దేశోద్ధారకుడు (1986 సినిమా)
దేశోద్ధారకుడు 1986 లో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం. దీనిని విజయభాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డి. మురళీ మోహనరావు నిర్మించాడు. ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2][3]
దేశోద్ధారకుడు (1986 సినిమా) (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎస్.రవిచంద్ర |
---|---|
తారాగణం | బాలకృష్ణ, విజయశాంతి , రావుగోపాలరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | విజయభాస్కర్ ఫిలిం ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది. గోపి (నందమూరి బాలకృష్ణ) అల్లరివాడు. తన తాత శంకరయ్య (రావు గోపాలరావు) వద్ద సోదరి లక్ష్మి (సంయుక్త) తో కలిసి పెరిగాడు. అతను ఎప్పుడూ కొంటె పనులు చేస్తూంటాడు. శంకరయ్య తన ప్రతిష్ఠను కాపాడుకోటానికి దానిని ఎప్పుడూ కప్పిపుచ్చుతూంటాడు. ఒకసారి, ఒక అందమైన అమ్మాయి విజయ (విజయశాంతి) వారి గ్రామానికి వస్తుంది. అక్కడ గోపితో ఆమెకు పరిచయం చిన్న గొడవతో ప్రారంభమవుతుంది. తరువాత, అపాయం నుండి ఆమెను రక్షించడంతో ఆమె అతన్ని ఇష్టపడటం ప్రారంభిస్తుంది. ఇంతలో, శంకరయ్య లక్ష్మికి ఒక సంబంధం చూస్తాడు. కానీ అది గోపి ప్రవర్తన కారణంగా చెడిపోతుంది. ఇది శంకరయ్య మరణానికి దారితీస్తుంది.
ప్రస్తుతం, గోపి తన కాళ్ళపై తానునిలబడాలని లక్ష్యంగా పెట్టుకుని, దాని కోసం అతను నగరానికి వెళ్తాడు. సమాంతరంగా, మరొక గ్రామంలో ఇద్దరు దుర్మార్గులు ధర్మా రాయుడు (సత్యనారాయణ), నరసింహ నాయుడు (నూతన్ ప్రసాద్) ఒకరిపై ఒకరు ఆధిక్యత సాధించడానికి ప్రయత్నిస్తూంటారు. విజయ ఆ ఊళ్ళోనే నివసించే స్కూల్ మాస్టరు (కాంతారావు) కుమార్తె. అతడు కూడా వారి క్రూరత్వానికి బాధితుడే. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై విచారణకు ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తుంది. ఈ సంగతి తెలుసుకుని, ఆ అధికారిని పట్టుకోవటానికి దుర్మార్గులిద్దరూ ప్రయత్నం చేస్తారు. దైవికంగామ్, అదే సమయానికి గోపి అక్కడికి వస్తాడు. వారు అతదే ఆ అధికారి అని పొరబడతారు. గ్రామాన్ని రక్షించే పాత్రలో అతన్ని కొనసాగమని విజయ అతన్ని కోరుతుంది. విజయ అతనికి చదువూ వ్యవహార జ్ఞానం నేర్పించి ఒక మాస్టర్‌గా చేస్తుంది. ఆ తరువాత, గోపి ధర్మా రాయుడు, నరసింహ నాయుడును ఆటపట్టించడం ప్రారంభిస్తాడు, వారి అకృత్యాలను అడ్డుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. దాంతో, దుర్మార్గులిద్దరూ ఒక్కటౌతారు. గ్రామానికి చెందిన పిచ్చివాడే (గొల్లపుడి మారుతీరావు) నిజమైన ప్రత్యేక అధికారి అని తెలుస్తుంది. చివరికి, గోపి దుర్మార్గుల ఆట కట్టిస్తాడు.. అదే పెళ్ళికుమారుడు వేణు (అరుణ్ కుమార్) తో లక్ష్మికి పెళ్ళి చేస్తాడు. చివరగా, గోపి, విజయల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.
తారాగణం
మార్చు- నందమూరి బాలకృష్ణ
- విజయశాంతి
- రావు గోపాలరావు
- కైకాల సత్యనారాయణ
- గొల్లపూడి మారుతీరావు
- నూతన్ ప్రసాద్
- కాంతారావు
- బేతా సుధాకర్
- అరుణ్ కుమార్
- సుత్తి వీరభద్రరావు
- రాళ్లపల్లి
- చిడతల అప్పారావు
- మల్లికార్జునరావు
- ముచ్చెర్ల అరుణ
- సంయుక్త
- కాకినాడ శ్యామల
- కల్పనా రాయ్
- వై.విజయ
- బాలాజీ
- మాడా
- వంకాయల సత్యనారాయణ
- చిట్టిబాబు
- కె.కె.శర్మ
- టెలిఫోన్ సత్యనారాయణ
- ఎన్.శివప్రసాద్
- జయభాస్కర్
- మాస్టర్ రవి
- మాస్టర్ సురేష్
సాంకేతిక నిపుణులు
మార్చు- కళ: శ్రీనివాస రాజు
- నృత్యాలు: శివ శంకర్
- పోరాటాలు: జూడో రత్నం
- సంభాషణలు: సత్యానంద్
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి. సుశీలా
- సంగీతం: చక్రవర్తి
- కథ: గొల్లపూడి మారుతీరావు
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: నందమూరి మోహన కృష్ణ
- నిర్మాత: డి.మురళి మోహన్ రావు
- చిత్రానువాదం - దర్శకుడు: ఎస్.ఎస్.రవిచంద్ర
- బ్యానర్: విజయభాస్కర్ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1986 ఆగస్టు 7
పాటలు
మార్చుపాటలు వేటూరి సుందరరామమూర్తి రాశాడు. సప్తస్వర్ ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "అమ్మాయి ముద్దబంతి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:10 | ||||||
2. | "ఎంత పని చేసిందమ్మా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:20 | ||||||
3. | "గగన వీధుల్లో" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:19 | ||||||
4. | "పట్టుకుంటే మాసిపోయే" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 3:49 | ||||||
5. | "వచ్చే వచ్చే వానజల్లు" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 3:49 | ||||||
20:27 |
మూలాలు
మార్చు- ↑ "Heading". Chitr.com. Archived from the original on 2016-03-05. Retrieved 2020-08-04.
- ↑ "Heading-2". gomolo. Archived from the original on 2018-09-24. Retrieved 2020-08-04.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Desodharakudu (1986)". Indiancine.ma. Retrieved 2023-07-29.