మిస్టర్ మజ్ను (2019 సినిమా)
2019లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.
మిస్టర్ మజ్ను రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటించారు.[1] జార్జ్ సి. విల్లియమ్స్ ఛాయాగ్రహణం అందించగా ఎస్.ఎస్. తమన్ సంగీతం అందరిని అలరించింది.[2][3]
మిస్టర్ మజ్ను | |
---|---|
దర్శకత్వం | వెంకీ అట్లూరి |
రచన | వెంకీ |
నిర్మాత | బివిఎస్ఎన్ ప్రసాద్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | జార్జ్ సి. విల్లియమ్స్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | ఐజి ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ (యునైటెడ్ కింగ్డమ్) |
విడుదల తేదీ | 25 జనవరి 2019 |
సినిమా నిడివి | 145 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అక్కినేని అఖిల్ (విక్రమ్ కృష్ణ "విక్కీ")
- నిధి అగర్వాల్ (నికిత "నిక్కీ")
- ఇజాబెల్లె లైట్ (మాధవి)
- కైలాష్ రెడ్డి (బాబీ)
- రాజా చేంబోలు (కిషోర్)
- నాగబాబు (నికిత తండ్రి)
- సుబ్బరాజు (రమేష్ బాబు)
- రావు రమేష్ (శివ ప్రసాద్)
- జయప్రకాశ్ (కృష్ణ ప్రసాద్)
- అజయ్
- పవిత్ర లోకేష్
- సితార (నికిత అమ్మ)
- ప్రియదర్శి (చిట్టి)
- విద్యుల్లేఖ రామన్ (లిండా)
- దేవేందర్ (తొలిపరిచయం) (వినోద్)
- ఎస్.ఎస్. తమన్ ("కోపంగా కోపంగా " పాటలో క్యామియో అప్పీరెన్స్)
- కాదంబరి కిరణ్ (విక్కీ బంధువు)
పాటలు
మార్చుఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా శ్రీమణి లిరిక్స్ రాసాడు. ఈ పాటలకి మంచి స్పందన లభించింది.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మిస్టర్ మజ్ను" | రమ్యా ఎన్ఎస్కె | 3:54 | ||||||
2. | "నాలో నీకు" | శ్రేయ ఘోషాల్ & కాల భైరవ | 4:21 | ||||||
3. | "ఏమైనదో" | అర్మాన్ మాలిక్ | 3:16 | ||||||
4. | "హే నేనిలా" | శృతి రంజని | 4.05 | ||||||
5. | "కోపంగా కోపంగా" | అర్మాన్ మాలిక్ & ఎస్.ఎస్ తమన్ | 4:34 | ||||||
6. | "చిరు చిరు నవ్వుల" | తుషార్ జోషి, కోటి సలూర్ & రమ్య బెహరా | 4:56 | ||||||
25:08 |
మూలాలు
మార్చు- ↑ Kumar, Gabbetha Ranjith (12 December 2018). "Mr Majnu to release on January 25". The Indian Express. Retrieved 2019-07-30.
- ↑ "Mr Majnu pre-release event live streaming: Watch Jr NTR addressing Akhil Akkineni's film function". Ibtimes.co.in. 19 January 2019. Retrieved 2019-07-30.
- ↑ Rajpal, Roktim (1970-01-01). "Mr Majnu Pre-release Event, Jr NTR To Chief Guest, Mr Majnu Pre-release Event To Be Held On January 19 2019". Filmibeat. Retrieved 2019-07-30.