దోర్నాల హరిబాబు

దోర్నాల హరిబాబు (జ. 1968 మార్చి 22) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చెందిన రంగస్థల, సినిమా నటుడు. నాటకాల్లో, టీవీ రియాలిటీ కార్యక్రమాల్లో హాస్యనటుడిగా నటించాడు.

దోర్నాల హరిబాబు
Haribabu Dornala.jpg
జననం (1968-03-22) 1968 మార్చి 22 (వయస్సు 53)
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల, సినిమా నటుడు
తల్లిదండ్రులునరసింహరావు

జననంసవరించు

హరిబాబు 1968, మార్చి 22న నెల్లూరులో జన్మించాడు. తండ్రిపేరు నరసింహరావు.తల్లి పేరు సీతామహాలక్ష్మి, బికాం వరకు చదువుకున్నాడు.

నాటకరంగంసవరించు

1980లో రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డి దగ్గర నాటకరంగంలో శిక్షణ పొందిన హరిబాబు, పన్నెండేళ్లపాటు పౌరాణిక నాటకాల్లో నటించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు తమిళనాడు, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హాస్యనాటకాలు ప్రదర్శించి 19సార్లు ఉత్తమ హస్యనటుడిగా బహుమతులు అందుకున్నాడు.[1]

నటించినవి

 1. కర్కోటకుడు, జీవలుడు (చిత్రనళీయం)
 2. లోహితుడు, కేశవుడు (సత్యహరిశ్చంద్ర)
 3. భరతుడు (శకుంతల)
 4. చిన్న చంద్రుడు (తారాశశాంకం)
 5. సుకులుడు (సారంగధర)
 6. శ్రీరాముడు (భక్తరామదాసు)

టీవీరంగంసవరించు

టెలివిజన్ ఛానళ్ళలో ప్రసారమయ్యే కామెడీ ప్రోగ్రామ్‌లలో నటించి ప్రేక్షకులను నవ్వించాడు. జీ స్మైల్ శ్రీ, మత్తుగా గమ్మత్తుగా, నవ్వుల్- నవ్వుల్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

పురస్కారాలు - బహుమతులుసవరించు

 1. నెల్లూరు జిల్లాస్థాయి కందుకూరి పురస్కారం - 2018 - నాటకరంగంలో కృషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2018.[2][3]
 2. స్వర్ణ పతకం - ఆంధ్రసోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నాటక పోటీలు, చెన్నై
 3. ‘స్మైల్ రాజా’ అవార్డుతోపాటు లక్షరూపాయల బహుమతి
 4. అమెరికన్ ఎక్సలెన్సీ అవార్డు- తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్, అమెరికా

ఇతర వివరాలుసవరించు

 1. హరివిల్లు క్రియేషన్స్ పేరుతో సాంస్కృతిక సంస్థను స్థాపించి, హాస్యవల్లరి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.
 2. సారా వ్యతిరేకోద్యమం, పారిశుద్ధ్యం- ప్రజారోగ్యం, దోమల నిర్మూలన వంటి ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాలలో నటించాడు.
 3. అమెరికా, దుబాయ్, మలేసియా, మారిషస్ దేశాల్లో సంక్రాంతి సంబరాలు, తెలుగు సంఘం వేడుకల్లో హాస్య ప్రదర్శనలు చేశాడు.

నిర్వహించిన పదవులుసవరించు

 1. ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ మాజీ సభ్యుడు.

మూలాలుసవరించు

 1. సాక్షి, ఫ్యామిలీ (5 November 2013). "కళాత్మకం : నవ్వుల హరివిల్లు". Archived from the original on 22 మార్చి 2020. Retrieved 22 March 2020.
 2. వెబ్ ఆర్కైవ్, ఈనాడు, తాజా వార్తలు (16 April 2018). "కందుకూరి రంగస్థల అవార్డులు ప్రకటన". Retrieved 22 March 2020.
 3. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కందుకూరి పురస్కారాలు - 2018" (PDF). web.archive.org. Retrieved 22 March 2020.