నలగండ్ల, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.[2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 105వ వార్డు నంబరులో ఉంది.[3] ఇక్కడ న‌‌ల‌‌గండ్ల చెరువు కూడా ఉంది. ఈ ప్రాంతంలో అనేక కంపెనీలు బహుళ అంతుస్థులు (నివాస సముదాయలే కాకుండా వాణిజ్య భవనాలు) నిర్మిస్తున్నారు.[4]

నలగండ్ల
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 019
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటిఎస్ 07
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

జిల్లాల పునర్వ్యవస్థీకరణలోసవరించు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]

సమీప ప్రాంతాలుసవరించు

  • లక్ష్మి విహార్ ఫేజ్ -1
  • డిఫెన్స్ కాలనీ
  • గుల్మోహర్ పార్క్ కాలనీ
  • బాపు నగర్
  • మిగ్ కాలనీ

ప్రజా రవాణాసవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నలగండ్ల నుండి కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, విబిఐటి, రాంనగర్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[6] ఇక్కడికి సమీపంలోని లింగంపల్లి, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలుసవరించు

  • పోచమ్మ దేవాలయం
  • తాపేశ్వరి వింధ్యచల్ దేవి దేవాలయం
  • శివాలయం
  • పెద్దమ్మ దేవాలయం
  • మసీదు ఇ నూర్ (1805)
  • మసీదు ఇ హర్ఖా సలాఫియా

విద్యాసంస్థలుసవరించు

  • నారాయణ జూనియర్ కళాశాల
  • జాగృతి డిగ్రీ, పిజి కళాశాల
  • భెల్ జూనియర్ కళాశాల
  • రావు ఉన్నత పాఠశాల
  • కిడ్జీ నలగండ్ల
  • రావు ఇంటర్నేషనల్ స్కూల్
  • లిటిల్ ఎల్లీ స్కూల్

మూలాలుసవరించు

  1. "Nallagandla, Serilingampally, Hyderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 2021-09-18.
  2. "Find Latitude And Longitude". Find Latitude and Longitude. Retrieved 18 September 2021.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 18 September 2021.
  4. "బహుళ అంతస్థులతో హైదరాబాద్ జిగేలు". Telugu Times USA NRI Telugu News Telugu News Papers In USA (in ఇంగ్లీష్). Retrieved 2021-09-18.
  5. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01.
  6. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నలగండ్ల&oldid=3613835" నుండి వెలికితీశారు