ధర్మ దేవత (1952 సినిమా)

1952 తెలుగు సినిమా
(ధర్మదేవత నుండి దారిమార్పు చెందింది)

ధర్మదేవత పి.పుల్లయ్య నిర్మాతగా రాగిణీ ఫిలింస్ పతాకంపై నిర్మించి 1952, మే 14వ తేదీన విడుదల చేసిన తెలుగు జానపద సినిమా.

ధర్మ దేవత
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
కథ త్రిపురనేని గోపీచంద్
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
నేపథ్య గానం భీమవరపు నరసింహారావు, లలిత, జిక్కి కృష్ణవేణి, కె.రాణి, ప్రసాద రావు
గీతరచన సీనియర్ సముద్రాల
కొండముది గోపాలరాయశర్మ
సంభాషణలు త్రిపురనేని గోపీచంద్
కళ మాధవపెద్ది గోఖలే, ఎస్.వి.ఎస్. రామారావు, ఎల్.వీ.మాండ్రే
నిర్మాణ సంస్థ రాగిణి ఫిల్మ్స్
భాష తెలుగు

పాత్రధారులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, మాటలు-త్రిపురనేని గోపిచంద్
  • స్క్రీన్ ప్లే - కె.వి.రెడ్డి
  • ఛాయాగ్రహణం- మాధవ్‌బుల్‌బులే
  • సంగీతం- సి.ఆర్.సుబ్బరామన్
  • కళ- ఎస్.వి.ఎస్.రామారావు, యల్.వి.మాండ్రీ
  • నిర్మాత- దర్శకుడు: పి.పుల్లయ్య
  • పాటలు-సముద్రాల సీనియర్, గోపాలరాయశర్మ

కథా సారాంశం

మార్చు

వీరసేనుడు (లింగమూర్తి) ఉజ్జయిని రాజ్యాధినేత. అతని కూతురు స్వర్ణ(బేబి సరస్వతి) తల్లి లేని పిల్ల. ఆమెను అపురూపంగా పెంచుతుంటాడు వీరసేనుడు. చంపాదేవి (లక్ష్మీప్రభ) అనే వేశ్యతో కలిసి రాజమందిరంలో జీవిస్తూ ప్రజలను దయాదాక్షిణ్యాలు లేకుండా, హింసిస్తూ, పాలిస్తుంటాడు. రాజ్యానికి పొరుగునవున్న గ్రామంలో రఘునాథశర్మ (ముక్కామల), అక్క కాత్యాయిని (శాంతకుమారి), ఆమె కొడుకు గోపాల్ (కందామోహన్) నివసిస్తూ వుంటారు. బావ వైద్యంకోసం, ఉజ్జయినికి, మేనల్లుడుతో వచ్చిన రఘునాథ్, ఓ వీధి నర్తకి బిజిలి (లలిత) తల్లి, మహారాజు రథచక్రం కిందపడి మరణించగా, మహారాజును ఎదిరిస్తాడు. బాలుడు గోపాల్ విసిరిన రాయి, మహారాజుకు తగలటంతో మహారాజు బాలుని సింహాలకు వేయమని సర్వాధికారి (దొరస్వామి)కి ఆజ్ఞ ఇస్తాడు. రఘు, అతని బావల ప్రార్థన మహారాజు మన్నించడు. రఘునాథ్ మహారాజు సైన్యంతో పోరాడి మేనల్లుడు మరణించినందుకు ప్రతీకారంగా రాకుమార్తె స్వర్ణను అపహరించి, అక్కవద్దకు తెచ్చి బావ, మేనల్లుడుకోసం, ఈమెను హతమారుస్తానంటాడు. రాజభటులు వచ్చి, రఘుపై ఇంటివద్ద దాడి చేయగా, కాత్యాయిని పాపతో తప్పించుకునిపోయి రత్నగిరి అనే పల్లెలో తల దాచుకుంటుంది. సంజీవి తాత (బి.నరసింహారావు) వైద్యంతో గతం మరచిన పాపను తన పాపగా పెంచి పెద్ద చేస్తుంది. వాసంతి (గిరిజ)గా ఎదిగిన రాకుమారిని ఒకనాడు శూరసేనుడు(కౌశిక్) అనే యువకుడు రక్షిస్తాడు. వారిరువురూ ప్రేమించుకోవటం, ఉద్యోగంకోసం ఉజ్జయిని వెళ్ళిన శూరసేనుడు, వీరసేనుని సేనానిగా నియమించబడి, రఘునాథశర్మను పట్టుకోవాలన్న మహారాజు ఆదేశంపై, అతని రహస్య స్థావరాన్ని ముట్టడించి, రఘునాథ్‌ను బందీగాతెస్తాడు. రాకుమారి స్వర్ణ గురించి అడుగగా, తనకి తెలియదని చెప్పటంతో వీరసేనుడు అతన్ని చంపబోగా, కాత్యాయిని వచ్చి, వాసంతియే స్వర్ణ అని తెలియచేస్తుంది. ఆమె కుమారుడు గోపాల్‌ను తాను కాపాడి, కాశి నగరంలో పెంచి పెద్దచేశానని, అతడే శూరసేనుడు అని ఒక సైనికుడు మహారాజుకు అందరికి తెలియచేస్తాడు. వీరసేనుడు పశ్చాత్తాపంతో రఘునాథశర్మను క్షమించమని కోరి, శూరసేనుడు, వాసంతిల వివాహం జరిపి వారికి రాజ్యభారం అప్పగిస్తాడు[1].

విశేషాలు

మార్చు

మొదట ఈ చిత్రానికి హీరోగా అక్కినేని నాగేశ్వరరావును నిర్ణయించి, కారణాంతరాల వలన ఆయన విరమించుకోవటం, అందుచేత నిర్మాతలు, నూతన నటుడు కౌశిక్‌ను హీరోగా నిర్ణయించారు. కౌశిక్ పొద్దుటూరు ప్రాంతానికి చెందినవాడు కావటం, తొలిసారే హీరోగా ఛాన్స్ పొందటం విశేషం. కె.వి.రెడ్డిగారి సూచనతో హీరోయిన్‌గా గిరిజను ఎన్నుకున్నారు.

పాటలు

మార్చు
  1. మీవంటిదేనండి మా కన్నెపాప దీవించరండి - పి. శాంతకుమారి
  2. ఏ ఊరె చిన్నదాన తొలకరి మెరుపల్లె - కె.ప్రసాదరావు, కె. రాణి
  3. రావే వసంతముకాగా నేడే ఆనందమాయె - కె.ప్రసాదరావు, జిక్కి
  4. లంబాడిలంబాడిలంబ లంబాడిలంబాడిలంబ - కె. రాణి బృందం
  5. పాటలు పల్లవి కావాలోయి ఆటలు గజ్జలు - కె. రాణి
  6. విరిసే వెన్నెలలో వెంట జంట ఉండాలోయి - రేలంగి,కె.ప్రసాదరావు, జిక్కి బృందం
  7. చిందువేయవోయి చిన్ని కృష్ణయ్య - బి. ఎన్.రావు, కె.రాణి, జిక్కి
  8. వలచి పిలుచునోయి వయ్యారి చిన్నది
  9. బంతిపూల రంగయో, నీకింత - రేలంగి
  10. పాటకుపల్లవి కావాలోయ్ - కె.రాణి

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు