ధర్మవరం (దుర్గి)

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, దుర్గి మండలంలోని గ్రామం

ధర్మవరం, పల్నాడు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన దుర్గి నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మాచర్ల నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 751 ఇళ్లతో, 2999 జనాభాతో 1086 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1508, ఆడవారి సంఖ్య 1491. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 834 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 20. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589825.[1]

ధర్మవరం (దుర్గి)
పటం
ధర్మవరం (దుర్గి) is located in ఆంధ్రప్రదేశ్
ధర్మవరం (దుర్గి)
ధర్మవరం (దుర్గి)
అక్షాంశ రేఖాంశాలు: 16°26′11″N 79°33′10″E / 16.43639°N 79.55278°E / 16.43639; 79.55278
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
మండలందుర్గి
విస్తీర్ణం
10.86 కి.మీ2 (4.19 చ. మై)
జనాభా
 (2011)
2,999
 • జనసాంద్రత280/కి.మీ2 (720/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,508
 • స్త్రీలు1,491
 • లింగ నిష్పత్తి989
 • నివాసాలు751
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522612
2011 జనగణన కోడ్589825

గ్రామ చరిత్ర

మార్చు

ధర్మవరం గ్రామానికి 3,4 కి.మీ. దూరంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ద్వారకాపురి అను ఒక పట్టణం ఉండేది. 12వ శతాబ్దం చరిత్రకు గూడా అందకుండా ఇది ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ గ్రామ పరిధిలోని పొలాలలో, బుగ్గవాగు సమీపంలో దీని అవశేషాలు కనిపించుచున్నవి.

సమీప గ్రామాలు

మార్చు

పోలపల్లి 5 కి.మీ, దుర్గి 5 కి.మీ, ఆత్మకూరు 5 కి.మీ, కోలగట్ల 7 కి.మీ, నిదానంపాడు 7 కి.మీ.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సమీప బాలబడి మాచర్లలోను, మాధ్యమిక పాఠశాల దుర్గిలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల దుర్గిలోను, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

ధర్మవరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో 2 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ఇద్దరు డిగ్రీ లేని డాక్టర్లు ఉన్నారు.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

ధర్మవరంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది.పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైన సౌకర్యాలు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉన్నాయి.జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి.ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

ధర్మవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 103 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 122 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 861 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 408 హెక్టార్లు
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 453 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

ధర్మవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • బావులు/బోరు బావులు: 453 హెక్టార్లు

తయారీ

మార్చు

ధర్మవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి (అవరోహణ క్రమంలో):

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

ప్రత్తి, మిరప, కంది

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

సాగునీటి చెరువు

మార్చు

ధర్మవరం గ్రామానికి ఆనుకొని సర్వే నం. 297 లో, ఈ చెరువు 122 ఎకరాలలో విస్తరించియున్నది. మండల పరిధిలోని ధర్మవరం, దుర్గి,ఓబులేశునిపల్లె, శ్యామరాజుపురం గ్రామాలతోపాటు పలు గ్రామాలకు చెందిన 500 ఎకరాలకు ఈ చెరువు సాగు నీరందించుచున్నది. పుష్కర కాలం క్రితం వరకు ప్రతి సంవత్సరం ఓబులేశునిపల్లె గ్రమ సమీపంలోని కొండలలో పడిన వర్షపు నీరు కొండవాగు గుండా ప్రవహించి, ఈ చెరువులోనికి చేరుతుంది. [10]

బుగ్గవాగు ఎత్తిపోతల పథకం

మార్చు

బుగ్గవాగు నుండి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తరలించి, ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 3,500 ఎకరాల భూములకు సాగునీరు అందించడానికి రూపొందించిన ఈ పథకానికి, 35 కోట్ల రూపాయలు విడుదలచేయాదానికై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ఆమోదించారు. బుగ్గవాగు నిర్మాణ సమయంలో ధర్మవరం గ్రామ రైతులకు చెందిన 1,5000 ఎకరాల భూములు ముంపునకు గురైనా, ఈ గ్రామస్థులకు చెందిన ఒక ఎకరాకు గూడా నీరందలేదు. ఈ నూతన ఎత్తిపోతల పథకం నీటిని పూర్తిగా మెట్టభూములకే వినియోగించాలి.

గ్రామ పంచాయతీ

మార్చు
  1. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయానికి శాశ్వత భవనం ఉంది.
  2. 2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చిరుమామిళ్ళ మధు సూదనరావు, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉప సర్పంచిగా వీరభద్రయ్య ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ లక్ష్మమ్మ అమ్మవారి ఆలయం

మార్చు

శ్రీ లక్ష్మమ్మ అమ్మవారి ఆలయం ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2017,మార్చి-12వ తేదీ ఆదివారం (ఫాల్గుణ పౌర్ణమి-హోలీ), 13వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆదివారంనాడు అమ్మవారి జలస్నానం, 13వతేదీ సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. సాయంత్రం మేళతాళాలతో గ్రామ ప్రధానవీధులలో, అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించెదరు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు అమ్మవారికి వసంతోత్సవం నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు పల్నాడు నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించెదరు.

శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి ఆలయం

మార్చు

శ్రీ హరిహర బాలనాగేంద్రస్వామి ఆలయాన్ని 24 సంవత్సరాల క్రితం, లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. ప్రతి ఆదివారం ఆలయంలో ప్రత్యేకపూజలకోసం వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించి, కార్తీకమాసంలో వార్షికోత్సవం చేస్తారు. ఈ వేడుకలలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. 2011లో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. రు. 30 లక్షలతో బొడ్రాయి, శ్రీ కోదండరామాలయం, నవగ్రహాలు, ఆంజనేయస్వామి, పోలేరమ్మ, దుర్గమ్మ ఆలయాలు నిర్మించుకున్నారు.

ఈ ఆలయ 24వ వార్షికోత్సవాన్ని, 2014,నవంబరు-9, కార్తీకమాసం, ఆదివారం నాడు, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు, శనివారం నుండియే ఆలయసన్నిధికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్టుకు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు, మద్యాహ్నం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించి, మేళతాళాలతో ఊరేగించారు.

శ్రీ చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం

మార్చు

పల్నాటి పోతన సుబ్రహ్మణ్యం కవి

మార్చు

1802వ సంవత్సరంలో ధర్మవరంలోని ఒక సామాన్య రైతుకుటుంబీకులైన శ్రీ చిరుమామిళ్ళ నరసయ్య, తిరుమలాంబిక దంపతులకు శ్రీ సుబ్రహ్మణ్యం జన్మించారు. భక్తుడిగా కవిగా, వాగ్గేయకారుడిగా ప్రసిద్ధిచెందినారు. భక్తులందరూ ఈయనను పల్నాటి పోతన గా పిలుచుకునేవారు. వీరు వ్రాసిన విలువైన కావ్యాలలో శ్రీకృష్ణ లీలామృతం, గజేంద్ర మోక్షం, రుక్మాంగద చరిత్ర, ఆంజనేయ ప్రబోధం, కందార్ధ దనువులు వంటి ఎన్నో అధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. వీరు 1882 లో పరమపదించారు. శ్రీ చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్యస్వామి (సుబ్బయ్య తాత - సుబ్బారావు - సుబ్బదాసు), ఆలయం, గోపురాన్ని లక్షల రూపాయలతో నిర్మించారు. అప్పటినుండి ఈ గ్రామములో ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలు నిర్వహించుచున్నారు. వీటిని పురస్కరించుకొని మంగళవాయిద్యాలు, నామ సంకీర్తనలు, ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించుచున్నారు. భక్తుల విరాళలతో మాద్యాహ్నం నుండి రాత్రి వరకు ఏకథాటిగా భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించుచున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలకు పలువురు ప్రముఖులను తీసికొని వచ్చి, వారిని సన్మానించుచున్నారు.

  • ఈ ఆలయంలో స్వామివారి 132వ ఆరాధనోత్సవాలు, 2014,జనవరి-24,25 లలో ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక రథంలో ఊరేగించారు.
  • ఈ ఆలయంలో స్వామివారి 134వ ఆరాధనోత్సవాలు, 2016,ఫిబ్రవరి-1 సోమవారం నుండి నిర్వహించెదరు. 2వ తేదీనాడు గురుపూజ, మొక్కుబడుల కార్యక్రమం ఏర్పాటుచేసారు

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

మార్చు

గ్రామ విశేషాలు

మార్చు
  1. ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామంగా ఉన్న ధర్మవరం గ్రామం, పోలీసు అధికారుల ప్రయత్నాలతో గ్రామస్థులు పగలు వీడి, భక్తిమార్గం పట్టినారు. అందరూ కలిసి మెలిసి జీవిస్తూ, అభివృద్ధి బాటలో నడుస్తున్నారు.
  2. 2014,డిసెంబరు-8వ తేదీనాడు, ఈ గ్రామాన్ని నరసరావుపేట లోక్ సభ సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు గారు ఆదర్శగ్రామంగా దత్తత తీసికొన్నారు. ఈ గ్రామాభివృద్ధికి తన సహాయ సహకారాలందించడానికి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (G.A.I.L)ఛైర్మన్ శ్రీ త్రిపాఠీ తన సంసిద్ధతను వ్యక్తం చేసారు.
  3. ఈ గ్రామానికి చెందిన పి,వెంకటేశ్ అను విద్యార్థి, 2016,మేలో ప్రకటించిన 10వతరగతి పరీక్షా ఫలితాలలో 10 జి.పి.యే సాధించాడు. ఇతని తండ్రి శ్రీనివాసరావు ఒక చిరువ్యాపారి. తల్లి సరస్వతి గృహిణి.
  4. ధర్మవరం గ్రామానికి 3,4 కి.మీ. దూరంలో, 100 ఎకరాల విస్తీర్ణంలో, ద్వారకాపురి అను ఒక పట్టణం ఉండేది. 12వ శతాబ్దం చరిత్రకు గూడా అందకుండా ఇది ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ గ్రామ పరిధిలోని పొలాలలో, బుగ్గవాగు సమీపంలో దీని అవశేషాలు కనిపించుచున్నవి.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,790. ఇందులో పురుషుల సంఖ్య 1,405, స్త్రీల సంఖ్య 1,385, గ్రామంలో నివాస గృహాలు 642 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,086 హెక్టారులు.

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".