నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి

తెలంగాణలోని నిజామాబాదులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి

నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి తెలంగాణలోని నిజామాబాదులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. రాష్ట్రంలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఇది ఒకటి.[1][2]

నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి
పటం
భౌగోళికం
స్థానంగాంధీచౌక్, నిజామాబాదు, తెలంగాణ, భారతదేశం
వ్యవస్థ
ఆరోగ్య సంక్షేమ వ్యవస్థప్రజా
రకాలుపూర్తి-సేవ వైద్య కేంద్రం, బోధనా ఆసుపత్రి
[యూనివర్సిటీ అనుబంధంకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
Services
అత్యవసర విభాగంYes
లింకులు
వెబ్‌సైటుhttp://www.gmcnzb.org/

చరిత్ర

మార్చు

ప్రస్తుతం నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్న ప్రదేశంలో 1995లో ఈ నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించబడింది. 2010 సంవత్సరంలో, నిజామాబాదు నగరంలో వైద్య కళాశాలని ప్రారంభించాలని భారత వైద్య మండలి నుండి నోటీసు వచ్చిన తరువాత, ఖలీల్వాడి మైదానంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిర్మాణం ప్రారంభమైంది, దీనికోసం ఖలీల్వాడి మైదానంలో కొత్తగా నిర్మించిన 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన స్టేడియం కూల్చివేయాల్సి వచ్చింది.[3] కొత్త ఆసుపత్రి భవనాల నిర్మాణంకోసం భూమిని కూడా కేటాయించగా, 2012లో 8 అంతస్తుల భవనం పూర్తయింది.[4] 2012 చివరి నాటికి, పాత ప్రభుత్వ ఆసుపత్రిని కొత్తగా నిర్మించిన భవనానికి మార్చగా, పాత ఆసుపత్రి ప్రాంగణాన్ని కొత్త వైద్య కళాశాల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పునరుద్ధరించాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) నుండి ఆమోదం పొందిన తరువాత 2013లో ఆసుపత్రి ప్రారంభమవ్వగా, కళాశాల విద్యా సంవత్సరం కూడా ప్రారంభించింది. దీనికి అనుబంధంగా నర్సింగ్ స్కూల్ కూడా ఉంది.

మౌలిక సదుపాయాలు

మార్చు

90 కోట్ల రూపాయలతో అన్ని సౌకర్యాలతో కూడిన రెండు 8-అంతస్తుల భవనాలతో కలిపి మొత్తం ఆరు భవనాలు నిర్మించబడ్డాయి.[4] కొత్త ఆసుపత్రి, వైద్య కళాశాల ప్రాంగణం 20 ఎకరాలలో ఒకదానికొకటి ఎదురుగా ఉన్నందున వాటిని కలపడంకోసం ఒక అడుగు వెడల్పుతో వంతెనను ఏర్పాటుచేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ (2.14 కోట్ల రూపాయలు) ఐ పాకో మిషన్‌ (30 లక్షల రూపాయలు), ఎక్స్‌రే యూనిట్లు (7 లక్షల రూపాయలు), మానసిక రోగుల చికిత్సా విభాగాలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.[5]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nizamabad Medical College". Gmcnzbd.org. Archived from the original on 2014-06-07. Retrieved 2020-09-01.
  2. TelanganaToday (2017-06-30). "Nizamabad govt hospital to introduce super specialty services". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-01. Retrieved 2020-09-01.
  3. "Medical college eludes Nizamabad - The Times of India". Timesofindia.indiatimes.com. 2013-05-13. Retrieved 2020-09-01.
  4. 4.0 4.1 "Government medical college soon in Nizamabad". Thehindu.com. 2012-03-08. Retrieved 2020-09-01.
  5. telugu, NT News (2023-05-29). "పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం". www.ntnews.com. Archived from the original on 2023-05-29. Retrieved 2023-05-31.