నిధి అగర్వాల్
నిధి అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటి. హిందీ, తెలుగు చిత్రాలలో నటించింది.
నిధి అగర్వాల్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్య | క్రైస్ట్ విశ్వవిద్యాలయం |
వృత్తి | నటి, మోడల్, నృత్యకారిణి |
తల్లిదండ్రులు |
|
జీవిత విశేషాలు
మార్చు1993, ఆగస్టు 17న హైదరాబాద్‌లోని హిందీ మాట్లాడే మార్వారీ కుటుంబంలో జన్మించి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ కు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉంది.[1] విద్యశిల్ప్ అకాడమీ, విద్యానికేతన్ పాఠశాలలో చదివిన నిధి, బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.[2][3] నృత్యరూపకాలు, కథక్, బెల్లీ డ్యాన్స్‌లలో శిక్షణ పొందింది.[4]
సినిమారంగం
మార్చు2014 యమహా ఫాసినో మిస్ దివాలో ఫైనల్స్ వరకి వచ్చింది.[5] 2017లో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ నిధి అగర్వాల్ తొలిచిత్రం.[6][7] 2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.[8]
నటించిన చిత్రాలు
మార్చుసంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2017 | మున్నా మైకెల్ | డాలీ/ దీపికా శర్మ | హిందీ | హిందీలో తొలిచిత్రం/ప్రధాన పాత్ర |
2018 | సవ్యసాచి | చిత్ర | తెలుగు | తెలుగులో తొలిచిత్రం/ప్రధాన పాత్ర |
2022 | మిస్టర్ మజ్ను[9] | నిఖితా "నిక్కి" | తెలుగు | ప్రధాన పాత్ర |
2019 | ఇక్క | హిందీ | ప్రీ-ప్రొడక్షన్ | |
2019 | ఇస్మార్ట్ శంకర్[10] | సారా (పింకి) | తెలుగు | |
2020 | మాస్క్ | హిందీ | ప్రీ-ప్రొడక్షన్ | |
2024 | ది రాజా సాబ్ | తెలుగు |
టీవిరంగం
మార్చు- ది కపిల్ శర్మ టాక్ షో
- కొంచెం టచ్ లో ఉంటే చెప్తా (సీజన్ 4)[11]
ప్రసంశలు
మార్చు- ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ & టెలివిజన్ వారు జీవిత సభ్యత్వం
- యమహా ఫాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్[5]
- జీ సినీ అవార్డులు - ఉత్తమ మహిళా అరంగేట్రం - మున్నా మైఖేల్
మూలాలు
మార్చు- ↑ Elina Priyadarshini Naya (16 November 2017), "Nidhhi Agerwal: I am a Tollywood buff who grew up watching Telugu films dubbed in Hindi", Times of India. Retrieved 4 August 2019.
- ↑ "Nidhhi Agerwal". Indiatimes. Archived from the original on 6 జూన్ 2017. Retrieved 4 August 2019.
- ↑ "Tiger Shroff to romance Nidhhi Agerwal in Munna Michael". Times Internet. 21 August 2016. Retrieved 4 August 2019.
- ↑ "I always wanted to be an actor - Nidhhi Agerwal". Times Internet. 22 October 2016. Retrieved 4 August 2019.
- ↑ 5.0 5.1 "Nidhhi Agerwal: Steamy pictures of the budding star". The Times of India. 8 November 2017. Retrieved 4 August 2019.
- ↑ "Confirmed! Tiger Shroff to romance Nidhhi Agerwal in are Munna Michael". Deccan Chronicle. 15 August 2016. Retrieved 4 August 2019.
- ↑ "Munna Michael starring Tiger Shroff, Nawazuddin Siddiqui to release on 21 July". Firstpost. 21 April 2017. Retrieved 4 August 2019.
- ↑ "Nidhi Agarwal 'హరిహర వీరమల్లు' గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన నిధి". EENADU. Retrieved 2022-01-13.
- ↑ Kumar, Gabbetha Ranjith (12 December 2018). "Mr Majnu to release on January 25". The Indian Express. Retrieved 3 August 2019.
- ↑ "Ismart Shankar teaser out. Ram Pothineni gives fans action-packed return gift on his birthday". India Today. 20 July 2019.
- ↑ "Ram Pothineni, Nidhhi Agerwal and Nabha Natesh to feature in KTUC season 4's first episode". Times of India. 10 July 2019. Retrieved 4 August 2019.
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నిధి అగర్వాల్ పేజీ