దమ్తారి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దమ్తారీ జిల్లా లోని నగరం. ఈ జిల్లా ముఖ్యపట్టణం. నగర పరిపాలన మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. [1] ఇది 1998 జూలై 6 వ తేదీన ఏర్పడిన మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. చత్తీస్‌గఢ్ మొత్తం జనాభాలో ఈ జిల్లా జనాభా 3.13 శాతం ఉంది.

ధమ్తారి
నగరం
ధమ్తారి is located in Chhattisgarh
ధమ్తారి
ధమ్తారి
ఛత్తీస్‌గఢ్ పటంలో నగర స్థానం
Coordinates: 20°43′N 81°33′E / 20.71°N 81.55°E / 20.71; 81.55
దేశంభారతదేశం
జిల్లాధమ్తారి
విస్తీర్ణం
 • Total34.94 కి.మీ2 (13.49 చ. మై)
Elevation
317 మీ (1,040 అ.)
జనాభా
 (2011)
 • Total1,01,677
 • జనసాంద్రత2,900/కి.మీ2 (7,500/చ. మై.)
Time zoneUTC+5:30 (IST)
PIN
493773, 4936XX,4937XX
Vehicle registrationCG05
Websitewww.dhamtari.gov.in

చరిత్ర

మార్చు
 
ధమ్తారి, భారతదేశంలోని మిషనరీలు, 1932

ధమ్తారి జనాభా 1955 లో 17,278. ఆ సమయంలో, ఈ పట్టణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాయపూర్ జిల్లాలో భాగంగా ఉండేది. 2000 లో, ఇది కొత్త ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భాగమైంది. ధమ్తారీ తహసీల్ ప్రధాన కార్యాలయం. బెంగాల్ నాగపూర్ రైల్వేకు చెందిన బొంబాయి - కలకత్తా ప్రధానమార్గం నుండి చీలి న్యారో గేజి మార్గం ధమ్తారికి వెళ్తుంది. ధమ్తారి వాణిజ్య కేంద్రంగా మారింది. అక్కడ నుండి రవాణా అయ్యే వస్తువుల్లో కలప, యూరియా, బీడి ఆకులు, బియ్యం, జంతు చర్మంతో చేసిన వస్తువులు.

భౌగోళికం

మార్చు

ధత్తారి చత్తీస్‌గఢ్‌లోని సారవంతమైన మైదానంలో ఉంది. జిల్లా మొత్తం వైశాల్యం 2,029 చదరపు కిలోమీటర్లు (783 చ. మై.). ఇది సముద్ర మట్టానికి 317 మీటర్ల ఎత్తున ఉంది. ధమ్తారి, రాష్ట్ర రాజధాని రాయపూర్ నుండి 65 కి.మీ. దూరంలో ఉంది.

ఆర్థిక వ్యవస్థ

మార్చు

జిల్లాలో సీసం నిల్వలు ఉన్నాయి. నగరంలోని చాలా మంది కార్మికులు కలప పరిశ్రమ లేదా బియ్యం లేదా పిండి మిల్లుల్లో (ధమ్తారిలో 200 పైచిలుకు ధాన్యం మిల్లులు ఉన్నాయి) పనిచేస్తారు. పట్టణంలో రసాయన పరిశ్రమ కూడా గణనీయంగా ఉంది. మహానదిపై ఉన్న రవిశంకర్ సాగర్ ఆనకట్ట (గాంగ్రెల్ డ్యామ్) నగరం నుండి 17 కి.మీ. దూరంలో ఉంది. ఇది దాదాపు 1,40,000 ఎకరాల భూమికి సాగునీటిని అందిస్తుంది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు, భిలాయ్‌లోని ఉక్కు కర్మాగారానికీ ప్రాథమికంగా తాగునీటిని సరఫరా చేస్తుంది.

నగర మేయర్ల జాబితా

మార్చు
కార్యాలయ వ్యవధి పేరు పార్టీ గమనికలు
1922-1926 నారాయణరావు మేఘవాలే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1932-1934 నాత్తురావ్ జగ్తాబ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1934-1936 ఖమ్మన్‌లాల్ సా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1936-1937 చోటెలాల్ జీ దౌ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1937-1939 బాబు చోటే లాల్ శ్రీవాస్తవ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1941-1946 రాంగోపాల్ శర్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1946-1950 గిరిధరి లాల్ మిశ్రా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1951-1952 రాంగోపాల్ శర్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నామినేట్ చేయబడింది
1952-1954 రాధేశ్యామ్ ఖరే భారతీయ జన సంఘం
1955-1957 రాధేశ్యామ్ ఖరే భారతీయ జన సంఘం
1969-1971 హనుమాన్ ప్రసాద్ మిశ్రా భారతీయ జన సంఘం
1971-1974 పండరీ రావు పవార్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1984-1987 కరిషన్ కుమార్ ధంద్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నామినేట్ చేయబడింది
1995-2000 నారాయణ్ ప్రసాద్ గుప్తా బిజెపి
2000-2005 జానకీ పవార్ బిజెపి
2005-2010 తారాచంద్ హిందూజా బిజెపి
2010-2015 నారాయణ్ ప్రసాద్ గుప్తా బిజెపి
2015-2020 అర్చన చౌబే బిజెపి
2020- విజయ్ దేవాంగన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

ధమ్తారి రాయపూర్ నుండి జగదల్‌పూర్ జాతీయ రహదారి 30 పై ఉంది, ప్రతి 5-15 నిమిషాలకు ఇక్కడ నుండి ఈ నగరాలకు బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. రాయ్‌పూర్ ధమ్తారిల మధ్య ఉన్న న్యారో-గేజ్ రైలు మార్గం ఒకప్పుడు ఆ ప్రాంతానికి సేవలందించింది.

మూలాలు

మార్చు
  1. "Dhamtari Municipal Corporation". dailypioneer.com. Retrieved 2014-08-14.[dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=ధమ్తారి&oldid=3396303" నుండి వెలికితీశారు