హబ్సిగూడ
హబ్సిగూడ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.
హబ్సిగూడ | |
---|---|
పరిసరప్రాంతం | |
Coordinates: 17°25′09″N 78°32′29″E / 17.41917°N 78.54139°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
తూర్పు | తూర్పు |
సర్కిల్ | ఉప్పల్ కలాన్ |
వార్డు | 6 |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
జనాభా (2012)[1] | |
• Total | 36,206 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500 036 |
టెలిఫోన్ కోడ్ | +9140 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
చరిత్ర
మార్చుఈ ప్రాంతం ఒకప్పుడు నిజాం రాజు యొక్క పశువుల మైదానంగా ఉండేది. అంతేకాకుండా నిజాం సైన్యంలోని ఆఫ్రికన్ దళాలకు నివాసంగా కూడా ఉంది. ఆఫ్రికాలోని ఇథియోపియాకు పురాతన పేరైన అబిస్సినియా (హబ్బీ) అనే పదం హబ్సిగూడ పేరు మూలపదంగా చరిత్రకారుల అభిప్రాయం.
నిజాంలు అబిస్సినియన్లు బానిసలుగా తీసుకువెళ్ళి, వారిని పశువులకు కాపరిలుగా పనిచేయిస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో హబీయిస్ (అబిస్సినియా ప్రజలు) నివసిస్తుండడంవల్ల దీనిని "హబీస్‌గూడా"గా పిలిచేవారు. కాలక్రమేణా హబీస్‌గూడ హబ్సిగూడగా పిలవబడుతుంది.
ఇతర వివరాలు
మార్చుకొంతకాలం తరువాత హబ్సిగూడ కబ్జాలకు గురైంది. హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయము నిర్మించేందుకు పరిసర జిల్లాల నుండి వచ్చిన తోటల పెంపకందారులు ఈ ప్రాంతంలో ఉండేవారు.
1981 వరకు నాచారం పరిధిలో ఒక చిన్న గ్రామంగా ఉన్న హబ్సిగూడ, ఉప్పల్ కలాన్ మున్సిపాలిటీలో స్వతంత్రమైన గ్రామపంచాయతిగా మారి, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరంలో ఒక భాగంగా ఉంది.
పరిశోధన సంస్థలు
మార్చు- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
- జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ[2]
- సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ - రిసోర్స్ సెంటర్
- ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్
రవాణా
మార్చుహబ్సిగూడ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది. ఇక్కడ హబ్సిగూడ మెట్రో స్టేషను కూడా ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Election Wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 10 నవంబరు 2011. Retrieved 12 జూలై 2018.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (22 March 2017). "ఎన్జీఆర్‌ఐ యువశాస్త్రవేత్తలకు ముగిసిన శిక్షణ". Retrieved 13 July 2018.
వెలుపలి లంకెలు
మార్చు