నాగభైరవ కోటేశ్వరరావు

నాగభైరవ కోటేశ్వరరావు (ఆగష్టు 15, 1931 - జూన్ 14, 2008) ప్రముఖ కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు.

నాగభైరవ కోటేశ్వరరావు
జననంనాగభైరవ కోటేశ్వరరావు
ఆగష్టు 15, 1931[1]
రావినూతల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణంజూన్ 14, 2008
హైదరాబాదు, తెలంగాణ
మరణ కారణంకాన్సర్ వ్యాధి
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
వృత్తికవి
,సాహితీవేత్త &
మాటల రచయిత

జీవితం

మార్చు

నాగభైరవ కోటేశ్వరరావు ఆగష్టు 15, 1931[1] వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రావినూతల హైస్కూలులో సెకండరీ గ్రేడ్ టీచరుగా తమ ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. తరువాత స్వయంకృషితో పై చదువులు చదివి స్నాతకోత్తర పట్టాను పొందారు. 3 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు.కొంత కాలం అస్వస్థతతో బాధపడిన నాగభైరవ కోటేశ్వరరరావు 2008, జూన్ 14న మరణించారు

కవిగా, సాహితీవేత్తగా ప్రస్తానం

మార్చు

నాగభైరవ కోటేశ్వరరావు పెక్కు రచనలు చేశారు. రెండు పుస్తకాలు కాలేజీ స్థాయిలో పాఠ్యపుస్తకాలుగా ఉంచబడ్డాయి.

1988-1992 మధ్యకాలంలో సాహిత్య అకాడమీకి తెలుగు నిపుణునిగా ఉన్నారు. నాగభైరవ కోటేశ్వరరావు సాహితీ వ్యాసంగానికి గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం లభించాయి.

నాగభైరవ రచనలలో ఐదు సంప్రదాయ ఛందోబద్ధమైన కావ్యాలు. కాని స్వేచ్ఛా కవిత్వంలోనూ రచనలు చేశారు. నవలలు, నాటకాలు కూడా రచించారు. నాగభైరవ రచనలలో సమాజ శ్రేయస్సు, విశ్వ ప్రేమ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. అట్టడుగు వర్గాల వ్యధల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తుంది.

రచనలు

మార్చు
 • రంగాజమ్మ (1963)
 • కవన విజయం : భువన విజయంకు పేరడీగా, 20వ శతాబ్దపు తెలుగు కవితా ధోరణులను సమర్పించే ప్రదర్శనా కావ్య నాటకం. ఇది 300 పైగా ప్రదర్శనలలో చూపబడింది.
 • గుండ్లకమ్మ చెప్పిన కథ (1985)
 • తూర్పు వాకిళ్ళు (1982)
 • ఒయాసిస్ (1969)
 • కన్నీటి గాథ (1969) : 1969లో తీరాంధ్రంలో సంభవించిన పెనుతుఫాను కలిగించిన విషాదం గురించి.
 • వెలుతురు స్నానం (1980)
 • పతాక శీర్షిక (1991)
 • నా ఉదయం (1984)
 • సంతకం
 • మానవతా సంగీతం (1972)
 • కన్నెగంటి హనుమంతు (1992)
 • దానవీర
 • మరో అమ్మాయి కథ

సినిమా రంగంలో

మార్చు

నాగభైరవ కోటేశ్వరరావు నందమూరి తారక రామారావుకు సన్నిహితులు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు డైలాగులు రచించారు. గడుసు అమ్మాయి, దేవతలారా దీవించండి, సింహగర్జన, ముద్దు ముచ్చట, వసంతం వచ్చింది, పూలపల్లకి మొదలైన చిత్రాలలో పాటలు వ్రాశారు. భార్గవ్ చిత్రానికి సంభాషణలు అందించారు.

విశేషాలు

మార్చు

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 ఈనాడు దిన పత్రికలో నాగభైరవ కోటేశ్వరరావు పై వ్యాసం. జూన్ 17,2008న సేకరించబడినది.

వనరులు, బయటి లింకులు

మార్చు