ప్రపంచంలోకెల్లా అంత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతాల్లో పంజాబ్ ఒకటి. పంజాబ్ అన్న పేరు మొట్టమొదట 14వ శతాబ్దిలో ప్రాంతాన్ని సందర్శించిన ఇబ్న్ బతూతా వ్రాతల్లో కనిపిస్తుంది.[1] ఈ పదం విస్తృత ప్రయోగంలోకి 16వ శతాబ్ది ఉత్తరార్థం నుంచి ప్రారంభమైంది. 1580 నాటి తారిఖ్-ఎ-షేర్షా సూరిలో పంజాబ్ యొక్క షేర్ ఖాన్ కోట నిర్మించినట్టు కనిపిస్తుంది. పంజాబ్ కు సంస్కృత సమానార్థకమైన పంచ-నద (ఐదు నదుల దేశం) అన్నది మహాభారత ఇతిహాసంలో కనిపిస్తుంది. పంచనద అన్న పేరు మళ్ళీ అబుల్ ఫజల్ రాసిన ఐన్-ఎ-అక్బరీ (మొదటి భాగం) లో తిరిగి కనిపిస్తుంది. అబుల్ ఫజల్ ఈ ప్రాంతాన్ని లాహోర్, ముల్తాన్ విభాగాలుగా ప్రస్తావించారు. ఐన్-ఎ-అక్బరీ రెండవ సంపుటిలో పంజ్ నద్ అన్న పదం కనిపిస్తుంది.[2] మొఘల్ చక్రవర్తి జహంగీర్ తన తుజ్క్-ఇ-జహంగీరిలో పంజాబ్ అన్న పదాన్ని ప్రస్తావించారు.[3] పంజాబ్ అన్న పదం పర్షియన్ నుంచి వచ్చింది, భారత చరిత్రలోని టర్కీ విజేతలు ఈ పదాన్ని ప్రవేశపెట్టారు., [4] ఈ పదానికి అర్థం ఐదు (పంజ్), జలాలు (ఆబ్), అంటే ఐదు నదుల భూమి. ఐదు ప్రధానమైన నదులతో సారవంతమైన ప్రాంతం కావడంతో బ్రిటీష్ ఇండియా కాలం నుంచీ పంజాబ్ భారతదేశపు ధాన్యాగారంగా మారింది. ప్రస్తుతం పంజాబ్ ప్రాంతంలోని ఐదు నదుల్లో మూడు పాకిస్తాన్లోని పంజాబ్ లో ప్రధానంగా ప్రవహిస్తూండగా, మిగతా రెండూ హిమాచల్ ప్రదేశ్, భారతీయ పంజాబ్ రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రవహిస్తూంది.

వాల్మీకి ఆశ్రమం, పంజాబ్ కొండలు, కాంగ్రా, ca. 1800-25.

జిప్సీలు, ఓద్లు, సాధ్లు, గుజార్లు, అహిర్లు, ఖత్రీలకు ఇది మాతృస్థానం; ఇక్కడకు స్కైలాక్స్, అలెగ్జాండర్, హుయాన్ త్సాంగ్, ఫాహియాన్ వచ్చారు. ఆర్యనిజం, జొరాస్ట్రియన్ మతము, హెలెనిజం, బౌద్ధం, ఇస్లాం, సిక్ఖు మతం గతంలో సంవదిస్తూ పోటీపడడం ఇక్కడ చూశాం. ఆలోచనలు, కార్యాల్లో ప్రతి సంపర్కంలోనూ, ప్రతి ఉపద్రవంలోనూ, ప్రతి తాజా విప్లవంలోనూ ఈ భూమి ఎంత వెల చెల్లించింది? దాని రక్తంలోనూ, మేధలోనూ గ్రీస్, చైనా, టిబెట్, అరేబియా, ఈజిప్ట్, మధ్య, పశ్చిమ భారతాల నుంచి స్వీకరించి, సమన్వయం ఎలా చేసుకుంది? దాన్ని తెలుసుకుంటే మనం బౌద్ధం, దాని బయటి ఉద్దేశాలను కలప, రంగు, రాయి, చేతల్లో కూడా అనుసరించలేక కేవలం పంజాబీల మతంలోపలి కొంత భాగంగా ఎందుకు మిగిలిందో తెలుస్తుంది, ఎందుకు బ్రాహ్మణ కర్మకాండ జారిపోయి క్షత్రియ తాత్త్వికత, వేదాంతం ఎందుకు నిలిచాయో అర్థమవుతుంది; పర్షియాలో దాని మాతృభూమి నుంచి ఇస్లాం వాక్యం కన్నా స్ఫూర్తి ఎందుకు గ్రామీణ పంజాబ్ ను ఆకట్టుకుందో; చైనీస్, బెంగాలీ పిల్లల ఆటలు, చైనీయుల పిగ్తాల్, చైనీయుల ఇంద్రజాలం, గ్రీక్ అర్థ వృత్తాకార హెల్మెట్, రోజువారీ ఆహారం, పనులకు టర్కీ పదాలు, విక్రమాదిత్య రాజపుత్ కథలు, సంప్రదాయాలు, బౌద్ధ జానపద కథలు, సాధువుల కథలు, జ్ఞానం, పర్షియా, అరేబియాకు చెందిన ప్రేమికుల గాథలు, ఎందుకు ఈ భూమిలో తన స్థానాన్ని వెతుక్కున్నాయో, ఈ స్థానికుల ప్రేమను చురగొన్నాయో; అలానే ఎందుకు రామకృష్ణుల ఆరాధన ఇక్కడ వేళ్ళూనుకోలేదో, ఎందుకు సాధువులు విలసిల్లారో, ఇతర సంస్కృతులతో పోలిస్తే ఎందుకు చరిత్ర గతిలో మార్పులు అతికొద్ది స్థాయిలోనే జీవితంలోనూ, సాహిత్యంలోనూ నమోదయ్యాయో తెలుస్తుంది.

—మోహన్ సింగ్, ఎ హిస్టరీ ఆఫ్ పంజాబ్ లిటరేచర్ (1100-1932)[5]

సింధులోయ నాగరికత మార్చు

పురాతత్వ పరిశోధనలు సింధు నది చుట్టుపక్కల క్రీ.పూ.3300 నాటి సింధు నది చుట్టుపక్కల ఉన్న నివాసాలను కనిపెట్టారు. ఈ పరిశోధనలు క్రమంగా ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన నాగరికతల్లో ఒకటైన సింధులోయ నాగరికతను బయటకుతెచ్చాయి. క్రమంగా పురాతత్వ పరిశోధనలు సింధులోయ నాగరికత క్రీ.పూ.5వ శతాబ్దం నాటివని ఈ నాగరికత ప్రాచీనతను మరో రెండు శతాబ్దాలకు విస్తరించారు.[6] నాగరికత తన అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు హరప్పా (పశ్చిమ పంజాబ్ లోని సాహివాల్ దగ్గరలోనిది), మొహంజదారో వంటి నగరాలతో విలసిల్లింది. క్రీ.పూ.19వ శతాబ్దిలో నాగరికత అత్యంత వేగవంతంగా క్షీణించింది.

వేద కాలం మార్చు

 
వేద కాలంలో పంజాబ్ ప్రాంతంతో కూడిన భారతదేశ పటం.

వేదాలతో అనుసంధానించిన భారతీయ సంస్కృతికి సంబంధించినది వేద కాలం. ప్రాచీన పంజాబ్ (అప్పటికి సప్త సింధు) ప్రాంతపు జీవితాన్ని కొంతవరకూ గ్రహించడానికి ఉపకరిస్తుంది. వేదకాలం నాటిదిగా చెప్పే దశరాజన్య యుద్ధం పరుస్ని (ప్రస్తుత కాలపు రావి నదిగా గుర్తించారు) నదీ తీరంలో భరత వంశానికి చెందిన త్రత్సు పరంపరలోని సుదాస్ రాజుకు పదిమంది రాజుల కూటమికీ నడుమ జరిగింది.[7] సుదాస్ కు వ్యతిరేకంగా కూటమిగా కూడిన పది తెగల్లో పురు, ద్రుహ్య, అను, తుర్వాస, యదు అన్నవి ఐదు ప్రధాన తెగలు కాగా మిగిలిన ఐదు అప్రాధాన్య తెగలు -ప్రస్తుతపు పంజాబ్ లోని పశ్చిమ, వాయువ్య ప్రదేశాలకు చెందిన పక్థా, అలీనా, భలానా, విసానిన్, శివాలు.[8]

బౌద్ధ కాలంలో పంజాబ్ మార్చు

 
ఉత్తర పంజాబ్ లోని హిమాలయాల్లో సూర్యోదయం

బౌద్ధ పాఠ్యం అంగుత్తర నికాయా[9] బుద్ధునికి పూర్వపు జంబూద్వీపంలో అభివృద్ధి చెందిన 16 గొప్ప రాజ్యాల్లో (సోలాస్ మహాజనపదాలు) గాంధార, కాంభోజాలు ఉన్నట్టు పేర్కొంది. పాళి సాహిత్యం ఆపైన కూడా జంబూద్వీపానికి చెందిన పదహారు ప్రాచీన రాజకీయ శక్తుల్లోకెల్లా ఉత్తర పథంలో ఉన్నవి కాంభోజ, గాంధారాలేనని స్పష్టం చేస్తూన్నా వాటి సరిహద్దులు సుస్పష్టంగా పేర్కొనలేదు. గాంధార, కాంభోజ ప్రాంతాలు ఎగువ సింధు ప్రాంతాలైన కాశ్మీర్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్, ప్రస్తుతం పాకిస్తాన్ లో భాగంగా ఉన్న పశ్చిమ పంజాబ్ లో ప్రధాన భూభాగం కలిపి ఉండేవని భావిస్తారు.[10] బౌద్ధుల గాంధార ప్రాంతపు ఎల్లలు కొన్ని సందర్భాల్లో ముల్తాన్ వరకూ విస్తరించినట్లు, బౌద్ధుల కాంభోజ రాజౌరీ, పూంఛ్, అభిసార, హజారా, స్వాత్,, కునార్, కపిశ లోయలు సహా తూర్పు ఆఫ్ఘనిస్తాన్ వంటివి కూడి ఉన్నట్టు తెలుస్తూంది. మైఖేల్ విట్జెల్ ప్రకారం ఈ ప్రాంతమంతా కలిపి గ్రేటర్ పంజాబ్ అవుతుంది. బౌద్ధ గ్రంథాలు ఈ ఉత్తర ప్రాంతం, ప్రత్యేకించి కాంభోజ రాజ్యం మంచి గుర్రాలకు, గుర్రపు రౌతులకూ ప్రసిద్ధి అని పేర్కొన్నాయి, ఆ గ్రంథాల్లో ఈ ప్రాంతాన్ని తరచు అశ్వాలకు గృహంగా అభివర్ణించారు.[11] ఐతే మరో ప్రాచీన బౌద్ధ కృతి చుల్లా-నిద్దేశ గాంధార రాజ్యాన్ని యోనతో భర్తీ చేసింది, దాంతో ఉత్తరపథానికి చెందిన మహాజనపథాలు కాంభోజ, యోనలు మాత్రమే అవుతున్నాయి.[12]

పాణిని, కౌటిల్యుల కాలపు పంజాబ్ మార్చు

పాణిని శలాతుర (ప్రస్తుతం పాకిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రావిన్సుకు చెందిన అటక్ దగ్గరలోని లాహుర్ గా గుర్తిస్తున్నారు) లో జన్మించారు. ఆయన సుప్రసిద్ధ రచన అష్టాధ్యాయి ద్వారా మహా పంజాబ్ ప్రాంతపు ప్రజలు సాయుధ వృత్తితో ప్రధానంగా జీవించేవారని భావించవచ్చు. ఆ కృతిలో ఆయుధజీవి సంఘాలుగానో, ఆయుధ బలంతో జీవనం సాగించే గణరాజ్యాలుగానూ జీవనం సాగించే పలు జాతులను ప్రస్తావించారు, [13] పర్వత ప్రాంతాల్లో (ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ఈశాన్య ప్రాంతం సహా) నివసించేవారిని పార్వతీయ సంఘాలు (పర్వత ప్రాంతపు గణరాజ్యాలు) గా పేర్కొన్నారు.[14] పూర్వపు అభిప్రాయం ఒకటి వృకాలు (బహుశా ఆధునిక కాలపు విర్క్ జాట్లు), దామనీలు, త్రిగర్త-షష్టాలు అని పిలిచే ఆరు రాజ్యాల కూటమి, యౌధేయాలు (ఆధునిక కాలపు జౌయా లేక జోహియా రాజ్ పుట్ లు లేదా కొందరు కాంభోజ్ లు, పార్సులు, కేకయులు, సిబీలు క్షుద్రకాలు, మాళ్వాలు, భర్తాలు, మాద్రకాలు వంటి వంశాలు కలిపి వాహిక సంఘాలుగా పిలువబడేవి, [15][16] పార్వతేయ ఆయుధజీవుల్లో పాక్షికంగా త్రిగర్తలు, దార్వాలు, గాంధార వంశానికి చెందిన హస్తయానులు, [17] నిహారాలు, హంసమారగలు, కాంభోజన్లు వంటి అశ్వయానులు, అశ్వకాయనులు[18], [19] ధార్తేయులు (అశ్వకాయుల పట్టణానికి చెందినవారు), అప్రితాలు, మధువంతులు (రోహిత్ గిరీలుగా పేరు), చిత్రా, గిల్గిత్ ప్రాంతాలకు చెందిన దారదాలు తదితరులు ఉన్నారు. దీనికితోడు పాణిని కురు, గాంధార, కాంభోజ క్షత్రియ రాజులను కూడా ప్రస్తావిస్తారు.[20] పాణిని అష్టాధ్యాయి ప్రకారం ఈ క్షత్రియులు గణరాజ్యాల రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించేవారు.

క్రీ.పూ. 4వ శతాబ్దానిదైన కౌటిల్యుని అర్థశాస్త్రం పలు సాయుధోప జీవనులైన గణరాజ్యాల గురించి ప్రత్యేకించి కాంభోజ, సురాస్త్రాలు, వార్త శస్త్రోపజీవనులైన ఇతర యుద్ధ తెగల గురించి రాశారు, మరోవైపు మద్రక, మల్ల, కురు తదితరులను రాజ శబ్దోపజీవనులు అని వర్గీకరించారు.[21][22][23][24][25] డాక్టర్ ఆర్థర్ కోక్ బర్నెల్ అభిప్రాయంలో పశ్చిమ ప్రాంతాల్లో కాంభోజలు, కాథాలు యుద్ధ నైపుణ్యానికి, ధైర్యసాహసాలకు గొప్ప పేరు పొందారు, శౌభుతీలు, యౌధేయులు, శిబిలు, మాళ్వాలు, క్షుద్రకులు ఇతర ఆనాటి అసంఖ్యాక భారతీయ యుద్ధ జాతులు ఉండేవి[26][27] దీన్నిబట్టి వేద, పురాణ కాలాల్లో ఏర్పడిన వీరోచిత భావాలు పాణిని, కౌటిల్యుల కాలానికి కొనసాగుతూ వచ్చాయని భావిస్తున్నారు. నిజానికి మొత్తం మహా పంజాబ్ ప్రాంతమంతా యుద్ధోన్ముఖులైన వ్యక్తులతో నిండివున్నట్టు ప్రచారం పొందింది. ఈ ఆయుధోపజీవులైన తెగలు క్రీ.పూ.6వ శతాబ్దికి చెందిన అకేమెనిద్, క్రీ.పూ.4వ శతాబ్దికి చెందిన మాసిడోనియన్ దండయాత్రలకు తీవ్ర ప్రతిఘటనను ఇచ్చాయి.

పంజాబ్ చరిత్ర ప్రకారం - కాంభోజలు, దారాదులు, కైకేయులు, మాద్రులు, పౌరవులు, యౌధేయులు, మాళ్వాలు, సింధు, కురు రాజులు సంయుక్తంగా ప్రాచీన పంజాబ్ వీరత్వ సంప్రదాయానికి, మిశ్రమ సంస్కృతికి తమ తమ వంతు కారకులయ్యారు.[28][29]

సామ్రాజ్యాలు మార్చు

ఆకేమెనిద్ సామ్రాజ్యం మార్చు

 
పాకిస్తాన్ లోని తక్షశిల ప్రపంచ వారసత్వ ప్రదేశం

ప్రాచీన గాంధార, కాంభోజ, తక్షశిల ప్రాంతాల పశ్చమ భాగాలు ఆకెమెనిద్ సామ్రాజ్యపు తూర్పు సరిహద్దుగా ఉండేది.

 
జాందియల్, తక్షశిలకు చెందిన హెలెనిస్టిక్ ఆలయం, ఇది సాధారణంగా ఇండో-పార్థీనియం యుగానికి చెందిన జొరాస్ట్రియన్ అగ్ని దేవాలయంగా చెప్తారు.

గాంధార, కాంభోజ ప్రాంతాలకు చెందిన సింధు ప్రాంతం ఆకేమెనిద్ సామ్రాజ్యం 7వ స్థాయి అధికారిక ప్రాంతంగా ఉండేది, సింధు (ప్రస్తుత సింధ్), సౌవీర ప్రాంతాలు 20వ స్థాయి అధికారిక ప్రాంతంగా ఆకేమెనిద్ సామ్రాజ్యపు తూర్పుకొసన ఉన్న ప్రాంతాలు. సాలీన 270 నుంచి 360 టాలెంట్ల గోల్డ్ డస్ట్ కప్పం సమర్పించేవని నమోదైవుంది. ఆనాటి ఈ భారతీయ ప్రావిన్సులైన సింధ్, పంజాబ్ ప్రాంతాలు పర్షియన్ సామ్రాజ్యాల్లో అత్యంత సంపన్న భాగాలుగా ఉంటూ, అనేకమంది సైనికులను అందించేవి.

 
ఇండో-సైథియన్ చక్రవర్తి ఏజెస్ కాలం నాటి నాణాలు

ప్రాచీన గ్రీకులకు ఈ ప్రాంతం గురించి కొంత అవగాహన ఉండేది. డారియస్ చక్రవర్తి గ్రీకు వాడైన సైలాక్స్ ఆఫ్ కారైండాను సింధు నది నుంచి సూయెజ్ వరకూ హిందూ మహాసముద్రాన్ని అన్వేషించి, తెలుసుకొమ్మని నియమించారు. సైలాక్స్ పెరిప్లాస్ అనే పుస్తకంలో తన ప్రయాణ వివరాలను అందించారు. హెకటేయస్ ఆఫ్ మిలెటస్ (క్రీ.పూ.500), హెరోడాటస్ (క్రీ.పూ.483-431) కూడా పర్షియన్ల సింధు సత్రపీ గురించి వ్రాశారు. ప్రాచీన గ్రీకు గ్రంథాలు, పటాల్లో భారత ఉపఖండపు ఉత్తర భాగంలో ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప నది ఇండొస్ (ఇండస్ లేదా సింధు) ఉన్నట్టు పేర్కొన్నారు.

 
ఇండో-సైథియన్ చక్రవర్తి మాయెస్ (క్రీ.పూ.85-60) యొక్క వెండి తెత్రాడ్రెం.

క్రీ.పూ.4వ శతాబ్దిలో సిథియన్లు వాయువ్య భారతంలో ఉన్న కాలానికి సమకాలీనంగా ఇండో-గ్రీక్ రాజ్యం ఉండేది, స్థానిక గ్రీకు పాలకుల శక్తిని తెలుసుకుని వారితో కలిశారని చరిత్రకారుల అంచనా.

సిక్ఖు పాలన మార్చు

 
సిక్ఖు సామ్రాజ్యంలో మహారాజా ప్రధాన దర్బారు, లాహోర్ దర్బారు.

రంజీత్ సింగ్ సుకేర్ చకియా మిస్ల్ ల నుంచి పాలన తన చేతిలోకి తీసుకోవడానికి ముందు పంజాబ్ దురానీ సామ్రాజ్యం బలహీన పడడంతో వేర్వేరు భాగాలుగా ఉండేది. అహ్మద్ షా అబ్దాలీ భారత సామ్రాజ్యం ప్రభ తగ్గిపోవడం ప్రారంభమైంది. ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది. పెషావర్, కాశ్మీర్లలో ఏర్పడ్డ తిరుగుబాటు వల్ల స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకున్నాయి. బరాక్జైలు ఆ ప్రాంతాలకు పాలకులయ్యారు. అటక్ వజ్రిఖ్లెలు, సియాల్ ఝంగ్ లు పరిపాలిస్తున్నారు. పష్తూన్లు కసూర్ ని పాలించారు. ముల్తాన్ కు నవాబ్ ముజాఫర్ ఖాన్ పాలకుడయ్యారు.

పంజాబ్, సింధ్ ప్రాంతాలు 1757 నుంచి ఆఫ్ఘాన్ పాలనలో ఉంటూవచ్చాయి. మరోవైపు పంజాబ్ లో సిక్ఖులు ఎదుగుతున్న ప్రబల శక్తి కాజొచ్చారు. తైమూర్ ఖాన్ అనే స్థానిక పాలకుడు సిక్కులను పంజాబ్ నుంచి పారదోలి, రామ్ రౌనీ అన్న వారి కోటను కూలగొట్టగలిగారు. కానీ అతని నియంత్రణ కొన్నాళ్ళకే ముగిసిపోయింది. సిక్ఖు మిసల్ లు తైమూర్ షాను, ఆయన ముఖ్యమంత్రి జలాల్ ఖాన్ ను గెలిచారు. ఆఫ్ఘాన్లు వెనక్కి తగ్గడంతో సిక్ఖులు 1758లో లాహోరును గెలుచుకున్నారు. జస్సా సింగ్ అహ్లూవాలియా సిక్ఖు సార్వభౌమాధికారాన్ని సాధించి, నాయకత్వం వహించి, ఆయన విజయాన్ని గుర్తించే నాణాలు ముద్రించారు. అహ్మద్ షా అబ్దాలీ మరాఠాలను 1761లో పానిపట్టు వద్ద యుద్ధంలో ఎదుర్కొంటూ వుండగా, సిర్హింద్, దియాల్ పూర్ ప్రాంతాలను జస్సా సింగ్ అహ్లూవాలియా దోచుకునిపోతున్నారు. జాగ్రోన్, కోట్ ఇసా ఖాన్ ప్రాంతాల్లో సట్లెజ్ ఒడ్డున విడిశారు. హోషియార్ పూర్, నారాయిన్ ఘర్ నగరాలను అంబాలాలో పట్టుకుని, కపూర్తలా పాలకుడి నుంచి కప్పం కట్టించుకున్నారు. ఆపైన ఝంగ్ వైపు దండయాత్ర సాగించారు. సియాల్ పాలకుడు గట్టి ప్రతిఘటన చేసినా, అహ్మద్ షా ఫిబ్రవరి 1761లో దేశం విడిచి వెళ్ళేసరికి నవాబ్ జస్సా సింగ్ అహ్లూవాలియా తిరిగి సిర్హింద్ పై దాడిచేసి తన ప్రాంతాన్ని తర్ణ్ తారణ్ వరకూ విస్తరించుకున్నారు. ఆయన బియాస్ ను దాటగానే సుల్తాన్ పూర్ 1762లో గెలిచారు, అహ్మద్ షా వెనుతిరిగి వచ్చారు, గట్టి పోరాటం సాగింది. అప్పుడు జరిగిన మారణహోమాన్ని ఘలుఘరా అని పిలుస్తారు. సిక్ఖు దళాలపై పెద్ద ఎత్తున దాడి జరగగానే నవాబ్ జస్సా సింగ్ కంగ్రా కొండల్లోకి పారిపోయారు. అహ్మద్ షా అబ్దాలీ వెళ్ళిపోగానే అహ్లూవాలియా తిరిగి సిర్హింద్ ను దాడిచేసి, నేలమట్టం చేస్తూ, ఆఫ్ఘాన్ గవర్నర్ జెన్ ఖాన్ ను చంపారు. ఇది సిక్ఖులకు గొప్ప విజయంగా నిలిచి మొత్తం సిర్హింద్ ప్రదేశాన్నంతా గెలవగలిగారు.

అహ్మద్ షా జూన్ 1773లో మరణించారు. ఆయన మరణం తర్వాత పంజాబ్ లో ఆఫ్ఘాన్ బలం తగ్గిపోయింది. కాబూల్ సింహాసనం మీదికి తైమూర్ షా వచ్చారు. అప్పటికి మిస్ల్ లు పంజాబ్ లో సువ్యవస్థితం అయిపోయాయి. మిస్ల్ లు తూర్పున సహార్న్ పూర్, పశ్చిమాన అటక్, ఉత్తరాన కాంగ్రా జమ్ము ప్రాంతాలను పరిపాలించారు.

సిక్ఖు సామ్రాజ్యం పంజాబ్, దాని సమీప ప్రాంతాలను కలుపుకుంటూ మతరహిత రాజ్యాన్ని స్థాపించిన మహారాజా రంజీత్ సింగ్ నాయకత్వంలో 19వ శతాబ్దిలో భారత ఉపఖండంలో ఏర్పడ్డ ప్రధాన రాజకీయ శక్తి.[30]. 1799లో రంజిత్ సింగ్ లాహోర్ను పట్టుకున్న నాటి నుంచీ 1849 వరకూ కొనసాగింది. స్వతంత్ర మిస్ల్ లు, ఖల్సాలో సామ్రాజ్యపు పునాదులు పాదుకున్నాయి.[31][32] 19వ శతాబ్దిలో అత్యున్నత స్థితిలో ఉండగా సామ్రాజ్యం పడమట ఖైబర్ కనుమ నుంచి తూర్పున పశ్చిమ టిబెట్ వరకూ, దక్షిణాన మిథన్ కోట్ నుంచీ ఉత్తరాన కాశ్మీర్ వరకూ విస్తరించింది. సిక్ఖు సామ్రాజ్యం బ్రిటీష్ వారు భారత ఉపఖండంలో ఆక్రమించిన ఆఖరి ప్రధానమైన భాగం.

సిక్ఖు సామ్రాజ్యపు పునాదులు 1707లో ఔరంగజేబు మరణం, ముఘల్ సామ్రాజ్య పతనం నుంచి చూడవచ్చు. గురు గోవింద్ సింగ్ ప్రారంభించిన ఖల్సా మరో రూపమైన దాల్ ఖల్సా ఒకవైపు ముఘల్ సామ్రాజ్యం చెప్పుకోదగ్గ విధంగా బలహీన పడిపోవడంతో పశ్చిమాన ఆఫ్ఘాన్లపై దండయాత్రలతో పోరాటం సాగించారు. ఆ క్రమంలో ఈ సైన్యాలు విస్తరించి, విడిపోయి వివిధ సమాఖ్యలు, పాక్షికంగా స్వతంత్రత కలిగిన మిస్ల్ ల స్థాపన సాగింది. వివిధ ప్రాంతాలు, నగరాలను ఈ సైన్య విభాగాలు నియంత్రించడం ప్రారంభించాయి. ఏదేమైనా 1762 నుంచి 1799 వరకూ మిస్ల్ ల సైన్యాధ్యక్షులు స్వతంత్ర సైనిక నాయకులుగా రూపాంతరం చెందారు.

లాహోరును రంజీత్ సింగ్ ఆఫ్ఘాన్ పరిపాలకుడు జమాన్ షా అబ్దాలీ నుంచి గెలుచుకుని, ఆఫ్ఘాన్-సిక్ఖు యుద్ధాల్లో ఆఫ్ఘాన్లను ఓడించి బయటకు పంపేయడం, వివిధ సిక్ఖు మిస్ల్ ను ఏకీకరణ చేయడంతో సామ్రాజ్య స్థాపన జరిగింది. 1801 ఏప్రిల్ 12న వైశాఖి పండుగ నాడు పంజాబ్ మహారాజాగా ప్రకటించుకుని, ఏకీకృతమైన రాజ్యంగా ప్రకటించారు. గురు నానక్ వంశస్తులైన సాహఙబ్ సింగ్ బేడీ పట్టాభిషేకం జరిపించారు.[33]

ఒక మిస్ల్ కు నాయకుని స్థానం నుంచి పంజాబ్ మహారాజా అయ్యేంతవరకూ రంజిత్ సింగ్ అతికొద్ది కాలంలోనే అధికారం సంపాదించారు. అప్పటికి ఆధునికమైన ఆయుధాలు, యుద్ధ పరికరాలు, శిక్షణ సమకూర్చి సైన్యాన్ని ఆధునీకరించారు. సిక్ఖు సామ్రాజ్య కాలంలో సిక్ఖులు కళారంగంలోనూ, విద్యాల్లోనూ పునరుజ్జీవనం పొందారు. రంజిత్ సింగ్ మరణానంతరం అంతర్గత కుమ్ములాటల్లోనూ, రాజకీయమైన తప్పులతోనూ సామ్రాజ్యం బలహీనపడింది. చిరవకు 1849లో ఆంగ్లో-సిక్ఖు యుద్ధాల్లో ఓటమి అనంతరం సామ్రాజ్యం పతనమైంది. సిక్ఖు సామ్రాజ్యం 1799 నుంచి 1849 కాలంలో లాహోర్, ముల్తాన్, పెషావర్, కాశ్మీర్ ప్రావిన్సులుగా ఉండేది.

మూలాలు మార్చు

  1. Encyclopedia of Sikhism Archived 2016-09-12 at the Wayback Machine - Punjab
  2. "Ain-i-Akbari". Archived from the original on 2018-07-14. Retrieved 2016-07-07.
  3. Punjabi Adab De Kahani, Abdul Hafeez Quraishee, Azeez Book Depot, Lahore, 1973.
  4. Canfield, Robert L. (1991). Turko-Persia in Historical Perspective. Cambridge, United Kingdom: Cambridge University Press. p. 1 ("Origins"). ISBN 0-521-52291-9.
  5. Singh, Mohan (1956). A History of Panjabi Literature (1100-1932). Amritsar: Kasturi Lal & Sons. p. 2.
  6. https://web.archive.org/web/20160602101845/http://timesofindia.indiatimes.com/india/Indus-era-8000-years-old-not-5500-ended-because-of-weaker-monsoon/articleshow/52485332.cms?
  7. Rig Veda VII.18,19, 83.
  8. Rig Veda 7.18.6; 5.13.14; 7.18.12, 7.83.1-6; The Rig Veda and the History of India, 2001. (Aditya Prakashan), ISBN 81-7742-039-9, David Frawley.
  9. Anguttara Nikaya I. 213; IV. 252, 256, 260, 261.
  10. Cf: History of the Punjab, 2004, p 32, D. C. Sircar, Editors Fauja Singh, Lal Mani Joshi, Punjabi University Dept. of Punjab Historical Studies; Cf: Studies in the Geography of Ancient and Medieval India, 1990, pp 34, 100, D.C. Sircar - History; Geographical Data in the Early Purāṇas: A Critical Study, 1972, p 166 sqq, M. R. Singh - India; History of India, 2004, p 52, Hermann Kulke, Dietmar Rothermund; International Dictionary of Historic Places, 1995, p 608, Trudy Ring, Robert M. Salkin, Noelle Watson, Sharon La Boda, Paul Schellinger.
  11. Sumangala Vilāsinī (P.T.S.). Vol I, 124; Manorathapūranī, Anguttara Commentary (S.H.B.), I, 199; Aruppa-Niddesa of Visuddhi magga (P.T.S.), 332; Jātaka, ed. Fausboll,, vol IV, 464 etc. See also: Mahavastu, II. 185; Kunala Jataka v. 28, Vinaya Pitaka, Vol III etc. See also: Historie du Bouddhisme Indien, p 110, E. Lamotte.
  12. Lord Mahāvīra and his times, 1974, p 197, Dr Kailash Chand Jain; The History and Culture of the Indian People, 1968, p lxv, Dr Ramesh Chandra Majumdar, Bharatiya Vidya Bhavan, Bhāratīya Itihāsa Samiti; Problems of Ancient India, 2000, p 7, K. D. Sethna.
  13. Ashtadhyayi Sutra V.3.114-117.
  14. Ashtadhyayi Sutra IV.3.91.
  15. Forlong, J.G.R. (1906). Encyclopedia of Religion or Faiths of Man, Vol II. Kessinger Publishing. p. 282. ISBN 0-7661-4308-2.
  16. See Gannapatha V.3.116, V.3.117, V.3.118, besides Sutras V.3.113-118 etc.
  17. Ashtadhyayi Sutra VI.4.174.
  18. Ashtadhyayi Sutra IV.1.110.
  19. Nadadigana IV.1.90
  20. Ashtadhyayi Sutra IV.1.168-174.
  21. Shamasatry, R. (1966). Kautiliya's Arthashastra, Book Xi. p. 407. Archived from the original on 1 జనవరి 2005. Retrieved 10 జూలై 2016.
  22. Ramachandra Dikshitar, V. R. (1932). The Mauryan Polity. p. 70.
  23. Mookerji, Dr Radha Kumud (1940–41). Chandragupta Maurya and His Times: Madras University, Sir William Meyer Lectures. p. 168. ISBN 81-208-0405-8.
  24. Sensarma, P. (1977). The Military History of Bengal. p. 47.
  25. Saletore, Bhasker Anand (1960). Main Currents in the Ancient History of Gujarat. p. 24.
  26. Studies in Kautilya, 1953, p 15, Prof. Venkata Krishna Rao.
  27. Hindu Polity (The Ordinance of Manu), 1972, p 29, Dr Arthur Coke Burnell.
  28. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; joshi అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  29. Evolution of Heroic Tradition in Ancient Panjab, pp 21-70, Dr Buddha Prakash.
  30. "Ranjit Singh: A Secular Sikh Sovereign by K.S. Duggal. ''(Date:1989. ISBN 8170172446'')". Exoticindiaart.com. 3 September 2015. Archived from the original on 17 జూన్ 2008. Retrieved 2009-08-09.
  31. Encyclopædia Britannica Eleventh Edition, (Edition: Volume V22, Date: 1910–1911), Page 892.
  32. Grewal, J. S. (1990). The Sikhs of the Punjab, Chapter 6: The Sikh empire (1799–1849). The New Cambridge History of India. Cambridge University Press. ISBN 0 521 63764 3.
  33. The Encyclopaedia of Sikhism, section Sāhib Siṅgh Bedī, Bābā (1756–1834).