ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్ 2019, జూలై 18న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ పోతినేని, నిధి అగర్వాల్‌, నభా నటేష్, సత్యదేవ్‌ తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[3]

ఇస్మార్ట్ శంకర్
ఇస్మార్ట్ శంకర్ సినిమా పోస్టర్
దర్శకత్వంపూరీ జగన్నాథ్
రచనపూరీ జగన్నాథ్
స్క్రీన్ ప్లేపూరీ జగన్నాథ్
నిర్మాతపూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్
తారాగణంరామ్‌ పోతినేని, నిధి అగర్వాల్‌, నభా నటేష్, సత్యదేవ్‌
ఛాయాగ్రహణంరాజ్ తోట
కూర్పుజునైద్ సిద్దిఖీ
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
2019 జూలై 18 (2019-07-18)
భాషతెలుగు
బాక్సాఫీసు₹25 కోట్లు[1] (ప్రపంచవ్యాప్తంగా రెండురోజుల కలెక్షన్లు)

కథ మార్చు

హైదరాబాదు పాతబస్తీకి చెందిన ఇస్మార్ట్ శంకర్ (రామ్) డబ్బు కోసం మాజీ ముఖ్యమంత్రి కాశీవిశ్వనాథ్‌ను చంపేస్తాడు. ఈ నేరం నుండి తప్పించుకునే క్రమంలో శంకర్ ప్రియురాలైన చాందిని (నభానటేష్) చనిపోతుంది. ప్లాన్ ప్రకారం తనతో ఈ హత్య చేయించి నేరస్తుడిగా ముద్రవేశారనే విషయం తెలుసుకున్న శంకర్, అసలు హంతకులను పట్టుకోవడం కోసం జైలు నుంచి పారిపోతాడు. మరోవైపు ఈ హత్యకేసును పరిశోధిస్తున్న నిజాయితీపరుడైన సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్) ఈ కేసును చేధించే క్రమంలో చనిపోతాడు. దాంతో అతడి ప్రియురాలు న్యూరో సైంటిస్ట్ సారా (నిధి అగర్వాల్) సహాయంతో అరుణ్ మెదడులో నిక్షిప్తమైన రహస్యాల్ని శంకర్ బ్రెయిన్‌లోకి పంపిస్తుంది. అరుణ్ మెమోరీ సహాయంతో అసలు హంతకుల్ని శంకర్ ఎలా పట్టుకునడనేది మిగతా కథ.[4]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
  • నిర్మాత: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్
  • సంగీతం: మణిశర్మ
  • ఛాయాగ్రహణం: రాజ్ తోట
  • కూర్పు: జునైద్ సిద్దిఖీ
  • నిర్మాణ సంస్థ: పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్

నిర్మాణం మార్చు

చిత్రీకరణలో హైదరాబాదు షెడ్యూల్ ఫిబ్రవరిలో పూర్తయింది.[5] మార్చిలో గోవాలో చిత్రీకరణ పూర్తయింది.[6] ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలను ఏప్రిల్‌లో వారణాసిలో చిత్రీకరించారు.[7] మే నెలలో మొత్తం సినిమా చిత్రీకరణ పూర్తయింది.[8]

విడుదల మార్చు

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మే 15న హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలచేయబడింది.[3][9]

బాక్సాఫీస్ మార్చు

మూడు రోజుల్లో రూ. 36 కోట్లు వసూలు చేసింది.[10] ఆరు రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టింది.[11] 9 రోజుల్లో 63 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది.[12]

పాటలు మార్చు

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."దిమాక్ ఖరాబ్ (రచన: కాసర్ల శ్యామ్)"కాసర్ల శ్యామ్కీర్తన శర్మ, సాకేత్ కో4:40
2."జిందాబాద్ జిందాబాద్ (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్శరత్ సంతోష్, రమ్య బెహర4:40
3."ఇస్మార్ట్ థీమ్ (రచన: భాస్కరభట్ల రవికుమార్)"రచన: భాస్కరభట్ల రవికుమార్అనురాగ్ కులకర్ణి4:12
4."ఉండిపో (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్అనురాగ్ కులకర్ణి, రమ్య బెహర5:09
5."బోనాలు (రచన: కాసర్ల శ్యామ్)"రచన: కాసర్ల శ్యామ్రాహుల్ సిప్లిగంజ్, మోహన భోగరాజు5:51
Total length:21:09

పురస్కారాలు మార్చు

సైమా అవార్డులు మార్చు

2019 సైమా అవార్డులు

  1. ఉత్తమ నేపథ్య గాయకుడు (అనురాగ్ కులకర్ణి - ఇస్మార్ట్ థీమ్)

మూలాలు మార్చు

  1. iSmart Shankar box office collection: Ram Pothineni film earns Rs 25 crore in 2 days - Movies News - https://www.indiatoday.in/movies/regional-cinema/story/ismart-shankar-box-office-collection-ram-pothineni-film-earns-rs-25-crore-in-2-days-1571568-2019-07-20
  2. "Ram Pothineni's iSmart Shankar release date finally out". The Live Mirror. Archived from the original on 2019-05-31. Retrieved 2019-07-20.
  3. 3.0 3.1 "Ismart Shankar teaser out. Ram Pothineni gives fans action-packed return gift on his birthday". India Today. 20 July 2019.
  4. సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ రివ్యూ". Archived from the original on 18 July 2019. Retrieved 21 July 2019.
  5. "ISMART SHANKAR' DONE WITH HYD SCHEDULE, TO GO TO GOA". India Glitz. 28 February 2019. Archived from the original on 1 జూన్ 2019. Retrieved 21 July 2019.
  6. Neeshita Nyayapati (23 March 2019). "Puri Jagannadh and Ram Pothineni's 'iSmart Shankar' wraps up Goa schedule". Times of India. Retrieved 21 July 2019.
  7. "'iSmart Shankar' moves to Varanasi". Telugu Cinema. 30 April 2019. Archived from the original on 1 జూన్ 2019. Retrieved 21 July 2019.
  8. "'ISMART SHANKAR' WRAPS UP TALKIE PART, LOCKS TEASER DATE". India Glitz. 12 May 2019. Archived from the original on 1 జూన్ 2019. Retrieved 21 July 2019.
  9. Kumar R, Manoj (15 May 2019). "iSmart Shankar movie teaser: Ram Pothineni transforms into Puri Jagannadh's hero". Indian Express. Retrieved 21 July 2019.
  10. ప్రజాశక్తి, తాజావార్తలు (21 July 2019). "మూడు రోజుల్లో రూ. 36 కోట్లు... సేఫ్ జోన్ 'ఇస్మార్ట్ శంకర్'!". Archived from the original on 21 July 2019. Retrieved 21 July 2019.
  11. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (24 July 2019). "ఆరు రోజుల్లో 56 కోట్లు కొల్ల‌గొట్టిన ఇస్మార్ట్ శంక‌ర్". www.ntnews.com. Archived from the original on 3 ఆగస్టు 2019. Retrieved 3 August 2019.
  12. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (27 July 2019). "మొదటిసారి సక్సెస్‌ కోసం తపించా". www.andhrajyothy.com. Archived from the original on 3 ఆగస్టు 2019. Retrieved 3 August 2019.

ఇతర లంకెలు మార్చు