నికొలో డా కాంటి
నికొలో డా కాంటి (Niccolò de' Conti' : 1395-1469)[1] వెనిస్ కి చెందిన ఒక వర్తకుడు, పరిశోధకుడు. చియోగ్గియా లో జన్మించిన నికొలో భారతదేశానికి, ఆగ్నేయ ఆసియా, దక్షిణ చైనా లకు 15వ శతాబ్దం ప్రారంభంలో యాత్రలు చేశాడు. 1295 లో మార్కోపోలో తిరిగి రాక తర్వాత 1439 లో సముద్ర మార్గం ద్వారా చైనా నుండి నికొలో కంటే ముందు తిరిగి వచ్చిన ఇటాలియన్ వర్తకుల దాఖలాలు లేవు.[2]
నికొలొ డా కాంటి | |
---|---|
జననం | 1395 చియోగియా, వెనీస్ |
వృత్తి | వర్తకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత దేశంలో, దక్షిణాసియాలో యాత్రలు |
నికొలో వెనీస్ నుండి 1419 లో యాత్రలకి బయలుదేరి సిరియా లోని డమాస్కస్ లో స్థిరపడి, అక్కడ అరబిక్ భాషని నేర్చుకొన్నాడు. 25 ఏళ్ళ పాటుగా ముస్లిం వర్తకుడిగా నే ఆసియాలోని చాలా ప్రదేశాలకి పర్యటించాడు. ఇస్లామిక్ భాషలు, వారి సంస్కృతులని వంటబట్టించుకొన్న నికొలో కి అతడు ఇస్లామిక్ వర్తకుల నావలలో పయనించటానికి దోహదపడ్డాయి.
పర్యటనలు
మార్చునికొలో మొదట ఎడారిని దాటి బాగ్దాద్ చేరాడు. తర్వాత టైగ్రిస్ నది లో పయనించి బస్రాహ్ చేరాడు. తర్వాత పర్షియన్ గల్ఫ్ దాటి ఇరాన్ చేరి అక్కడ పర్షియన్ నేర్చుకొన్నాడు.
అరేబియా సముద్రము దాటి గుజరాత్ లోని ఖంబత్ చేరుకొన్నాడు. పాచమురియా, హెల్లీ ల మీదుగా దక్కను కి కేంద్రమైన విజయనగర సామ్రాజ్యానికి చేరాడు. ఇక్కడే తెలుగు భాషకి ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతాలు) గలదని తెలుసుకొని తెలుగు భాష కి ఇటాలియానో డి'ఓరియంటె (ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్) అని బిరుదుని ఇచ్చాడు.
మూలాలు
మార్చు- ↑ Surdich (1983)
- ↑ Charles Raymond Beazley (1911). "Conti, Nicolo de'". In Chisholm, Hugh (ed.) Encyclopædia Britannica. 7. (11th ed.). Cambridge University Press. pp. 28-29.
వనరులు
మార్చు- Campbell, Gordon (2003). "Conti, Niccolò de'". The Oxford Dictionary of the Renaissance. Oxford University Press.
- Bracciolini, Poggio: De varietate fortunae, book iv [సుమారు 1445] (ed. by Abbé Oliva, Paris 1723).
- Niccolò de' Conti, Chandeigne (ed.), Le voyage aux Indes (in French), 2004, ISBN 2-906462-86-1
- Major, R. H. (ed.). India in the fifteenth century: Being a collection of narratives of voyages to India in the century preceding the Portuguese discovery of the Cape of Good Hope, (Works issued by the Hakluyt Society) (English trans. by J. Winter Jones, Hakluyt Society, London 1857). Republished by Asian Educational Services (30 June 1992). ISBN 81-206-0768-6.
- Parry, J. H. The European Reconnaissance: Selected Documents. London, Macmillan, 1968
- Francesco Surdich, "Conti, Niccolò de'" in Dizionario Biografico degli Italiani vol. 28 (1983)
- Le Goff, Jacques. 'The Medieval West and the Indian Ocean: An Oneiric Horizon' in Time, Work, and Culture in the Middle Ages, University of Chicago Press, 1980.