నా దేశం

(నాదేశం నుండి దారిమార్పు చెందింది)

నా దేశం 1982 లో వచ్చిన సినిమా. పల్లవి దేవి ప్రొడక్షన్స్ పతాకంపై కె. దేవీవర ప్రసాద్, ఎస్. వెంకటరత్నం నిర్మించారు. కె. బాపయ్య దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం హిందీ చిత్రం లావారిస్ (1981) కు రీమేక్.[1][2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టైంది.

నా దేశం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
నిర్మాణం యస్.వెంకటరత్నం,
కె.దేవీ వరప్రసాద్
తారాగణం నందమూరి తారక రామారావు,
జయసుధ ,
జమున
సంగీతం కె. చక్రవర్తి
ఛాయాగ్రహణం ఎస్.వెంకటరత్నం
నిర్మాణ సంస్థ శ్రీ లలితా మూవీస్
భాష తెలుగు

తాగుబోతు కైలాసం ( ప్రభాకర్ రెడ్డి ) సంరక్షణలో ఉన్న భరత్ అనే అనాథ తన చిన్న వయస్సులోనే జీవితంతో కుస్తీ పడుతూంటాడు. చాలా సంవత్సరాల తరువాత, ఇప్పుడు ఒక యువకుడుగా భరత్ ( ఎన్టీఆర్ ), ప్రతాపరావు ( సత్యనారాయణ ) వద్ద పనిచేస్తూంటాడు. మోహిని ( జయసుధ ) తో ప్రేమలో ఉన్నాడు. భరత్ తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవటానికి నిశ్చయించుకుంటాడు. అతనికి సహాయం చేయగల ఏకైక వ్యక్తి అంతుచిక్కని, తాగుబోతు కైలాసం.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "నెనొక నెత్తురు దీపం" ఎస్పీ బాలు 4:15
2 "చలపాలిలో" ఎస్పీ బాలు, పి.సుశీల 4:47
3 "ఈ చెంపా" ఎస్పీ బాలు, పి.సుశీల 4:21
4 "ప్రేమకు పేరంటము" ఎస్పీ బాలు, పి.సుశీల 4:31
5 "రోజులన్నీ మారే" ఎస్పీ బాలు 4:02
6 "ఉవ్నాడురా దేవుడు" నందమూరి రాజా 4:24

మూలాలు

మార్చు
  1. "30 years of Naa Desam". Archived from the original on 2013-05-05. Retrieved 2020-08-30.
  2. 'Naadesam' for Ntr, 'Ruler for Balayya?
"https://te.wikipedia.org/w/index.php?title=నా_దేశం&oldid=4208147" నుండి వెలికితీశారు