ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు
ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ధర్మవరంలో నేయబడుతున్న వస్త్రాలు.[1][2] ఈ వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు చట్టం 1999 ప్రకారం భారతదేశంలోని భౌగోళిక గుర్తింపు చిహ్నాల జాబితా లో స్థానం లభించింది.[3][4]
![]() |
ఈ వ్యాసం భౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
చరిత్ర సవరించు
ఈ చీరలకు 120 యేండ్ల చరిత్ర ఉంది. ఇచట 1500 పట్టు గృహాలు, ఒక లక్ష మగ్గాలున్నాయి. చీర ఖరీదు సుమారు 2000 నుండి ఒక లక్ష వరకు ఉండేది. ఈ చీరల తయారీకి కుండన్స్, చెమ్కీలు, రంగురాళ్ళు వివిధ రకాలుగా ఉపయోగిస్తారు.[1]
లక్షణాలు సవరించు
ఇతర చీరలతో పోల్చితే ధర్మవరం పట్టుచీరలు ఎంతో నాణ్యతను కలిగి ఉంటాయి. ధర్మవరం పెళ్ళి పట్టు చీరలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మంచి రంగులు, ఆకర్షణీయమైన జరీ కొంగు ఈ చీర ప్రత్యేకత. ధర్మవరం చీరలు కంచిపట్టు చీరలకు దగ్గర పోలిక. కానీ రంగులు, డబుల్‌షేడెడ్.. మాత్రం పూర్తి భిన్నం.[5] ఈ చీరలలో ప్రత్యేకమైనవి రక్షా బంధన్ చీర, కట్టుకుంటే సంగీతం వినిపించే మ్యూజికల్ చీర, ఎప్పుడూ సంపంగి పూల వాసన గుబాళించే సంపంగి చీర, అన్నపూర్ణేశ్వరి. పుష్పవల్లి, రంగవల్లి వంటి రకరకాల పట్టు చీరలను తయారు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు ధర్మవరం నేత కార్మికులు.
రక్షా బంధన్ పట్టుచీర సవరించు
రాఖీ పండగ కోసం ప్రత్యేకంగా అన్వర్ బాషా అనే చేనేత కార్మికుడు సృజనాత్మకతకు పదును పెట్టి ఒక చీరను రూపొందించారు. ఈ చీర మొత్తం మీద వివిధ రకాల డిజైన్లలో 33 రాఖీలున్నాయి. ముత్యాలు. తెల్లపూసలు. రంగురాళ్లతో పాటు బంగారంలో పొదిగే రాళ్లను సైతం ఇందులో అమర్చారు. ఈ పట్టుచీరకు ఆకర్షణీయమైన రంగురాళ్ళు పొదిగారు. చీర మద్యలో రాగి ఆకు డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముత్యాల్లాంటి తెల్లపూసలను అక్కడక్కడ అమర్చారు. బంగారునగల్లో పొదిగే రాళ్ళను చీరలో అమర్చారు. వెండి పూసలతో డిజైన్ చేసిన రక్షాబంధన్ పట్టుచీరను ఆరుగురు నేత కార్మికులు శ్రమించి మూడురోజుల్లో రూపొందించారు.[6]
శిల్పకళా వైభవ పట్టుచీర సవరించు
దేశ, విదేశాల్లో ఖ్యాతి గాంచిన ధర్మవరం పట్టుచీర ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు’లోకి ఎక్కింది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన డిజైనర్ మోహన్ రూపొందించిన ‘శిల్పకళా వైభవ పట్టుచీర’ ఈ ఘనతను సాధించింది. మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా డ్యాన్సింగ్ లేడీ, ఏనుగులు, చారిత్రాత్మక సంఘటనలను ఈ చీర అంచులో పొందుపరిచారు. డైమండ్స్, జర్కాన్ స్టోన్స్ వినియోగించి వెండితో జరీ అంచు రూపొందించడంతో ఈ పట్టుచీరకు విశేష గుర్తింపు లభించింది.[7]
పద్మవర్షిణి పట్టు చీర సవరించు
ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు పెద్దయ్యగారి మోహన్ చేతుల్లో రూపుదిద్దుకున్న "పద్మవర్షిణి" డిజైనర్ పట్టు చీర, తానూ రంగులు మారుస్తానంటోంది. పట్టు వస్త్రాల తయారీలో చేయి తిరిగిన మోహన్, వాతావరణాన్ని బట్టి రంగులు మారే చీరను నేశారు. ఇందుకోసం 15 మంది కార్మికులతో కలిసి మోహన్ మూడు నెలల పాటు శ్రమించారు. చీర తయారీలో వాడిన 180 గ్రాముల రేషం, వాతావరణాన్ని బట్టి చీర రంగులను మార్చేస్తుంది. ముత్యాలు, 45 రకాల విలువైన రత్నాలను ఈ చీర తయారీకి ఉపయోగించాడు.[8] పట్టుదారంతో పద్మ పుష్పాలను డిజైన్ చేశారు. కొంగులో రత్నాల కూజాభాండం, సప్త పుష్పాల అమర్చారు. చామంతి పుష్పాకారాన్ని మేళవించిన మహిళ హస్తాల అల్లారు. కుచ్చిళ్ళలో ఆరు తులాల మేలిమి ముత్యాలతో మంగళ తోరణాల కూర్చారు. వీటన్నింటి మేళవింపుతో వాతావరణాన్ని బట్టి వర్ణాలు మారే స్వభావం ఈ చీరకి ఉంటుంది. ఈ చీరపై కాంతి అధికంగా పడినప్పుడు ఒక రంగు , తక్కువగా పడినప్పుడు మరో రంగులో మెరుస్తుంది. గులాబీ, నీలి, పచ్చ రంగులను ఈ చీర దాలుస్తుంది.[9]
ధర్మవరంలో అద్భుతమైన చీరలు తయారు చేసే నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. ప్రముఖ చీరల డిజైనర్ మోహన్ తయారు చేసిన లైటింగ్ చీరలు, గంధపు చీరలు, సంగీతపు చీరలు, మయూరి చీరలు, భారతీయ కళలు, నృత్యాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా తయారైన చీరలు ధర్మవరానికే అపూర్వ ఖ్యాతిని చేకూర్చాయి.[10][11]
జాతీయ మెరిట్ సర్టిఫికేటు సవరించు
ధర్మవరం పట్టు చీరకు జాతీయ స్థాయి మెరిట్ సర్టిఫికేట్ దక్కింది. ముఖ్యంగా సంపంగి పట్టు చీరకు ఈ సర్టిఫికేట్ లభించింది. ఈ చీర జాతీయస్థాయిలో ధర్మవరం కీర్తిని ఇనుమడింపజేసినందుకు గాను డెవలప్‌మెంట్ కమీషనర్ ఫర్ హ్యాండ్ లూమ్స్ ఈ సర్టిఫికేటును ప్రధానం చేసింది.[12]
సంక్షోభంలో ధర్మవరం పట్టు పరిశ్రమ సవరించు
అనంతపురం జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది చేనేత రంగంపై ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. గతంలో 1.5 లక్షల మగ్గాలు ఉండగా.. సుమారు 5 లక్షల మంది కార్మికులు పనిచేసే వారు. ముడిసరుకుల ధరలు పెరుగుతుండటంతో కూలి గిట్టుబాటు కాక పెద్దసంఖ్యలో కార్మికులు పరిశ్రమకు దూర మయ్యారు. దీంతో చేతిమగ్గాల సంఖ్య లక్షకుపైగా తగ్గింది.. ఇదే సమయంలో పవర్‌లూమ్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీటిని తట్టుకుని నిలబడటం చేనేత కార్మి కుడికి సాధ్యపడటం లేదు.[13]
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 "Dharmavaram". dharmavaram.org/. Retrieved 26 January 2016.
- ↑ "Dharmavaram Municipality". Municipal Administration & Urban Development Department. Government of Andhra Pradesh. Archived from the original on 29 సెప్టెంబరు 2015. Retrieved 28 September 2015.
- ↑ GI tag for Nagpur orange, Dharmavaram saris
- ↑ "Statewise registration details of G.I.Applications from 15 September 2003" (PDF). Archived from the original (PDF) on 3 ఆగస్టు 2016. Retrieved 26 జనవరి 2016.
- ↑ "చక్రం తిప్పిన హ్యాండ్‌లూమ్". sakshi. 13 August 2015. Retrieved 26 January 2016.[permanent dead link]
- ↑ ధర్మవరం రాఖీ స్పెషల్ శారీ, 28 ఆగష్టు 2015[permanent dead link]
- ↑ ధర్మవరం పట్టు చీర కొత్త రికార్డు 05/11/2012[permanent dead link]
- ↑ రంగులు మార్చే చీర, ధర్మవరం చేనేత కార్మికుని అపురూప ఆవిష్కరణ
- ↑ ధర్మవరం పట్టు.. ‘పద్మ వర్షిణి’ చీర రంగులు మారుస్తుంది 04/9/15 2:01 PM[permanent dead link]
- ↑ ధర్మవరం సాధించిన పట్టు June 24, 2014[permanent dead link]
- ↑ "వాతావరణాన్ని బట్టి రంగులు మార్చే చీర". andhrajyothy. 9 April 2015. Retrieved 24 January 2016.[permanent dead link]
- ↑ "ధర్మవరం పట్టు చీర దక్కిన జాతీయ మెరిట్ సర్టిఫికేట్". telugu.webdunia. 12 October 2011. Retrieved 26 January 2016.
- ↑ మాయమవుతున్న మగ్గం