నారాయణపురం (బలిజిపేట మండలం)

ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా, బలిజిపేట మండల గ్రామం

నారాయణపురం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లా, బలిజిపేట మండలానికి చెందిన గ్రామం.[1] ఇది మండల కేంద్రమైన బలిజిపేట నుండి 5 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన బొబ్బిలి నుండి 30 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1132 ఇళ్లతో, 4490 జనాభాతో 2409 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2268, ఆడవారి సంఖ్య 2222. షెడ్యూల్డ్ కులాల జనాభా 520 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 254. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 582283[2].పిన్ కోడ్: 535557.

నారాయణపురం
—  రెవిన్యూ గ్రామం  —
నారాయణపురం is located in Andhra Pradesh
నారాయణపురం
నారాయణపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°39′04″N 83°31′44″E / 18.6512°N 83.5289°E / 18.6512; 83.5289
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా మన్యం
మండలం బలిజిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,490
 - పురుషులు 2,268
 - స్త్రీలు 2,222
 - గృహాల సంఖ్య 1,132
పిన్ కోడ్ 535 557
ఎస్.టి.డి కోడ్

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు బలిజిపేటలో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల బలిజిపేటలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు బొబ్బిలిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నెల్లిమర్లలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బొబ్బిలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వెంగాపురంలోను, అనియత విద్యా కేంద్రం బలిజిపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయనగరం లోనూ ఉన్నాయి.

నీలకంఠేశ్వరాలయము మార్చు

నారాయణపురం గ్రామానికి 4 కి.మీ దూరంలో సువర్ణముఖి నది ఒడ్డున అత్యంత సుందరమైన, చారిత్రాత్మకమైన ఈ నీలకంఠేశ్వరాలయం ఉంది. ఈ ఆలయమున గల శాసనములలో ప్రస్తుత నారాయణపురం 'నిడుంజెరు' వనియు, 'నావపల్లి' అనియు పేర్కొనబడింది. నిడుంజెరువు లేక నావపల్లే క్రమేణ నారాయణపురముగా మారినది. ప్రస్తుతము నీలకంఠేశ్వరుడని పిలవబడ్తున్న దైవము శాసనములందు నీలేశ్వరుడని, నీలీశ్వరుడని పేర్కొనబడినాడు.కళింగ గాంగ రాజైన నాల్గవ నరసింహదేవుని కాలము (సా.శ. 1378-1424) నుండి గ్రామము నారాయణపురమని పిలువబడినట్లు తెలియుచున్నది. సా.శ. 6వ శతాబ్దములో తూర్పు గాంగ వంశరాజులు ముఖలింగమును రాజధానిగా చేసుకొని అవిచ్ఛన్నంగా 12వ శతాబ్దము వరకు పరిపాలించిరి. త్రికళింగాధిపతులైన గాంగరాజులు రాజ్య పరిపాలనతో పాటు చక్కని ఆలయములను నిర్మించి వారి కళాపోషణను నిరూపించుకున్నారు. ఒరిస్సా శిల పద్ధతి ప్రకారం నిర్మించిన నారాయణపుర నీలీశ్వరాలయమును భువనేశ్వరులో ఉన్న పరశురామేశ్వరాలయమును పోలియున్నది. ఇక్కడ అఖండ దీపమును కొనసాగించుటకొరకు అనేక శాసనములు,దానములు దాతలు చేసారు.

ఆలయ నిర్మాణం మార్చు

ఈఆలయము నాలుగు ఆలయముల సముదాయము.వీటిలో ప్రధానమైనది నీలీశ్వరాలయము. ప్రక్కన మరి మూడు ఆలయములు శిథిలావస్థలో ఉన్నాయి.వాటిలో ఒకటి ప్రధానాలయమైన నీలీశ్వరాలయమునకు ప్రతిరూపమై యుండగా రెండు ఆలయముల నిర్మాణాకృతి గోపురముల వరకే నిలిచియున్నది.తూర్పు ముఖముగా ఉన్న నీలీశ్వరాలయమునకు ముందు ఒక నందీశ్వర విగ్రహము ఉంది. ఆలయమునకు తూర్పు, దక్షిణ దిశలందు ద్వారములు ఉన్నాయి.ఉత్తర దిశయందు ద్వారస్థానమందు ఒక చట్రమువలె ఉన్న కిటికీ ఉంది.గర్భాలయము ఆనుకొని మండపము ఉంది.ప్రధాన గోపురమునకు నాల్గువైపులా గోపురాకృతులు ఉండి, వానిపై ఒక్కొక్క యోగి విగ్రహము మలచ బడింది.చతురస్రాకరములో ఉన్న ముఖమండపములో ఎత్తయిన రాతి స్తంభములు వరుసకు నాలుగేసి చొప్పున రెండు వరుసలలో రెండు వైపులా అమర్చబడినవి.చూరుల యందు పురాణేతిహాస గాథలైన సముద్ర మథనము, శ్రీరామ కథా చరిత్రములు అతి సహజముగా జీవకళ ఒప్పారొతూ చిత్రించబడినవి.దక్షిణ, పశ్చిమోత్తర గోడలయందున్న గూడులలో కల అర్ధనారీశ్వర శిల్పము యొక్క అలంకారములలో, ముఖలావణ్యములోనూ, దృష్టులలోనూ, ఏకముఖమున స్త్రీ పురుష స్వరూపముల సమ్మేళమును చూపులలోనూ శిల్పి తన చాతుర్యమును అత్యంత రమణీయముగా వ్యక్తీకరించెను.మరియు మహేశ్వరుని అవతారమైన భిక్షాటణమూర్తి, హరిహరమూర్తి, కుమారస్వామి, గణపతి, నటరాజు, ఆలింగనమూర్తి, మహిషాశురమర్ధిని, శిఖరంపై నున్న యోగుల నిగ్రహములు-నీలీశ్వరాలయము శిల్ప సంపద విశిష్టతను తెలియజేస్తున్నవి. ఇచ్చట ప్రధాన దైవము లింగాకారముతో పూజించబడిన నీలకంఠేశ్వరుడని పిలువబడుచున్నాడు.

శాసనములు మార్చు

నీలీశ్వరాలయ మండప స్తంభాలపై సుమారు 53 శిలా శాసనములు చెక్కబడి యున్నవి.ఇవి తెలుగు లిపిలో వ్రాయబడినవి. ఈశాసన పాఠములన్నియు దక్షిణ హిందూ దేశ శాసన సంపుటిలో ప్రచురించబడినవి.శాసనము లన్నియు దాన శాసనములే. ఈ దానములు ఎక్కువ సంఖ్యలో రాణులచే, రాజోద్యోగులచే ఆలయ అఖండ దీపము నడుపుటకై ఈయబడినవి. అఖండ దీపము నిలుపుట ఒక పుణ్యముగా భావించి అందు నిముత్తమై భక్తులు భూమిని, పశువులను, ధనమును సమర్పించుచుండేవారు.ఈ ఆఅలయము మొట్టమొదట శకవరుషంబులు 1024 (సా.శ.1102)లో నీలీశ్వర దేవరునకు అఖండదీపనిమిత్తమై బేతరాజు సమర్పించెను.చివరి శాసనము శకవరుషంబులు 1173 ( సా.శ.1251)లో ఈయబడింది.ఇందు మూలముగా మొదటి చివర శాసనముల మధ్యకాలమైన సుమారు రెండు శతాబ్దములనాటి నారాయణపుర నీలీశ్వరాలయ చరిత్ర.

ఈ దేవాలయంలో ప్రతీ కార్తీక మాసం చివరి సోమవారం రోజున మజ్జి శ్రీనివాసరావు, కండాపు అజయ్ కుమార్, అలుబిల్లి నారాయణరావు, మండల భానుప్రకాస్, పంటల వెంకటరమణ, మామిడి శ్రీనివాసరావు, ల ఆధ్వర్యంలో 5 వేలమంది భక్తులకు అన్నసంతర్పణ జరుగు చున్నది.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

నారాయణపురం (బలిజిపేట మండలం)లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. పారామెడికల్ సిబ్బంది ఇద్దరు ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

నారాయణపురం (బలిజిపేట మండలం)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 189 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 34 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 369 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 609 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 448 హెక్టార్లు
 • బంజరు భూమి: 113 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 643 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 595 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 609 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

నారాయణపురం (బలిజిపేట మండలం)లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 505 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 65 హెక్టార్లు* చెరువులు: 38 హెక్టార్లు

గ్రామ చరిత్ర మార్చు

ఈ ఊరిపేరు నారాయణ + పురం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. పూర్వపదం నారాయణ అనగా హిందువుల దైవం నారాయణుడుకు సంస్కృత మూలం. దీనికి సముద్రం లేక జనసమూహం స్థానముగా గలవాడు అని అర్ధం. పురము అనే నామవాచకానికి నిఘంటువు ప్రకారం పట్టణం.[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు మార్చు

నారాయణపురంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి

ఖరీఫ్ పంట కాలం : జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరు శనగ. రబీ పంటకాలం : అక్టోబరు నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు - గోధుమ, బార్లీ, మినుములు, ప్రొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి. జైద్ పంటకాలం : మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు - పుచ్చకాయలు, దోస కాయలు, కూరగాయలు, మొదలైనవి.

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులను వృత్తులు అంటారు. ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

 • కంసాల కంసాలి
 • కమ్మర కమ్మరి
 • పరిశ్రమ పారిశ్రామికుడు
 • కుమ్మర కుమ్మరి
 • చర్మకార చర్మకారుడు
 • చాకల చాకలి
 • చేనేత నేతకారుడు
 • దర్జీ దర్జీ (టైలర్)
 • పౌరోహిత్యం పురోహితుడు
 • క్షురకం క్షురకుడు లేదా మంగలి
 • మేదర మేదరి
 • డ్రంగం వడ్రంగి
 • వైద్యం వైద్యుడు
 • వ్యవసాయం వ్యవసాయదారుడు
 • అర్చకం అర్చకుడు
 • ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు

శ్రీ మామిడి శ్రీనివాసరావు ఈ గ్రామానికి చెందిన వ్యక్తి,

మలాలు మార్చు

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-10. Retrieved 2015-08-01.
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 3. http://dsalsrv02.uchicago.edu/cgi-bin/romadict.pl?page=769&table=brown&display=utf8[permanent dead link]

మూలాలు మార్చు

https://web.archive.org/web/20160310234716/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12

వెలుపలి లంకెలు మార్చు