే శస్త్ర చికిత్స పద్ధతులు ప్రవేశపెట్టబడినవి.

మెడిసిటీ మార్చు

యు.ఎస్.ఎ లో షేర్ ఫౌండేషన్ ద్వారా మెదిసిటి అనే కొత్త హాస్పటల్ ప్రారంభించబడింది. 1994 లో కార్డియో సర్జరీ ప్రోగ్రాం ప్రారంభించబడింది. 1997 లో ఒక కొత్త కంపెనీ "క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్" పేరుతో ప్రారంభించబడింది. దాని డైరక్టరుగా, వైస్ చైర్మన్ గా ప్రసాదరావు ఉన్నారు. ఈ హాస్పటల్ లో కార్డియో సర్జరీ అనేది మూలస్తంభం.

పరిశోధనలు మార్చు

ఆయన అనేక వ్యాధుల కొరకు సెల్ టెక్నాలజీస్, పునరుత్పాదక మందులను అభివృద్ధిచేయుటకు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అదనంగా ఆయన "ద ఆనల్స్ ఆఫ్ థొరాసిస్ సర్జరీ"తో పాటు అనేక పరిశోధనా పత్రాలను వెలువరించారు.[5] ఆయన "ఆసియన్ కార్డియోవాస్కులర్ అండ్ థొరాసిస్ ఆనల్స్" అనే అంశం పై పరిశోధనలు చేసారు.[6]

వ్యాపార జీవితం మార్చు

ఆయన క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ సంస్థ, దాని అనుబంధ హాస్పటల్స్ కు సహ వ్యవస్థాపకులు. ఆయన నానో హాస్పటల్ లిమిటెడ్ వ్యవస్థాపకులు.[ఆధారం చూపాలి]

వ్యక్తిగత జీవితం మార్చు

దాసరి ప్రసాదరావు 1974 లో రాష్ట్ర వైద్యమంత్రి అయిన కొడాటి రాజమల్లు కుమార్తె అయిన ప్రొఫెసర్ విజయలక్ష్మీని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.వారు సునేత్రి ప్రియాంక దేశాయ్, మను విద్యా దాసరి.

గౌరవాలు మార్చు

  • భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును 2001 లో యిచ్చి సత్కరించింది.[2]
  • ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియో వాస్కులర్ ధొరసిక్ సర్జన్స్ కు అధ్యక్షులు

మూలాలు మార్చు

  1. "Detail". Epaper.deccanpost.in. 2010-11-06. Archived from the original on 2011-08-15. Retrieved 2011-09-10.
  2. 2.0 2.1 "Ministry of Home Affairs, Govt. of India". Archived from the original on 2013-07-29. Retrieved 2015-06-12.
  3. "Andhra Pradesh Medical Council". Archived from the original on 2011-09-04. Retrieved 2015-06-12.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-27. Retrieved 2015-06-12.
  5. "Annals of Thoracic Surgery". Archived from the original on 2012-04-02. Retrieved 2015-06-12.
  6. "Asian Cardiovascular and thoracic annals". Archived from the original on 2012-03-23. Retrieved 2015-06-12.

ఇతర లింకులు మార్చు