నాచారం, హైదరాబాదు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.

నాచారం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలోని వార్డు నెంబరు 6లో ఉంది.[1]

నాచారం
సమీపప్రాంతం
నాచారం is located in Telangana
నాచారం
నాచారం
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
నాచారం is located in India
నాచారం
నాచారం
నాచారం (India)
Coordinates: 17°49′N 78°32′E / 17.817°N 78.533°E / 17.817; 78.533
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 076
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఉప్పల్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

నాచారం లోని ప్రాంతాలు

మార్చు

నాచారం ప్రాంతంలో బాపూజీ నగర్, హెచ్‌ఎమ్‌టి నగర్, బాబానగర్, అన్నపూర్ణ కాలనీ, స్నేహపురి కాలనీ, రాఘవేంద్ర నగర్, కార్తికేయ నగర్, దుర్గా నగర్, న్యూ రాఘవేంద్ర నగర్, పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతం, శ్రీ సాయి నగర్, హేమానగర్ మొదలైనవి ఉన్నాయి.[2]

ఆర్థిక వ్యవస్థ

మార్చు

నాచారంలో షూ కర్మాగారాలు ఎక్కువగా ఉండడంతోపాటు నాచారం మెయిన్ రోడ్ వెంబడి అనేక షూ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో ఫాబ్రికేషన్, దుస్తుల ఎగుమతులు, టైర్లు, రబ్బరు పదార్థాలు, ఫర్నిచర్‌లకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి.

ప్రార్థన స్థలాలు

మార్చు

ఈ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయం, మహాంకాళీ దేవాలయం ఉన్నాయి. హెచ్‌ఎంటి నగర్‌లో మసీదు-ఎ-బిలాల్ అనే మసీదు ఉంది. ఇక్కడికి చాలామంది ముస్లింలు తరచుగా వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇటీవల అనేక చర్చిలు కూడా వచ్చాయి.[2]

రవాణా

మార్చు

రైలుమార్గం

మార్చు

ఇక్కడికి సమీపంలో మౌలాలీ రైల్వే స్టేషను, చర్లపల్లిస్టేషను, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను ఉన్నాయి. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ఇక్కడి నుండి 8.5 కి.మీ.ల దూరంలో ఉంది. సీతాఫల్‌మండి రైల్వే స్టేషనులో హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ స్టేషను ఉంది.[2]

రోడ్డుమార్గం

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నాచారం నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు (3హెచ్ఎస్, 3ఎన్, 3కెఎన్, 6హెచ్, 250, 49ఎం/250, 250సి, 250ఎస్, 17హెచ్ఎన్) బస్సు సౌకర్యం ఉంది. ఈ ప్రాంతంలో నాచారం బస్ స్టేషను, నాచరం ఇండస్ట్రియల్ ఏరియా బస్ స్టేషను, హెచ్ఎంటి నగర్ బస్ స్టేషనులు ఉన్నాయి.[2]

మెట్రోమార్గం

మార్చు

ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హబ్సిగూడలో హైదరాబాద్ మెట్రో రైలు 3వ కారిడార్ లోని హబ్సిగూడ మెట్రో స్టేషను ఉంది.

స్టేట్ ఫుడ్ లాబోరేటరీ

మార్చు

ఈ ప్రాంతంలో స్టేట్ ఫుడ్ లాబోరేటరీ ఉంది. ఈ లాబోరేటరీలో బెవరేజేస్, మిల్క్, చిరు ధాన్యాల ఉత్పత్తులు, నూనెలు, మసాల దినుసులు, స్వీట్స్, రెడీ మేడ్ ఫుడ్, ఇతర విభాగాల ల్యాబ్‌లు ఉన్నాయి. కల్తీ జరిగే తీరును పర్యవేక్షించి, పరీక్షల ద్వారా కల్తీ ఫుడ్ ను కనుగొంటారు. ఇక్కడ 2022, ఫిబ్రవరి 11న రూ. 2.4 కోట్ల విలువ చేసే 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ బస్సులు, రూ. 10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో అప్ గ్రేడ్ చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హ‌రీశ్‌రావు ప్రారంభించాడు. ఈ కార్యక్ర‌మంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఐపీఎం డైరెక్టర్ శంకర్, స్థానిక కార్పోరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.[3]

విద్యాసంస్థలు

మార్చు

నాచారంలో విద్యార్థులకు అందుబాటులో ప్రముఖ  పాఠశాలలు ఉన్నాయి, ప్రముఖంగా ఇక్కడ, సెయింట్.పీటర్స్ మోడల్ స్కూల్, జాన్సన్ గ్రమ్మెర్ స్కూల్[4], కమల మెమోరియల్ హైస్కూల్, నోబెల్ పబ్లిక్ స్కూల్[5] ఉన్నాయి.

అభివృద్ధి పనులు

మార్చు

నాచారం హెచ్ఎంటీ పెద్ద చెరువు వద్ద రూ.411 కోట్లతో నిర్మిస్తున్న ఎస్‌టీపీ పనులకు 2022 మార్చి 11న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఇత ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6][7][8]

మూలాలు

మార్చు
  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 June 2019. Retrieved 2021-01-23.
  2. 2.0 2.1 2.2 2.3 "Nacharam , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-23.
  3. telugu, NT News. "4 మొబైల్ ఫుడ్‌ టెస్టింగ్ బ‌స్సులు ప్రారంభం.. క‌ల్తీ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లే." NTnews. Archived from the original on 2022-02-11. Retrieved 2022-02-11.
  4. "Johnson Grammar School 559th best school in India-H. No.- 16/a Mallapur Road Hyderabad Rangareddy-500 076". bestschool.net.in. Retrieved 2022-11-21.
  5. noble. "Noble School". www.nobleschool.in. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.
  6. telugu, NT News (2022-03-11). "వ‌చ్చే నెల నుంచి కొత్త పెన్ష‌న్లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-11.
  7. telugu, 10tv (2022-03-11). "KTR: ఉప్పల్‌లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన | Uppal Development programs started by Minister KTR". 10TV (in telugu). Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  8. Web, Disha (2022-03-11). "ఉప్పల్‌లో కేటీఆర్ కీలక ప్రకటన.. వారందరికి గుడ్ న్యూస్." dishadaily.com. Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-11.

వెలుపలి లంకెలు

మార్చు