నల్గొండ క్రాస్ రోడ్
నల్గొండ క్రాస్ రోడ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రధాన జంక్షన్.[1] ఇది దిల్‍సుఖ్‍నగర్, సైదాబాద్ ప్రాంతాల మధ్య నిర్మించబడింది.
నల్గొండ క్రాస్ రోడ్ | |
---|---|
పరిసరప్రాంతం | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 036 |
Vehicle registration | టిఎస్-11 |
లోకసభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
సమీప ప్రాంతాలు సవరించు
ఇక్కడికి సమీపంలో చాదర్ ఘాట్, అజంతా కాలనీ, పాల్టన్, తిర్మల ఆర్కేడ్, శ్రీ కృపా మార్కెట్, జమాల్ కాలనీ, మలక్‌పేట మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
ప్రార్థనా స్థలాలు సవరించు
ఇక్కడికి సమీపంలో సాయిబాబా దేవాలయం, రాఘవేంద్ర మఠం, శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ శ్యామ్ బాబా మందిరం, మసీదు-ఎ-అహ్మద్ అలీ ఖాన్, జామా మసీదు బసిటియా, మసీదు హదియా అమ్రీన్ మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.
విద్యాసంస్థలు సవరించు
శ్రీ వాణి మహిళల జూనియర్ డిగ్రీ, పి.జి. కళాశాల, ఆర్.జి కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్, కళాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్, ఆడమ్స్ హైస్కూల్, యూరోకిడ్స్, ద్వారకామయ్య హైస్కూల్, హబీబ్ ముస్తఫా ఎస్/ఓ ఫహీమ్ ఖురేషి, శాంతినికేతన్ కాన్సెప్ట్ స్కూల్ ఉన్నాయి.
రవాణా సవరించు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ క్రాస్ రోడ్ మీదుగా ఎల్.బి.నగర్, సికింద్రాబాద్, ఎన్జీవోస్ కాలనీ, మేడ్చల్, దిల్‍సుఖ్‍నగర్, న్యూ మారుతి నగర్ వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[2] ఇక్కడికి సమీపంలోని మలక్‌పేటలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.
మూలాలు సవరించు
- ↑ "Nalgonda Crossroads Flyover, Jamal Colony, Malakpet Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.