పెనుమాక

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని గ్రామం

పెనుమాక, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన కృష్ణా నదీతీరంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తాడేపల్లి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 6 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2154 ఇళ్లతో, 7918 జనాభాతో 884 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3997, ఆడవారి సంఖ్య 3921. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2283 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 602. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589975[1] ఇది మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలోని గ్రామం.

పెనుమాక
—  రెవిన్యూ గ్రామం  —
పెనుమాక is located in Andhra Pradesh
పెనుమాక
పెనుమాక
అక్షాంశరేఖాంశాలు: 16°28′54″N 80°34′35″E / 16.481724°N 80.576480°E / 16.481724; 80.576480
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తాడేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కళ్ళం పానకాలరెడ్డి
జనాభా (2011)
 - మొత్తం 7,918
 - పురుషుల సంఖ్య 3,997
 - స్త్రీల సంఖ్య 3,921
 - గృహాల సంఖ్య 2,154
పిన్ కోడ్ 522501
ఎస్.టి.డి కోడ్ 08645

పేరు వెనుక చరిత్ర

మార్చు

కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఈ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వాఇవారి ఆలయం వద్ద, ఒక భారీ మర్రివృక్షం ఉండేదట. దీనిని "పెనుమ్రాను" అని పిలిచేవారట. కాల క్రమేణా ఆపేరు మీదుగా గ్రామం ఏర్పడి, ఆ పేరు "పెనుమాక"గా స్థిరపడిందని గ్రామస్తుల కథనం.

సమీప గ్రామాలు

మార్చు

వెంకటపాలెం 3 కి.మీ, నౌలూరు 5 కి.మీ, మందడం 6 కి.మీ, ఐనవోలు 6 కి.మీ, కొలనుకొండ 6 కి.మీ.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,302. ఇందులో పురుషుల సంఖ్య 3,622, స్త్రీల సంఖ్య 3,680, గ్రామంలో నివాస గృహాలు 1,864 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 884 హెక్టారులు.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సమీప బాలబడి తాడేపల్లిలో ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల మంగళగిరిలోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్డేశ్వరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల మంగళగిరిలోను, పాలీటెక్నిక్‌ విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల నంబూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మంగళగిరిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్థులైన కె.వెంకటసాయినాధ్, కె.ప్రత్యూష అను విద్యార్థులు, త్వరలో జరుగబోవు జాతీయస్థాయి థ్రో బాల్ పోటీలలో, అండర్-17 విభాగంలో, మన రాష్ట్రం తరఫున పాల్గొనటానికి ఎంపికైనారు.
  • జూనియర్ కాలేజి:- 1984లో మేకా లక్ష్మీకాంతమ్మ, మల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసారు.
  • తెలుగు, ఇంగ్లీషు మాధ్యములలో బోధించు కొన్ని ప్రెవేటు ప్రాథమిక పాఠశాలలు.
  • ఇవే కాక విజయవాడ, మంగళగిరి పట్టణాలకు సంబంధించిన అనేక పాఠశాలల, కళాశాలల యొక్క బస్సు సౌకర్యము ఉంది.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

పెనుమాకలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

పెనుమాకలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైన సౌకర్యాలు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ గ్రామం విజయవాడ, మంగళగిరి పట్టణాలకు మధ్య సమాన దూరములో ఉంది. విజయవాడ నుండి అమరావతికి వెళ్ళే బస్సులు ఈ గ్రామం మీదుగానే ప్రయాణిస్తాయి. మంగళగిరి నుండి అటో సౌకర్యము ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 19 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

పెనుమాకలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 175 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 203 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 3 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 501 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 9 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూమి: 491 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

పెనుమాకలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • బావులు/బోరు బావులు: 335 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

పెనుమాకలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

అరటి, కూరగాయలు, వరి

మౌలిక సదుపాయాలు

మార్చు

గ్రామంలో వైద్యసౌకర్యాలు

మార్చు
  • ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం.
  • ఆయుర్వేద వైద్యశాల..
  • పశువుల ఆసుపత్రి.
  • బి.సి.బాలుర వసతి గృహం
  • ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
  • చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్.

చిగురు ఆశ్రమం

మార్చు

ఈ ఆశ్రమం పెనుమాక గ్రామ పరిధిలోని అమరావతి కరకట్ట మార్గంలో ఉంది.

చేతనా ఫౌండేషన్ వృద్ధాశ్రమం

మార్చు

పెనుమాక గ్రామంలో చేతనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వృద్ధాశ్రమాన్ని, 2016, మార్చి-3వ తేదీ గురువారంనాడు ప్రారంభించారు.

బాటసారుల విశ్రాంతికోసం ఒక చావడి

మార్చు

ఇతరసౌకర్యాలు

మార్చు

ఈ గ్రామంలో ఒక వడ్ల మిల్లు, ఒక చిన్న వ్యవసాయ మార్కెట్టు, పాలకేంద్రము ఉన్నాయి.

గ్రామ పంచాయతీ

మార్చు
  • సుమారు 8,000 జనాభా కలిగిన ఈ గ్రామం మేజరు పంచాయతీగా కొనసాగుతున్నది.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కళ్ళం పానకాలరెడ్డి సర్పంచిగా ఎన్నికైనాడు. అనంతరం వీరు తాడేపల్లి మండల సర్పంచిల ఫోరం అధ్యక్షుడుగా ఎన్నికైనాడు. అ తరువాత ఇతను గుంటూరు జిల్లా సర్పంచుల సంఘ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనాడు. ఈ గ్రామ పంచాయతీ ఉపసర్పంచిగా జానీఖాన్ ఎన్నికైనాడు.

దర్శనీయప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • ఈ గ్రామంలో అన్ని మతముల ప్రజలు సోదర భావంతో నివసిస్తున్నారు. ఈ గ్రామంలో వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి, దుర్గ, శివాలయ, వేణుగోపాలస్వామి ఆలయం, రెండు రామాలయాలు, బ్రహ్మంగారి గుడి, గంగానమ్మ గుడి, నిర్మాణంలో ఉన్న షిర్డి సాయిబాబా గుడి, మసీదులు, మరికొన్ని చర్చిలు ఉన్నాయి. గురు పూర్ణిమను ఘనంగా నిర్వహిస్తారు.
  • రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కాలంలో ఇక్కడ ఒక శివాలయం నిర్మించారు.
  • శ్రీవైష్ణవ మహా దివ్య క్షేత్రం:- ఈ క్షేత్ర ఆవరణలో, 2014, ఆగస్టు-23, శ్రావణ శనివారం నాడు, శ్రీ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని, శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో, భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామస్థులు, పెద్దయెత్తున తరలి వచ్చారు.
  • మంగళగిరి, విజయవాడ, అమరావతి, ఉండవల్లి గుహలు మొదలగు దర్శించ తగిన ప్రదేశాలు ఈ గ్రామంనకు అతి చేరువలో ఉనాయి.

ప్రధాన వృత్తులు

మార్చు

ఈ గ్రామంలో ఎక్కువ మంది ప్రధాన వృత్తి వ్యవసాయము.

గ్రామ ప్రముఖులు

మార్చు
  • ఈ గ్రామానికి చెందిన మేకా కోటిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధులు. ఇతను 1955 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ (మంగళగిరి) శాసనసభ్యులుగా ఎన్నికైనాడు. వీరి పుట్టిన తేదీ=1903 అక్టోబరు 23.
  • మంగళగిరి శాసనసభ నియోజకవర్గంకు ఎన్నిక కాబడిన నిమ్మగడ్డ రామమోహనరావు, ఈ గ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించాడు.

గ్రామ విశేషాలు

మార్చు
  • ఈ గ్రామంలో దాదాపు అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలకు అవసరమైన భూమిని గ్రామస్తులే విరాళంగా సమకూర్చారు.
  • ఈ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ ఝాన్సీ అను విద్యార్థిని నూజివీడులోని ఐ.ఐ.ఐ.టి.లో మొదటి సంవత్సరం ఇంజనీరింగు చదువుచున్నది. ఈమె ఒక అరుదైన ఘనతను సాధించింది. ఈమె "అంతరిక్షంలో నివాసం" అను అంశంపై అంతర్జాతీయ స్థాయిలో " అమెరికాలోని "నాసా" కేంద్రం వారు, నిర్వహించిన పోటీలకు పరిశోధనా పత్రాలను పంపినది. వీటిని పరిశీలించిన నాసా పరిశోధనా కేంద్రం వారు, ఈమెకు ప్రథమ బహుమతి ప్రకటించారు. ఇంతేగాక, ఈమెను నాసాలో జరుగనున్న సదస్సులో పాల్గొనటానికి ఆహ్వానం పంపినారు. ఈ ఆహ్వానం మేరకు ఈమె 2014, మే- 14 నుండి 18 వరకు నాసాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని, పేపర్ ప్రజెంటేషను ఇచ్చింది. ఆ సదస్సులో ఈమెకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల ఉపన్యాసాలు వినే అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆమెకు ఒక ధ్రువీకరణపత్రం అందజేసినారు. ఈ పర్యటనలో ఐ.ఐ.ఐ.టి.నూజివీడుకు చెందిన 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరు హంటింగ్ టచ్ బీచ్, క్యాలిఫోర్నియా సైన్స్ సెంటరులో ఒక రోబోను తయారుచేసి, ప్రశంసాపత్రాన్ని పొందినది. ఈ కార్యక్రమానికి వీరు ఎన్.ఎస్.ఎఫ్.కు చెందిన శ్రీ రావు చలసాని సహకారం పొందారు. ఈమె తండ్రి వెంకటేశ్వరరావు, స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
  • పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల మధ్య, ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో, పది అడుగుల ఎత్తయిన పీఠంపై, 33 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేశారు. ద్రావిడ వేదపాఠశాల, 108 దివ్యదేశాలకు చెందిన పెరుమాళ్ళ విగ్రహాల ప్రతిష్ఠ, ఇక్కడ జరుపనున్నారు. గోశాల, వృద్ధాశ్రమం, నిత్యాన్నదాన భవనం, శ్రీనివాస, శ్రీరంగపరమపదనాధుల మందిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిలో దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుచున్నారు.

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=పెనుమాక&oldid=4285637" నుండి వెలికితీశారు