ధరణి (దర్శకుడు)
ధరణి (విసి రమణి), దక్షిణ భారత చిత్ర దర్శకుడు. ఇతడు ప్రధానంగా యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[1][2] తమిళంలో సూపర్ హిట్ యాక్షన్ చిత్రాలైన ధిల్, ధూల్, ఘిల్లి మొదలైన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
ధరణి | |
---|---|
జననం | విసి రమణి |
వృత్తి | సినిమా దర్శకుడు, చిత్రానువాదం రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1999-2011 |
సినిమారంగం
మార్చుఫారెస్ట్ బ్రిగేండ్ వీరప్పన్, అతని తమ్ముడి మరణం ఆధారంగా రూపొందిన ఎతిరుమ్ పుదిరం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో మమ్ముట్టి నటించాడు. 1999లో ఏర్పడిన రాజకీయ వివాదాల వల్ల ఈ సినిమా ఆలస్యంగా విడుదలయింది. ఇది విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతోపాటు, రెండవ ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది. ఈ చిత్ర నిర్మాత పూర్ణచంద్రరావు ధరణి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా, ధిల్ సినిమా నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. 2003లో ఎ.ఎం. రత్నం నిర్మాణంలో విక్రమ్, జ్యోతిక, రీమాసేన్ లతో ధరణి తీసిన ధూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తరువాత ఎ.ఎం.రత్నం నిర్మాతగా విజయ్, త్రిష నటించిన ఘిల్లి సినిమాకు దర్శకత్వం వహించాడు.[3] దీని తరువాత తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో బంగారం సినిమా తీశాడు.
సినిమాలు
మార్చు- దర్శకుడిగా
సంవత్సరం | సినిమా | విభాగం | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
దర్శకుడు | రచయిత | |||
1999 | ఎతిరం పుదిరం | ఉత్తమ మూడవ ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం | ||
2001 | ధిల్ | |||
2003 | ధూల్ | |||
2004 | ఘిల్లి | |||
2006 | బంగారం | తెలుగు చిత్రం | ||
2008 | కురువి | |||
2011 | ఒస్తే |
- గాయకుడిగా
- "తారుమారు" (ఉచతుల శివ)
మూలాలు
మార్చు- ↑ "Dharani is back". Behindwoods. Archived from the original on 19 July 2012. Retrieved 2 April 2021.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Sreedhar Pillai 9 May 2011, 12.00am IST (2011-05-09). "Dharani: Back with Da'bang'G - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2012-07-07. Retrieved 2 April 2021.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Welcome to". Sify.com. 2007-01-20. Archived from the original on 2018-07-20. Retrieved 2 April 2021.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ధరణి పేజీ