దివికొండయ్య చౌదరి

దివి కొండయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఇతను ఆరవ శాసనసభ (1978-1983) సభాపతిగా 1978 మార్చి 16న ఏకగ్రీవంగా ఎన్నికై 1980 అక్టోబరు16 వరకు ఆ పదవిని నిర్వహించాడు.[1][2]

కీ.శే.
దివి కొండయ్య చౌదరి
దివి కొండయ్య చౌదరి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
In office
16 March 1978 – 16 October 1980
అంతకు ముందు వారురేబాల దశరథరామిరెడ్డి
తరువాత వారుకోన ప్రభాకరరావు
వ్యక్తిగత వివరాలు
జననం1 July 1918
మహదేవపురం, కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా
మరణం13 September 1990
జాతీయతభారత దేశం

జననం, విద్య మార్చు

ఇతను 1918 జూలై 1న ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మహదేవపురం గ్రామంలో జన్మించాడు. ఇతను కందుకూరులో హైస్కూలు విద్య, మద్రాసు లయోలా కాలేజీ నుండి బి. ఎ., మద్రాసు లా కాలేజీ నుండి బి.ఎల్. పూర్తిచేశాడు.

రాజకీయ జీవితం మార్చు

కొండయ్య చౌదరి స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతను జిల్లా పంచాయతీ బోర్డు అధ్యక్షునిగా పనిచేశాడు. 1955లో, 1978లో ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇతను 1966 నుండి 1972 వరకు శాసనమండలి సభ్యునిగా ఉన్నాడు.

శాసనసభాపతిగా మార్చు

కొండయ్య చౌదరి 1978 మార్చి 16న శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇతను సభాపతిగా ఉన్న కాలంలో 1978 జూన్ నెలలో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి శాసనసభను ఉద్దేశించి ప్రసంగించారు. శాసనసభలో బిల్లులపై సమగ్రమైన చర్చలు జరగాలని, ఆ చర్చలలో సభ్యులు అర్థవంతమైన సమగ్ర సమాచారంతో చర్చలను సుసంపన్నం చేయాలని పేర్కొంటూ ఇతను ప్రశంసనీయమైన రూలింగులను ఇచ్చాడు.

రాష్ట్ర మంత్రిగా మార్చు

టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో రోడ్లు, రహదారులు, భవనాలు, ప్రజా పనుల శాఖ మంత్రిగా 1980 అక్టోబరు 17 నుండి 1982 ఫిబ్రవరి 24 వరకు పనిచేశాడు.

వృత్తి జీవితం మార్చు

కొండయ్య చౌదరి న్యాయవాద వృత్తి చేపట్టి రాణించాడు. సౌమ్యునిగా, స్నేహశీలిగా ఇతనికి సమాజంలో మంచి పేరుండేది.

మరణం మార్చు

కొండయ్య చౌదరి 1990 నవంబరు 13న మరణించాడు.

మూలాలు మార్చు