నాగాలాండ్ క్రికెట్ జట్టు

నాగాలాండ్ క్రికెట్ జట్టు భారత దేశీయ పోటీలలో నాగాలాండ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు. 2018 జూలైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీతో సహా 2018–19 సీజన్ కోసం దేశీయ టోర్నమెంట్‌లలో పాల్గొనే తొమ్మిది కొత్త జట్లలో ఒకటిగా ఈ జట్టును ప్రకటించింది. [1] [2] [3] అయితే, రంజీ ట్రోఫీలో ఈ జట్టును చేర్చే నిర్ణయంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అభ్యంతరం చెబుతూ, అలా చేయాలంటే, అవసరమైన అర్హత ప్రమాణాలు ఉండాలని పేర్కొంది. [4] 2018–19 సీజన్‌కు ముందు, కన్వల్‌జిత్ సింగ్‌ను జట్టు కోచ్‌గా నియమించారు. [5]

నాగాలాండ్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్రోంగ్సెన్ జోనాథన్
కోచ్కన్వల్‌జిత్ సింగ్
యజమానినాగాలాండ్ క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం2018
స్వంత మైదానంనాగాలాండ్ క్రికెట్ అసోసియేషంస్టేడియం
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్nagalandcricket.com

2018 సెప్టెంబరులో వారు 2018 - 19 విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయారు.[6][7] విజయ్ హజారే ట్రోఫీలో మొదటి సీజన్లో ప్లేట్ గ్రూప్లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, మూడు ఓటములతో నాల్గవ స్థానంలో నిలిచారు.[8] కెబి పవన్ 432 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా, ఇమ్లివతి లెమ్టూర్ పది వికెట్లతో జట్టుకు ప్రధాన వికెట్ సాధకుడిగా నిలిచాడు.[9]

2018 నవంబరులో, 2018-19 రంజీ ట్రోఫీలో తమ ప్రారంభ మ్యాచ్‌లో నాగాలాండ్, మిజోరంను ఇన్నింగ్స్ 333 పరుగులతో ఓడించింది. [10] [11] రంజీ ట్రోఫీలో మొదటిసారి ఆడిన జట్టుకు ఇది అతిపెద్ద గెలుపు. [12] తమ ఎనిమిది మ్యాచ్‌లలో రెండు విజయాలతో ఆ సంవత్సరపు టోర్నమెంటు పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. [13]

2019 మార్చిలో నాగాలాండ్, 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గ్రూప్ A లో తమ ఆరు మ్యాచ్‌లలో విజయాలేమీ సాధించకుండా చివరి స్థానంలో నిలిచింది.[14] టోర్నమెంట్‌లో రోంగ్‌సెన్ జోనాథన్ 121 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. పవన్ సుయాల్ మూడు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[15]

2019 జూలైలో, 2019–20 క్రికెట్ సీజన్‌కు ముందు, నాగాలాండ్ క్రికెట్ అసోసియేషన్ (NCA) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శనలు కనబరిచిన తర్వాత ముగ్గురు అవుట్‌స్టేషన్ ఆటగాళ్లు, పవన్ సుయాల్, KB పవన్, అబ్రార్ కాజీలను జట్టు నుండి విడుదల చేసింది.[16]

స్క్వాడ్

మార్చు
పేరు పుట్టినరోజు బ్యాఅటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
బ్యాటర్లు
రాంగ్‌సెన్ జోనాథన్ (1986-10-04) 1986 అక్టోబరు 4 (వయసు 38) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ కెప్టెన్
హోకైటో జిమోమి (1986-09-24) 1986 సెప్టెంబరు 24 (వయసు 38) కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం
జాషువా ఒజుకుమ్ (2000-04-04) 2000 ఏప్రిల్ 4 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
సెడెజాలీ రూపేరో (1997-11-15) 1997 నవంబరు 15 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
యుగంధర్ సింగ్ (2005-10-21) 2005 అక్టోబరు 21 (వయసు 19) కుడిచేతి వాటం
హేమ్ చెత్రి (2000-09-23) 2000 సెప్టెంబరు 23 (వయసు 24) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
జాంటుంగ్ మొజూయి (1995-12-12) 1995 డిసెంబరు 12 (వయసు 28) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
రెంజమో మొజుయ్ (1996-12-29) 1996 డిసెంబరు 29 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
ఆల్ రౌండర్లు
శ్రీకాంత్ ముండే (1988-10-27) 1988 అక్టోబరు 27 (వయసు 36) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
అకావి యెప్తో (1997-09-02) 1997 సెప్టెంబరు 2 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
ముంగ్ఖం ఫోమ్ (1998-02-10) 1998 ఫిబ్రవరి 10 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
ముఘవి వోత్సా (1992-01-06) 1992 జనవరి 6 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
వికెట్ కీపర్లు
చేతన్ బిష్త్ (1989-09-03) 1989 సెప్టెంబరు 3 (వయసు 35) కుడిచేతి వాటం
టెంజెన్టోషి జమీర్ (1985-02-12) 1985 ఫిబ్రవరి 12 (వయసు 39) కుడిచేతి వాటం
స్పిన్ బౌలర్లు
ఇమ్లివతి లెమటూర్ (1991-12-25) 1991 డిసెంబరు 25 (వయసు 32) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
తహ్మీద్ రెహమాన్ (1998-09-26) 1998 సెప్టెంబరు 26 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
క్రివిట్సో కెన్స్ (2004-03-06) 2004 మార్చి 6 (వయసు 20) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
ఫాస్ట్ బౌలర్లు
నగాహో చిషి (1997-11-12) 1997 నవంబరు 12 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
ఆకాష్ సింగ్ (2002-04-26) 2002 ఏప్రిల్ 26 (వయసు 22) కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడతాడు
Chopise Hopongkyu (2000-12-20) 2000 డిసెంబరు 20 (వయసు 23) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
మెరెంకా జమీర్ (1998-05-10) 1998 మే 10 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం

2023 జనవరి 24 నాటికి నవీకరించబడింది

మూలాలు

మార్చు
  1. "Nine new teams in Ranji Trophy 2018–19". ESPN Cricinfo. Retrieved 18 July 2018.
  2. "Logistical nightmare on cards as BCCI announces 37-team Ranji Trophy for 2018–19 season". Indian Express. Retrieved 18 July 2018.
  3. "BCCI to host over 2000 matches in the upcoming 2018–19 domestic season". BCCI. Archived from the original on 19 జూలై 2018. Retrieved 19 June 2018.
  4. "Telangana Cricket Association questions BCCI over inclusion of teams from North East in Ranji Trophy". First Post. Retrieved 10 August 2018.
  5. "BCCI eases entry for new domestic teams as logistical challenges emerge". ESPN Cricinfo. Retrieved 31 August 2018.
  6. "Vijay Hazare Trophy: Bihar make winning return to domestic cricket". Times of India. Retrieved 19 September 2018.
  7. "Plate, Vijay Hazare Trophy at Anand, Sep 19 2018". ESPN Cricinfo. Retrieved 19 September 2018.
  8. "2018–19 Vijay Hazare Trophy Table". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
  9. "Vijay Hazare Trophy, 2018/19 – Nagaland: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
  10. "Ranji Trophy Takeaways: Unadkat Picks Seven; Mumbai in Command Against Railways". Network18 Media and Investments Ltd. Retrieved 3 November 2018.
  11. "Ranji Trophy: Sikkim record innings victory over Manipur". The Indian Express. Retrieved 3 November 2018.
  12. "Ranji Trophy Digest: Mixed Bag For India Stars, New States Take Baby Steps". Network18 Media and Investments Ltd. Retrieved 5 November 2018.
  13. "Ranji Trophy Table – 2018–19". ESPN Cricinfo. Retrieved 10 January 2019.
  14. "Syed Mushtaq Ali Trophy 2019: Points Table". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
  15. "Syed Mushtaq Ali Trophy, 2018/19 – Nagaland: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
  16. "Nagaland set to hire fresh guest players". Sport Star. Retrieved 4 July 2019.