వేముల ప్ర‌శాంత్ రెడ్డి

వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, బాల్కొండ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1] ప్రస్తుతం కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నాడు.

వేముల ప్రశాంత్ రెడ్డి
వేముల ప్ర‌శాంత్ రెడ్డి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 సెప్టెంబరు 2019
ముందు

పదవీ కాలం
2 జూన్ 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1966-03-14) 1966 మార్చి 14 (వయస్సు 55)
వేల్పూర్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి, మంజుల
జీవిత భాగస్వామి నీరజారెడ్డి
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం బాల్కొండ,
సోమాజీగూడ

జీవిత విషయాలుసవరించు

ప్ర‌శాంత్ రెడ్డి 1966, మార్చి 14న సురేందర్ రెడ్డి, మంజుల దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలంలోని వేల్పూర్ గ్రామంలో జన్మించాడు. బిఈ (సివిల్) చదివాడు.

వ్యక్తిగత జీవితంసవరించు

ప్రశాంత్ రెడ్డికి నీరజారెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలుసవరించు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ పై 32,408 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2][3] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ పై 36,248 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో రవాణా, రోడ్లు & భవనాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా ఉన్నాడు.[4][5][6]

ఇతర వివరాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-17.
  2. "Vemula Prashanth Reddy(TRS):Constituency- BALKONDA(NIZAMABAD) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2021-08-17.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-11. Retrieved 2019-05-11.
  4. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  5. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  7. Harikrishna (2019-02-19). "విధేయతే మంత్రిని చేసింది: తెలంగాణ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి ప్రొఫైల్". https://telugu.oneindia.com. Retrieved 2021-08-17. External link in |website= (help)