రాధిక చౌదరి
రాధికా చౌదరి (జననం 1984 అక్టోబరు 20) భారతీయ నటి, ఆమె ప్రధానంగా హిందీ, తమిళం, తెలుగు చలనచిత్రాలలో 2000ల ప్రారంభంలో నటించింది. 2010లో, లాస్ వెగాస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు గెలుచుకుని, ఆమె అమెరికాలో చిత్ర దర్శకురాలిగా సినీప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టింది.
రాధిక చౌదరి | |
---|---|
జననం | 1984 అక్టోబరు 20 |
వృత్తి | నటి, దర్శకురాలు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1999 – ప్రస్తుతం |
కెరీర్
మార్చు1999 నుంచి పలు దక్షిణాది చిత్రాలలో నటిస్తూనే కల్ట్ 11 (2010), అవుట్‌సోర్సింగ్ (2011) వంటి టీవీ ధారావాహికలలోనూ చేసింది. 2010లో, ఆమె లాస్ ఏంజిల్స్‌లో దర్శకురాలిగా మారింది. లాస్ వెగాస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్ ఆరెంజ్ బ్లోసమ్ చిత్రం ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా సిల్వర్ ఏస్ అవార్డును గెలుచుకుంది.[1]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | భాష | పాత్ర | నోట్స్ |
1999 | సాంబయ్య | తెలుగు | ||
కన్నుపడ పోగుత్తయ్య | తమిళం | |||
టైం | తమిళం | తెలుగులో టైం | ||
2000 | సిమ్మాసనం | తమిళం | ||
క్రోధం 2 | తమిళం | |||
ప్రియమానవాలే | తమిళం | సౌమ్య | ||
2001 | హుచ్చన మదువేలి ఉందొనే జానా | కన్నడ | ||
మిడిల్ క్లాస్ మాధవన్ | తమిళం | |||
లేడీస్ అండ్ జెంటిల్‌మన్ | తమిళం | |||
కుంగుమ పొట్టు గౌండర్ | తమిళం | |||
నువ్వు నేను | తెలుగు | ప్రియా | ||
పార్థలే పరవాసం | తమిళం | రేఖ | తెలుగులో పరవశం | |
2002 | షక్కలక్క బేబీ | తమిళం | ||
తప్పు చేసి పప్పు కూడు | తెలుగు | చీచ | ||
నంది | కన్నడ | పింకి | ||
2003 | ఖుషీ | హిందీ | రోమా | |
వికడన్ | తమిళం | |||
తేరే నామ్ | మూగ బిచ్చగాడు | చిన్న దృశ్యం | ||
మా అల్లుడు వెరీ గుడ్ | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన | ||
ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు | తెలుగు | |||
ఐతే ఏంటి | తెలుగు | |||
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు | తెలుగు | |||
2004 | శీను వాసంతి లక్ష్మి | తెలుగు | ||
ఎన్ పురుష్ ఎతిర్ వీటు పొన్ను | తమిళం | పార్వతి | ||
2010 | ది హంచ్‌బ్యాక్ | ఆంగ్ల | ||
2022 | లాల్ సింగ్ చద్దా | హిందీ | ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా |
మూలాలు
మార్చు- ↑ "Radhika Chaudhari wins Silver Ace at LA fest - Times of India". articles.timesofindia.indiatimes.com. Archived from the original on 7 July 2012. Retrieved 3 February 2022.