నువ్వే నువ్వే
నువ్వే నువ్వే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తోలి తెలుగు సినిమా. సినిమాలో తరుణ్, శ్రియ, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు ధరించారు.
నువ్వే నువ్వే | |
---|---|
దర్శకత్వం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
రచన | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
స్క్రీన్ ప్లే | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
నిర్మాత | స్రవంతి రవికిషోర్ |
తారాగణం | తరుణ్ శ్రియ ప్రకాష్ రాజ్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | కోటి |
విడుదల తేదీ | 10 అక్టోబర్ 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డు 2002 వ సంవత్సరానికి ఎంపికైంది.
కథాంశం
మార్చుఅంజలి (శ్రీయ) విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) అనే ఒక ధనవంతుడి కూతురు. విశ్వనాథ్ కి కూతురంటే ప్రాణం. ఆమెకు భర్తయ్యే వాడు తనకు అన్ని విధాలా నచ్చాలనీ, తనకు ఎదురు చెప్పకూడని వాడు అయ్యుండాలని అతని కోరిక. రిషి (తరుణ్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సరదా అబ్బాయి. అతని తండ్రి (చంద్రమోహన్) కి ఒక దుకాణం ఉంటుంది. రిషి సీనియర్ గా ఉన్న కళాశాలలో అంజలి కూడా చేరుతుంది. చిన్న చిలిపి తగాదాల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. అంజలి పుట్టిన రోజున ఆమెకు ఆశ్చర్యానికి గురిచేద్దామని ఆమెకు చెప్పకుండా రిషి ముంబైకి తీసుకెళ్తాడు. ఈ సంఘటనతో విశ్వనాథ్ కి తన కూతురు ప్రేమలో పడిందని అర్థం అవుతుంది.
విశ్వనాథ్ రిషిని తన ఇంటికి పిలిపించి తన కూతురుని పెళ్ళి చేసుకుని పోషించడానికి అతని అర్హతలేమిటో నిరూపించుకోమంటాడు. అందుకు రిషి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఒక కోటి రూపాయలు అతనికిచ్చి తన కూతురిని మరిచిపొమ్మంటాడు. రిషి ఆ డబ్బును తిరిగిచ్చేస్తాడు. తన పడే బాధ ఎలా ఉంటుందో తెలియాలని విశ్వనాథ్ ఒక యాచకుడిని రిషి చెల్లికి పెళ్ళిసంబంధంగా తీసుకెళ్తాడు. దాంతో రిషి కుటుంబం చాలా బాధ పడుతుంది. రిషి విశ్వనాథ్ ఆఫీసుకు వెళ్ళి అక్కడి కంప్యూటర్లు, వస్తువులు ధ్వంసం చేసే వస్తాడు. తన చెల్లిలికి, బిచ్చగాడికీ మధ్య ప్రేమ లేదనీ, కానీ తనకు, అంజలికి మధ్య ప్రేమ ఉందని వాదిస్తాడు. అంజలి రిషిని తలుచుకుని బాధ పడుతుంటుంది. కూతురు బాధను చూడలేని విశ్వనాథ్ ఆమెను తన దగ్గర పనిచేసే వేరే అతనికి ఇచ్చి పెళ్ళి చేయాలని చూస్తాడు. అంజలి నేరుగా రిషి ఇంటికి వెళ్ళిపోయి వెంటనే తనను పెళ్ళి చేసుకోమని కోరుతుంది. కానీ రిషి అది సరైన పద్ధతి కాదని ఆమెకు నచ్చజెప్పి ఆమెను తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాడు. చివరికి అంజలికి రిషి పట్ల ఉన్న ప్రేమను తెలుసుకుని విశ్వనాథ్ వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
మార్చు- తరుణ్
- శ్రీయ
- ప్రకాష్ రాజ్
- చంద్రమోహన్ - తరుణ్ తండ్రి
- సుధ (నటి) - తరుణ్ తల్లి
- సునీల్ (నటుడు) - పండు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం - లెక్చరర్
- రాజీవ్ కనకాల
- అనితా చౌదరి
- తనికెళ్ళ భరణి
- ఎం. ఎస్. నారాయణ - పోలీసు
పాటల జాబితా
మార్చుకంప్యూటర్లు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం. దేవన్, కోటి, త్రివిక్రమ్ , అనురాధ శ్రీరామ్
నామనసుకేమయెంది , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషినీ
నువ్వే నువ్వే కావాలంటుంది, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె ఎస్ చిత్ర
ఐ యాం వెరీ సారీ,రచన; సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె.కె
నిద్దురపోతున్నా , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.శంకర్ మహదేవన్
అమ్మాయీ నచ్చేసింది , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.రాజేష్, కౌసల్య