పండిట్ జస్రాజ్

భారతీయ సాంప్రదాయ గాయకుడు
(పండిత్ జస్రాజ్ నుండి దారిమార్పు చెందింది)

పండిట్ జస్రాజ్ (జనవరి 28, 1930 - ఆగస్టు 17 , 2020), హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.

పండిట్ జస్రాజ్
2015 భోపాల్లో పండిట్ జస్రాజ్
వ్యక్తిగత సమాచారం
మూలంహిస్సార్, హర్యానా, భారతదేశం
మరణంఆగస్టు 17 , 2020
సంగీత శైలిహిందుస్తానీ శాస్త్రీయ సంగీతం,
మేవతి ఘరానా
వృత్తిక్లాసికల్ గాయకుడు
క్రియాశీల కాలం1945 - 2020 [1]
వెబ్‌సైటుOfficial site

బాల్యం

మార్చు

జస్రాజ్ హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో మేవాతి ఘరానాకు చెందిన కుటుంబంలో జనవరి 28, 1930న జన్మించాడు. అతని తండ్రి పండిట్ మోతీరామ్‌జీ శాస్త్రీయ సంగీత కళాకారుడు. పండిట్ మోతీరాజ్ ను హైదరాబాద్ చివరి నిజాం పరిపాలకులైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన ఆస్థాన గాయకుడి గా నియమించారు . కానీ మోతిరాజ్ అకస్మాత్తుగా మరణించారు. అప్పటికి జశ్ రాజ్ వయసు 4 ఏళ్ళే. తన అన్నలైన పండిట్ మణి రామ్ , ప్రతాప్ నారాయణ దగ్గర తబల సంగీతమును నేర్చుకున్నాడు. జశ్ రాజ్ బాల్యము హైదరాబాద్ లోని అంబర్ పేట్ , జాంబాగ్ లో జరిగింది. జాంబాగ్ లోని వివేకా వర్ధని విద్యాలయములో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఆ కాలములో తబలా కళా కారుల ఫై చిన్న చూపు ఉండటం తో జశ్ రాజ్ తబలా సంగీతమును వదిలి గాత్ర సాధనపై తన దృష్టిని మరల్చాడు. తన మొదటి సంగీతంను నేపాల్ రాజైన త్రిభువన వీర విక్రమ్ సభ లో 1952 వ సంవత్సరం లో సంగీత కచేరి చేశారు[2] పండిట్ జశ్ రాజ్ కొన్ని సినిమాలలో కూడా పాడారు. పండిట్ జశ్ రాజ్ కలకత్తా ఆకాశ వాణి కేంద్రములో కూడా తన గాత్రమును వినిపించారు.

సంగీత ప్రస్థానం

మార్చు

జస్రాజ్ తొలి సంగీత గురువులు తండ్రి పండిట్ మోతీరామ్, అన్న పండిట్ మణిరామ్‌జీ లు. తరువాత జస్రాజ్ మహరాజా జయవంత్ సింగ్‌జీ వఘేలా వద్ద శిష్యరికం చేశాడు. జస్రాజ్ తన చిన్నప్పుడు ప్రఖ్యాత గజల్ గాయని, బేగం అక్తర్ శ్రావ్యమైన గొంతు విని ఎంతో ప్రభావితుడై, బడికి ఎగనామం పెట్టి ఒక చిన్న హోటల్‌లో వినిపించే ఆమె పాటలను రోజంతా వినేవాడు. 1960 లో, జస్రాజ్ ఒకసారి హాస్పిటల్‌లో ఉన్న బడే గులాం అలీఖాన్ను కలిసినప్పుడు, ఆయన జస్రాజ్‌ను తన శిష్యుడిగా ఉండమన్నాడు. కాని తను ఇదివరకే పండిట్ మోతీరామ్ శిష్యుడినని, జస్రాజ్‌ ఆయనను తిరస్కరించాడు. అన్న మణిరామ్‌జీ జస్రాజ్‌ను, తబలా సహకారం కోసం తన వెంట తీసికెళ్ళేవాడు. ఆ కాలంలో సారంగి వాద్యకారుల మాదిరే, తబలా వాద్యకారులను జనం చిన్నచూపు చూసేవారు. దాంతో జస్రాజ్ అసంతృప్తిపొంది, తబలాకు స్వస్తి చెప్పి, గాత్రం నేర్చుకొన్నాడు. జస్రాజ్ ఒక ప్రత్యేక వినూత్న పద్ధతిని జుగల్‌బందిలో ప్రవేశపెట్టాడు. అందులో పురాతన మూర్ఛనల పై అధారపడిన ఒక శైలిలో, గాయని, గాయకుడు తమ వేర్వేరు రాగాలను ఒకేసారి ఆలపిస్తారు. పండిట్ జశ్ రాజ్ హవేలీ సంగీతము , భజనలు ( భక్తి పాటలు , శ్లోకములను ) జోడించిన సంగీత కళాకారుడు. తనదైన సంగీత చతురతతో అందరి మన్ననలు పొందినాడు, అయినా తన సంగీతం లో శాస్త్రీయ పునాది కి ప్రాధాన్యత ను ఇచ్చినారు. పండిట్ జశ్ రాజ్ భారత దేశములోనే గాక అమెరికా, కెనడాలో సంగీత కళాశాలలను నెలకొల్పి నాడు [3] 1963 నుంచి ముంబైలో స్థిర పడినారు. పండిట్ జశ్ రాజ్ సతీమణి మధుర శాంతారామ్ (సినీ దర్శకుడు వి.శాంతారామ్ కుమార్తె) ను 1962 వ సంవత్సరం లో వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు షారంగ్ దేవ్ పండిట్ , కుమార్తె దుర్గా జశ్ రాజ్. వీరు ఇరువురు కూడా సంగీతకారులు .పండిట్ జశ్ రాజ్ 18-08-2020 గుండె పోటు తో న్యూ జెర్సీ (అమెరికా ) లో తన కుమార్తె ఇంటిలో పరమపదించినారు . అతని పార్థీవ దేహమును ముంబై కి తీసుకు వచ్చినారు. అతని అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనలతో నిర్వహించినారు   [4]

పేరెన్నికగన్న శిష్యులు

మార్చు

సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామ్‌నాథ్, శశాంక్ సుబ్రహ్మణ్యం లు. బాలివుడ్ గాయని సాధనా సర్గమ్ జస్రాజ్ శిష్యురాలే. తన తండ్రి జ్ఞాపకార్థం, జస్రాజ్ ప్రతి సంవత్సరం, పండిట్ మోతీరామ్, పండిట్ మణిరామ్‌ సంగీత్ సమారోహ్ను హైదరాబాద్‌లో గత 30 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాడు.

పురస్కారాలు[5]

మార్చు

ఇంటర్నేషనల్ ఏస్ట్రనామికల్ యూనియన్, శుక్ర, గురు గ్రహాలకు మధ్య ప్రాంతంలో కనుగొన్న గ్రహశకలానికి పండిట్ జస్రాజ్ పేరిట "పండిట్‌జస్రాజ్" అని పేరు పెట్టింది.[6]

  • 1975 వ సంవత్సరం లో పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం నుంచి
  • 1987 వ సంవత్సరం లో సంగీత నాటక అకాడమీ నుంచి
  • 1990 వ సంవత్సరం లో పద్మ భూషణ్ పురస్కారం భారత ప్రభుత్వం నుంచి
  • పద్మ విభూషణ్ 2000 లో
  • సంగీత నాటక అకాడమీ అవార్డు 1987 లో
  • సంగీత కళారత్న
  • మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
  • లతా మంగేష్కర్ పురస్కారం
  • మహారాష్ట్ర గౌరవ పురస్కారం
  • సురేర్ గురు
  • పైన చెప్పినవే గాక కేరళ , మహారాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ , కర్ణాటక ప్రభుత్వముల నుంచి వాళ్ళ రాష్ట్రములలో వున్న అత్యున్నతమైన అవార్డులూ , పురస్కారములు పండిట్ జశ్ రాజ్ కు ఇచ్చారు

ఆల్బంలు

మార్చు
  • బైజూ బావ్రా ( 2008 )
  • ఉపాసన ( 2007 )
  • తపస్య వాల్యూమ్. 1 ( 2005 )
  • దర్బార్ ( 2003 )
  • మహేశ్వర మంత్ర ( 2002 )
  • సౌల్ ఫుడ్ ( 2005 )
  • జస్రాజ్, పండిట్ - వాల్యూమ్. 2 - హవేలీ సంగీత్
  • ఇన్స్పిరేషన్ ( 2000 0
  • రాగాలు - త్రివేణి, ముల్తానీ
  • రాగాలు - బిహడ, గౌడగిరి మల్హార్
  • వర్షిప్ బై మ్యూజిక్ / లైవ్ స్టుగ్గార్ట్' 88
  • ఆర్నమెంటల్ వాయిస్

బయటి లింకులు

మార్చు
  • [1] Archived 2009-01-23 at the Wayback Machine పండిట్ జస్రాజ్ వీడియో ఇంటర్‌వ్యూ
  • [2] పండిట్ జస్రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్, న్యూయార్క్
  • [3] పూర్వి రాగ - వీడియో
  • [4] జస్రాజ్‌తో ముఖాముఖి
  • [5] మేరో మన్ మోహియా

వనరులు

మార్చు
  • 1. [6] ఎక్స్‌ప్రెస్స్ ఇండియా - వార్తలు
  • 2. [7] జస్రాజ్‌పై మోహన్ నడ్‌కర్ణి వ్యాసం
  • 3.[8] Archived 2005-01-15 at the Wayback Machine హిందూ దినపత్రికలో హైదరాబాద్‌లో సంగీత్ సమారోహ్ గురించి వార్త -

మూలాలు

మార్చు
  1. "Legendary Indian vocalist Pandit Jasraj passes away". Mumbai Live. 17 August 2020. Retrieved 18 August 2020.
  2. "Clipping of Andhra Jyothy Telugu Daily - Telangana". epaper.andhrajyothy.com. Retrieved 2020-08-19.[permanent dead link]
  3. Radia, H. J. (2020-08-18). "Pandit Jasraj: tributes paid to 'incomparable genius' of Indian classical music". the Guardian (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
  4. "Pandit Jasraj's body reaches Mumbai from New Jersey, cremation tomorrow". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-08-19. Retrieved 2020-08-20.
  5. "Pandit Jasraj Biography: Birth, Death, Career, Awards, Recognitions and More". Jagranjosh.com. 2020-08-18. Retrieved 2020-08-19.
  6. "గ్రహశకలాలకు మన పేర్లు". www.andhrajyothy.com. 2019-10-03. Archived from the original on 2019-10-03. Retrieved 2019-10-03.