నేనే మొనగాణ్ణి 1968, అక్టోబర్ 4న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, షీలా, రాజనాల కాళేశ్వరరావు, ధూళిపాళ, కైకాల సత్యనారాయణ, శాంతకుమారి, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు.[1]

నేనే మొనగాణ్ణి
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం నందమూరి తారక రామారావు,
షీలా
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ ప్రతిమ ఫిల్మ్స్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

బందిపోటు భద్రయ్య (రాజనాల) కొడుకు నానీ. భద్రయ్య దోపిడీలు చేస్తూ జీవిస్తాడు. పోలీస్ అధికారి నందనరావు (కైకాల సత్యనారాయణ) భద్రయ్యను బంధించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈతని భార్య యశోద (శాంతకుమారి). ఒకసారి భద్రయ్యను పట్టించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నందనరావును చంపేస్తాడు. అతను తప్పించుకోడానికి ప్రయత్నిస్తుండగా ధూళిపాల అతడిని కాలుస్తాడు. ప్రాణ భయంతో పారిపోతూ పిల్లవాడిని వదిలేస్తాడు. నానీ పోలీసులకు చిక్కుతాడు. నందనరావు భార్య యశోద (శాంతకుమారి), నానీని ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్దచేస్తుంది. వంశీధర్ (ఎన్టీ రామారావు)గా పెరిగి పెద్దవాడయిన నానీ.. యశోద, నందనరావులనే తల్లిదండ్రులుగా భావిస్తుంటాడు. ఉత్తమ వ్యక్తిగా మన్ననలు పొందుతూ, మేనమామ (యశోద తమ్ముడు) ముత్యాలరావు కుమార్తె నీల (షీల) ప్రేమలో పడతాడు. ఈ ప్రేమను ఇష్టపడని ముత్యాలరావు, వంశీధర్‌ను దొంగ కొడుకుగానే పరిగణిస్తుంటాడు. వంశీధర్ నందనరావు కొడుకేనని, తన కొడుకు నానీ పోలీసు కాల్పుల్లో మరణించాడన్న భ్రమతో, వంశీధర్‌ను అంతం చేసేందుకు బందిపోటు భద్రయ్య ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపువిదేశీ శక్తులతో చేతులు కలిపి దేశంలో అనేక మారణకాండలు జరిపిస్తుంటాడు. వంశీధర్ వీటినన్నిటినీ చాకచక్యంగా ఎదుర్కొంటుంటాడు. వేలమంది జనానికి ప్రాణాధారమైన ప్రాజెక్టును ధ్వంసం చేయబోయిన దుండగులను అడ్డుకుని, భద్రయ్య ప్రయత్నాలను భంగం చేస్తాడు. ఆ కాల్పుల్లో భద్రయ్య మరణిస్తూ వంశీధరే తన కుమారుడని నిజం గ్రహించడం, వంశీధర్‌లోని నిజాయితీ, మంచితనం గుర్తించిన ముత్యాలరావు నీలతో పెళ్లి నిశ్చయించటం, వంశీధర్‌కు పోలీస్ ఆఫీసర్‌గా పోస్టింగ్ రావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[2].

సాంకేతిక వర్గం

మార్చు
 • కథ: షణ్ముగం
 • కెమెరా: బాబు
 • నృత్యం: చిన్ని, సంపత్
 • కళ: తోట
 • కూర్పు: గోవిందస్వామి
 • పోరాటాలు: సాంబశివరావు
 • సంగీతం: టి.వి.రాజు
 • ఫొటోగ్రఫీ: కెఎస్ ప్రసాద్
 • నిర్మాత: కెఎస్ ప్రసాద్.
 • దర్శకత్వం: ఎస్.డి.లాల్

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
 1. గారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా నవ్వని - ఘంటసాల, కె. ఎల్. రాఘవులు బృందం - రచన: దాశరథి
 2. చూస్కో నా రాజా చూస్కో ... వయసుంది సొగసుంది - ఎల్. ఆర్. ఈశ్వరి
 3. నిన్ను చూసింది మొదలు కలలే కలలే నిన్ను వలచింది - పి.సుశీల ( ఎన్.టి.రామారావు మాటలతో)
 4. వయసు పిలిచింది ఎందుకో నాలో వలపు విరిసింది అందుకో డార్లింగ్ - ఘంటసాల - రచన: డా. సి.నారాయణ రెడ్డి
 5. షోకిల్లా పిల్లా నిన్నే నిన్నే మెచ్చుకుంటుంది బాకల్లె - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.సుశీల, ఘంటసాల

మూలాలు

మార్చు
 1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (6 October 1968). "నేనే మొనగాణ్ణి చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 4 October 2017.[permanent dead link]
 2. నేనే మొనగాణ్ణి - సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 06-10-2018

బయటిలింకులు

మార్చు