దేశాల జాబితా – ఒకే దేశంతో సరిహద్దు కలిగినవి
ఇది ఒకే దేశంతో సరిహద్దు కలిగిన దేశాల జాబితా. ఆక్రమిత ప్రాంతాలు, గుర్తించబడని దేశాలు ఈ జాబితాలో చేర్చలేదు.
ఒకే ఒక్క దేశంతో సరిహద్దు కలిగిన దేశాలు ఆ దేశం తమ కంటే పెద్దదై ఉంటే అది ఆధిపత్యం చేస్తుందేమోననే శంక ఉంటుంది. ప్రస్తుత తరుణంలో ఈ సందేహాలు ఆర్థిక ఆధిపత్యం గురించి ఉంటున్నాయి. కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు లేదా డెన్మార్క్, జర్మనీ లను ఉదాహరణలుగా తీసుకోవచ్చు. భూమార్గం ద్వారానే ఎక్కువ వాణిజ్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఈ దేశాలు వాటి ఏకైక పొరుగు దేశంపై బాగా ఆధారపడి ఉంటాయి.
భూరవాణా కంటే సముద్ర రవాణా చవక కాబట్టి, వీటిలో కొన్ని దేశాలకు అనేక దేశాలతో సముద్ర పొరుగు ఉన్నట్టుగా భావించవచ్చు. ఉదాహరణకు డెన్మార్కుకు స్వీడన్, నార్వేలు సముద్రసరిహద్దు దేశాలుగా చెప్పవచ్చు.
సముద్రతీరమే లేకుండా, పూర్తిగా చుట్టుముట్టబడినవి (ఎన్క్లేవ్ లు)
మార్చు- లెసోతో - దక్షిణాఫ్రికా చేత, 909 కి.మీ (565 మై)
- శాన్ మారినో - ఇటలీ చేత, 39 కి.మీ (24 మై)
- వాటికన్ నగరం - ఇటలీ చేత, 3.2 కి.మీ (2 మై)
- కతర్ - సౌదీ అరేబియా తో, 60 కి.మీ (37 మై)
- దక్షిణ కొరియా - ఉత్తర కొరియా తో, 238 కి.మీ (148 మై) (కొరియా నిస్సైనిక రేఖకు అటునిటూ, దిగువ చూడండి)
- డెన్మార్క్ - జర్మనీ తో, 68 కి.మీ (42 మై) (ఓరెసుండ్ వంతెన ద్వారా స్వీడన్‌తో కలుపబడి ఉంది, దిగువ చూడండి)
- పోర్చుగల్ - స్పెయిన్ తో, 1,214 కి.మీ (754 మై), ఐబీరియన్ ద్వీపకల్పంలో == సముద్ర తీరం ఉండి, పాక్షికంగా చుట్టుముట్టబడి ఉన్న దేశాలు ==
- ది గాంబియా - సెనెగల్ చేత, 740 కి.మీ (460 మై)
- మొనాకో - ఫ్రాన్సు చేత, 4.4 కి.మీ (2.7 మై)
ఒకే ద్వీపాన్ని పంచుకున్న దేశాలు
మార్చు- విభాజిత ద్వీపాల జాబితా చూడండి
- బ్రూనై మలేసియన్ బోర్నియోతో మాత్రమే సరిహద్దు ఉంది, 381 కి.మీ (237 మై)
- డొమినికన్ రిపబ్లిక్, హైతీ ఈ రెండూ ఒకదానితో ఒకటి మాత్రమే సరిహద్దులు కలిగి ఉన్నాయి, హిస్పానియోలా ద్వీపంపై - 360 కి.మీ (220 మై)
- తూర్పు తిమోర్ ఇండోనేసియాతో మాత్రమే సరిహద్దు ఉంది, 228 కి.మీ (142 మై), తిమోర్ ద్వీపంపై
- ఐర్లండ్ రిపబ్లిక్, యునైటెడ్ కింగ్డమ్ (ప్రత్యేకించి, ఉత్తర ఐర్లండ్) ఈ రెండూ ఒకదానితో ఒకటి మాత్రమే సరిహద్దు కలిగి ఉన్నాయి -ఐర్లండ్ ద్వీపంపై 360 కి.మీ (220 మై) (ఇంగ్లాండు ద్వీపం ఫ్రాన్సుతో ఛానెల్ సొరంగం ద్వారా కలపబడి ఉంది)
- పపువా న్యూ గినియా ఇండోనేసియా తో, న్యూ గినియా ద్వీపంపై 820 కి.మీ (510 మై) పొడవున సరిహద్దు కలిగి ఉంది.
క్యూబా గ్వాంటనామో బే వద్ద అమెరికా సంయుక్త రాష్ట్రాల సైనిక స్థావరంతో సరిహద్దు కలిగి ఉంది. ఇది క్యూబా ప్రాంతం అయినప్పటికీ అమెరికాకు అద్దెకు ఇచ్చారు. ఈ విషయాన్ని అమెరికా కూడా క్య్హూబా వాదనతో అంగీకరిస్తుంది. అయితే అమెరికా దీన్ని శాశ్వత అద్దెగా వర్ణించగా, క్యూబా రద్దైన ఒప్పందంగా భావిస్తుంది.
ఒక ఖండాన్ని పంచుకున్నవి
మార్చు- కెనడా కు అమెరికా సంయుక్త రాష్ట్రాలుతో మాత్రమే సరిహద్దు ఉంది. డెన్మార్క్ తోను (బాఫిన్ ద్వీపం, గ్రీన్లాండ్ ల మధ్య), ఫ్రాన్సు తోను (న్యూఫౌండ్లాండ్, సెంట్ పియరీ అండ్ మికెలోన్ ల మధ్య) దానికి సముద్ర సరిహద్దులున్నాయి. కానీ దానికి ఉన్న ఒకే ఒక భూ సరిహద్దు దక్షిణాన అమెరికా, వాయవ్యాన అలాస్కా.
తటస్థ మండలాలు
మార్చు- దక్షిణ కొరియా నిస్సైనిక రేఖ వద్ద ఉత్తర కొరియాతో సరిహద్దు కలిగి ఉంది. కానీ 4 కి.మీ వెడల్పైన నిస్సైనిక మండలం వాటిని విడదీస్తూ ఉంది.
ఇతర సరిహద్దులు
మార్చుకాజువేలు, వంతెనలు, సొరంగాలు
మార్చుఈ జాబితాలోని సరిహద్దులు మానవ నిర్మితమైన కట్టడాల మధ్యన ఉండే ఊహా సరిహద్దులై ఉండవచ్చు. వంతెన, లేదా కృత్రిమ ద్వీపం భూ సరిహద్దు కాజాలవు.
- జర్మనీతో ఉన్న సరిహద్దుతో పాటు డెన్మార్క్ కు సాంకేతికంగా ఒరెసండ్ వంతెన రూపంలో మరో సరిహద్దు కూడా ఉంది.
- ద్వీప దేశమైన సింగపూర్‌కు సహజసిద్ధమైన భూ సరిహద్దులు లేనప్పటికీ, మలేషియాతో జోహోర్ కాజ్వే, మలేసియా - సింగపూర్ సెకండ్ లింక్ రూపాల్లో సరిహద్దులు ఉన్నాయి.
- మరో ద్వీపదేశమైన బహ్రెయిన్ కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా సౌదీ అరేబియాతో కలపబడి ఉంది. కతర్‌తో కలిపే కతర్ - బహ్రెయిన్ స్నేహ వారధి ఇంకా రూపకల్పన దశలో ఉంది.
- యునైటెడ్ కింగ్డమ్ ఐర్లండ్ రిపబ్లిక్‌తో ఉన్న సరిహద్దుతో పాటు, ఫ్రాన్సుతో చానెల్ సొరంగంను సరిహద్దుగా కలిగి ఉంది.
పరాధీన ప్రాంతాలు
మార్చుకొన్ని సందర్భాల్లో ఒక దేశపు అధీనంలో ఉన్న ప్రాంతం వేరే దేశంతో సరిహద్దు కలిగి ఉండవచ్చు.
- బ్రిటిషు సార్వభౌమ ప్రాంతమైన అక్రోటీరి, ధెకేలియా, సైప్రస్‌తో సరిహద్దు కలిగి ఉంది. ధెకేలియా ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్‌తో కూడా సరిహద్దు కలిగి ఉంది. అయితే ఈ ప్రాంతాన్ని టర్కీ మాత్రమే గుర్తించింది.
- ఫిన్నిష్ స్వతంత్ర ప్రాంతమైన ఆలండ్ దీవులు, మార్కేట్ స్కెర్రీ ద్వారా స్వీడన్ తో సరిహద్దు కలిగి ఉంది.
- ఒక చిన్న ద్వీపకల్పమైన బ్రిటిషు ప్రాంతం, జిబ్రాల్టర్ స్పెయిన్‌తో సరిహద్దు కలిగి ఉంది.
- సెయింట్ మార్టిన్ ద్వీపం రెండు ద్వీప రాజ్యాల మధ్య విభాజితమై ఉంది: ఉత్తర ప్రాంతం, సెయింట్-మార్టిన్ ఫ్రెంచి విభాగం కాగా, దక్షిణ సగం, సింట్ మార్టెన్, నెదర్లాండ్స్ యాంటిల్స్ లో భాగం.
చారిత్రకం
మార్చుచారిత్రాకంగా ఒకే పొరుగు దేశం కల దేశాలు అనేకం ఉన్నాయి. అయితే అందులో కొన్ని ఇప్పుడు దేశాలుగా లేకపోగా మరికొన్ని భూభాగం సరిహద్దు లేక మరికొన్ని ఒకటికన్నా ఎక్కువ దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. ప్రపంచ రాజకీయ పటాల్లో వచ్చిన మార్పులే వీటికి కారణం.
- 1860 కు ముందు అనేక సంవత్సరాల పాటు కొరియా కేవలం చైనాతో మాత్రమే సరిహద్దు కలిగి ఉండేది. అయితే పెకింగ్ కన్వెన్షన్ ప్రకారం రష్యాతో రెండవ సరిహద్దు ఏర్పడతం జరిగింది.
- సిస్కై, దక్షిణ ఆఫ్రికాకు చెందిన "స్వతంత్ర" హోమ్లాండ్స్, ఏప్రిల్ 27 1994 న కలుపబడ్డాయి.
- డొమీనియన్ ఆఫ్ న్యూఫౌండ్ లాండ్, కెనడా చేతుల్లో మార్చి 31 1994 వరకూ వున్నది, తరువాత కెనడా ప్రావిన్స్ గా ఏర్పాటైంది, దీని ప్రస్తుత పేరు న్యూఫౌండ్లాండ్, లాబ్రడార్)
- స్కాట్లాండు, ఇంగ్లాండు 1535 (వేల్స్ ఇంగ్లాండ్ లోని అంతర్భాగమై ఉన్నప్పుడు), 1707 ల మధ్య సరిహద్దులు గలిగివుండేవి. ఏకీకరణ చట్టాలుద్వారా తిరిగీ ఏకీకృతమయ్యాయి. చూడండి : ఆంగ్లో-స్కాటిష్ బోర్డర్.
- హాంకాంగ్,లో ఖండమునకు చెందిన ప్రాంతాలు, 200లకు పైగా దక్షిణ చైనా సముద్రం, లోని ద్వీపాలు కలిగివుండేది. ఇవి ఖింగ్ చైనా నుండి యునైటెడ్ కింగ్డంలో కలుపబడ్డాయి. 1997లో ఇవి తిరిగీ చైనాకు ఇవ్వబడ్డాయి. అయిననూ "ఒక దేశం రెండు విధానాలు" ద్వారా తన సొంత న్యాయవ్యవస్థతో నడుపబడుచున్నాయి.
- మకావు, దక్షిణచైనా సముద్రం లోని ఒక ద్వీపకల్పం, రెండు ద్వీపాలు కలిగివుంది. ఇది హాంకాంగ్ కు 60 కి.మీ. దూరంలో ఉంది. హాంకాంగ్ లాగా ఈ ప్రాంతమూ కొలోనియల్ పవర్ (దీని విషయంలో పోర్చుగల్) చేతిలో వుండేది. కానీ 1999 లో ఈ ప్రాంతాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇఉ ఇవ్వబడ్డాయి.