ధారా రామనాథశాస్త్రి
ధారా రామనాథశాస్త్రి (జూన్ 11, 1932 - ఆగస్టు 7, 2016) నాట్యావధానిగా సుప్రసిద్ధుడు.[2]
ధారా రామనాథశాస్త్రి | |
---|---|
![]() ధారా రామనాథశాస్త్రి | |
జననం | ధారా రామనాథశాస్త్రి 1932 జూన్ 11 [1] |
మరణం | ఆగస్టు 7, 2016 |
ఇతర పేర్లు | ధారా, రామనాథశాస్త్రి |
విద్య | ఎం. ఏ., పి. హెచ్. డీ |
వృత్తి | నాట్యావధాని, ప్రవచన కారుడు |
బిరుదు | నాట్యావధానిగా |
జీవిత భాగస్వామి | సావిత్రి |
తల్లిదండ్రులు |
|
బాల్యం, చదువు సవరించు
ఇతడు సంప్రదాయక వైదిక కుటుంబంలో జన్మించాడు. ఇతడు 1932, జూన్ 11న ఒంగోలులో సత్యవతమ్మ, వెంకటేశ్వరశాస్త్రి దంపతులకు జన్మించాడు[3]. ఇతని తాత ధారా వెంకట సుబ్బయ్య, తండ్రి వెంకటేశ్వరశాస్త్రి ఇరువురూ నాటకాలలో వేషాలు వేసినవారే. చిన్నప్పటి నుండే నాటకాలు, బుర్రకథలు చూసి ప్రభావితుడయ్యాడు. చీరాల, తెనాలిలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. 1947-49 మధ్యకాలంలో గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. తరువాత బి.ఏ. చదివాడు. మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఏ. పూర్తిచేశాడు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కె.వి.ఆర్.నరసింహం పర్యవేక్షణలో తెలుగులో కృష్ణకథ అనే అంశం మీద పరిశోధించి పి.హెచ్.డి సాధించాడు.
మరణం సవరించు
నాట్యావధాన కళాస్రష్ట, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ ధారా రామనాధ శాస్త్రి (85) శనివారం ఆగస్టు 7, 2016 స్థానిక మామిడిపాలెంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. [4][5]
ఉద్యోగం, కుటుంబం సవరించు
1953లో ఒంగోలులోని సి.ఎస్.ఆర్.శర్మ కాలేజీలో అధ్యాపకుడిగా చేరి 1995 జూన్ నెల వరకు పనిచేశాడు. ఈ నాలుగు దశాబ్దాలలో ఎందరో శిష్యులను తయారు చేశాడు. ఇతని భార్య పేరు సావిత్రి. ఇతనికి ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
నాట్యావధానిగా సవరించు
నాట్యావధానము అనే నూతన ప్రక్రియను ఇతడు ప్రారంభించాడు. పృచ్ఛకులు సాంఘిక, చారిత్మిక, ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలలో ఏదైనా ఒక సన్నివేశం చెబితే అప్పటికప్పుడు పది నిమిషాలలో ఆ సన్నివేశానికి తగిన ఆహార్యంతో పాత్రోచితంగా నటించడం ఈ అవధానంలో భాగం. అంటే నాట్యావధాని నటుడు, రచయిత, దర్శకుడు, మేకప్‌మేన్ ఈ నలుగురి పని ఒక్కడే చేయగలగాలి. నటన, సాహిత్య సంపద, ఆశుధోరణి తోపాటు ఆ పాత్రలో పరకాయప్రవేశం చేయగలగాలి. ఈ నాట్యావధానాన్ని మొదట 1953లో ఒంగోలులో ప్రారంభించి సుమారు 500కు పైగా ప్రదర్శనలిచ్చి ఎందరో ప్రముఖులను మెప్పించగలిగాడు. ఈతని నాట్యావధానాన్ని ప్రశంసించిన వారిలో పుట్టపర్తి సత్యసాయిబాబా, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, పండిట్ రవిశంకర్, ఎ.ఎస్.రామన్, హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, పృథ్వీరాజ్ కపూర్, బలరాజ్ సహానీ, భారత రాష్ట్రపతి వి.వి.గిరి, ఎన్.టి.రామారావు మొదలైనవారు అనేకులు ఉన్నారు.
రచయితగా సవరించు
ఇతడు కేవలం నాట్యావధానంతోనే సరిపెట్టకుండా రచనలు కూడా చేశాడు. ఇతని రచనలు:
- విశ్వవీణ (నృత్యనాటిక)
- అస్పృశ్యులు (నృత్యనాటిక)
- రత్నగర్భ (నృత్యనాటిక)
- కోటిదీపాలు (నృత్యనాటిక)
- తపోభంగం (నృత్యనాటిక)
- ముక్తసస్య
- కృష్ణలహరి[6]
- రామలహరి (రెండు భాగాలు)
- కాహళి
- పద్మకోశము
- వరివాస్య
- స్మృతిపీఠం
- తెలుగులో కృష్ణకథ
- భారత కథాలహరి
- ఉదయభాను[7] (బాలసాహిత్యం, కథలసంపుటి)
- పృథ్వీపతి (నాటకం)
- ధర్మత్రివేణి (నాటకం)
- మహాదాత (నాటకం)
- కంచుగోడలు (నాటకం)
- నారాయణం (నాటకం)
- రామగుప్త (నాటకం)
- సంభవామి యుగేయుగే (నాటకం)
- కృష్ణ (నవల)
- కృష్ణమాచార్య కృపానందలహరి
- నాట్యావధాన స్మృతిపీఠం
- నాట్యావధానం లక్ష్య-లక్షణ సమన్వయం
- యోగవాసిష్ట కథాలహరి
- రసలోకంలో తూర్పుపడమరలు
- నాట్యప్రగతి
పురస్కారాలు సవరించు
- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం
- బళ్ళారి రాఘవ అవార్డు
- అనంత లక్ష్మీకాంత సాహితీపురస్కారం
- రామరాజభూషణ సాహిత్యపరిషత్ పురస్కారం
- పల్లె పూర్ణప్రజ్ఞాచార్యుల సాహితీ పురస్కారం
- పెద్దిబొట్ల బ్రహ్మయ్య స్మారక సాహితీ పురస్కారం
- అ.జో.వి.భో. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం
- విజయవాడలో కనకాభిషేకం
- సనాతన ధర్మ ట్రస్ట్ వారి ప్రతిభాపురస్కారం[8]
బిరుదము సవరించు
- నాట్యావధాన విధాత
మూలాలు సవరించు
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 378–383.
- ↑ ఆర్. అనంత, పద్మనాభరావు (5 October 2011). "ధారా రామనాథశాస్త్రితో ఇంటర్వ్యూ (నవ్య నీరాజనం)". నవ్య వీక్లీ: 20. Archived from the original on 5 సెప్టెంబరు 2013. Retrieved 14 January 2015.
- ↑ "| ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- [[నాగభైరవ కోటేశ్వరరావు]] - జూన్ 1971- పుట 113". Archived from the original on 2020-09-25. Retrieved 2015-10-11.
- ↑ హిందూ పత్రికలోని వార్త
- ↑ సాక్షి దిన పత్రికలోని వార్త
- ↑ ధారా, రామనాథశాస్త్రి (1989). కృష్ణలహరి (2 ed.). ఒంగోలు: మధుమతి పబ్లికేషన్స్. Retrieved 14 January 2015.
- ↑ ధారా, రామనాథశాస్త్రి (1985). ఉదయభాను (1 ed.). ఒంగోలు: ఉదయభాను పబ్లికేషన్స్. Retrieved 14 January 2015.
- ↑ STAFF REPORTER (April 1, 2014). "Pratibha Puraskar for Natya Avadhani". The Hindu. Retrieved 14 January 2015.